నుమాయిష్ 2023
నుమాయిష్ | |
---|---|
ప్రక్రియ | స్టేట్ ఫెయిర్ |
తేదీలు | 1 జనవరి - 15 ఫిబ్రవరి |
ప్రదేశం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
క్రియాశీల సంవత్సరాలు | 1938 - ప్రస్తుతం |
నుమాయిష్ 2023 అనేది హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏటా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన. 82వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన 2023 జనవరి 1 నుంచి 45 రోజుల పాటు జరగనుంది.[1] దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులతో 2వేలకు పైగా స్టాళ్లు ఇందులో కొలువుదీరాయి.
నుమాయిష్ లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నిరకాల ఉత్పత్తులతో కూడిన స్టాళ్లు ఉంటాయి. అలాగే పిల్లల కోసం ప్రత్యేకంగా అమ్యూజ్ మెంట్ పార్క్ ఉంటుంది.
చరిత్ర
[మార్చు]ఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
1938లో స్థానికంగా ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రోత్సహించేందుకు నుమాయిష్ ప్రారంభించారు. హైదరాబాద్ స్టేట్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీనికి ఆద్యుడు. కేవలం 50 స్టాల్స్‌తో ప్రారంభిమైన ఈ ఎగ్జిబిషన్ అనతికాలంలోనే దేశంలో అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనలలో ఒకటిగా పేరుగాంచింది. వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు ప్రజలకు చేరువయ్యేందుకు ఎగ్జిబిషన్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. 1949లో ఈ నుమాయిష్ ని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా పేరు మార్చి అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సి. రాజగోపాలాచారి ప్రారంభించారు.
- నుమాయిష్ 2019లో భారీ అగ్నిప్రమాదం జరిగి వందలాది స్టాళ్లు కాలిబూడిదయ్యాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది.
- నుమాయిష్ 2020 గత ఏడాది జరిగిన అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో ఎగ్జిబిషన్ సొసైటీ పలు జాగ్రత్తలతో ఎగ్జిబిషన్ ప్రారంభించింది. స్టాళ్ల పైకప్పులకు జింక్ రూఫ్ వేయడంతోపాటు ప్రమాదాలను నివారించేందుకు ఫైర్ హైడ్రాన్ట్స్ ఏర్పాటు చేసారు. అగ్నిమాపక యంత్రాలు త్వరితగతిన చేరుకునేలా చెర్యలు చేపట్టారు. 9 అత్యవసర ఎగ్జిట్ మార్గాలను ఏర్పాటు చేసారు.
- నుమాయిష్ 2021కి కరోనా ప్రభావంతో ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. 1947లో దేశానికి స్వాతంత్య్రం, 48లో హైదరాబాద్ సంస్థానం విలీనం వంటి సంఘటనల నేపథ్యంలో కూడా నుమాయిష్ రద్దయ్యింది.
- నుమాయిష్ 2022 ప్రారంభమై మరుసటి రోజే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మూసి వేసారు. అయితే కొవిడ్ నిబంధనలు సడలించడంతో ఎగ్జిబిషన్‌ను తిరిగి 2022 ఫిబ్రవరి 20 నుంచి మార్చి నెలాఖరు వరకు నిర్వహించారు.
నిర్వహణ
[మార్చు]ఈ sectionలో మూలాలను ఇవ్వలేదు. |
నుమాయిష్ 2023లో మొత్తం 2,400 స్టాళ్లను ఏర్పాటు చేసారు. కరోనా కారణంగా నుమాయిష్ నిర్వహణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు అశ్విని మార్గం ప్రకటించారు. సందర్శకుల కోసం ఉచిత పార్కింగ్ తో పాటు వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసారు. ప్రవేశ రుసుము పెద్దలకు రూ.40 కాగా ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా అనుమతిస్తారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3:30 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ప్రదర్శన కొనసాగుతుంది.ఉచితంగా వైఫై కూడా ఈ సంవత్సరo ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రారంభం
[మార్చు]82వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)ను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 2023 జనవరి 1న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.[2]
రవాణా సదుపాయం
[మార్చు]నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటయిన ఈ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ 25 డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులను నడుపుతుంది.
నాంపల్లి, గాంధీభవన్ మెట్రో స్టేషన్లు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు సమీపంగా ఉంటాయి. మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్-రాయదుర్గం మార్గాల్లో నడిచే మెట్రో రైళ్లను నుమాయిష్ ను దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి 12 వరకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
అగ్నిప్రమాదం
[మార్చు]నుమాయిష్ సందర్శకుల కోసమై ఏర్పాటు చేసిన పార్కింగ్ లో 2023 జనవరి 21న అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో మొత్తం ఐదు కార్లు దగ్దమయ్యాయి.[3]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Numaish: రేపటి నుంచి నెలన్నర పాటు జరగనున్న నుమాయిష్". web.archive.org. 2023-01-01. Archived from the original on 2023-01-01. Retrieved 2023-01-01.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Velugu, V6 (2023-01-01). "నుమాయిష్లో షాపింగ్ అనుభూతి అపూర్వం : మంత్రి హరీశ్ రావు". V6 Velugu. Archived from the original on 2023-01-01. Retrieved 2023-01-01.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Fire Accident Near Nampally Numaish Exhibition - Sakshi". web.archive.org. 2023-01-22. Archived from the original on 2023-01-22. Retrieved 2023-01-22.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)