Jump to content

నీల్ దమన్ ఖత్రీ

వికీపీడియా నుండి
నీల్ దమన్ ఖత్రీ

పదవీ కాలం
2013 – 2015
ముందు జస్వంత్ సింగ్ రాణా
తరువాత శరద్ చౌహాన్
నియోజకవర్గం నేరేల

వ్యక్తిగత వివరాలు

జననం 1970
నేరేలా, ఢిల్లీ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి కేశరాణి
నివాసం ఢిల్లీ
వృత్తి రాజకీయ నాయకుడు

నీల్ దమన్ ఖత్రీ (జననం 2 మే 1970) ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు నేరేల శాసనసభ నియోజకవర్గం నుండి 2013లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

నీల్ దమన్ ఖత్రీ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివివిధ హోదాల్లో పని చేసి 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో నేరేల శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి వీరేందర్‌పై 23,545 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి శరద్ చౌహాన్ చేతిలో 40,292 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

నీల్ దమన్ ఖత్రీ 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో నేరేల శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి శరద్ చౌహాన్ చేతిలో 17,429 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]

వివాదం

[మార్చు]

2014 నవంబర్ 14న నరేలాలో జరిగిన కూల్చివేత కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులపై రాళ్లు రువ్విన గుంపుకు నాయకత్వం వహించడం, ఈ హింసాత్మక సంఘటనలో అల్లర్లకు పాల్పడటం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే నీల్ దామన్ ఖత్రి, ఆయన సహచరుడు జోగిందర్ దహియాలను ఢిల్లీ కోర్టు దోషులుగా నిర్ధారించింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "పెయిడ్ న్యూస్ కేసులో 9 మంది". Sakshi. 4 December 2013. Archived from the original on 8 February 2025. Retrieved 8 February 2025.
  2. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  3. "Narela Assembly Election Result 2020, Vote Counting Live Updates on Narela Seat" (in ఇంగ్లీష్). 11 February 2020. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.
  4. "Delhi court convicts former BJP MLA for leading mob" (in ఇంగ్లీష్). The New Indian Express. 4 January 2025. Archived from the original on 9 February 2025. Retrieved 9 February 2025.