పాటిల్ నీరజా రెడ్డి

వికీపీడియా నుండి
(నీరజా రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పాటిల్‌ నీరజారెడ్డి
పాటిల్ నీరజా రెడ్డి


ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1973
వేంపల్లె, వేంపల్లె మండలం వైఎస్‌ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం 16 ఏప్రిల్ 2023
బీచుపల్లి, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు రాంచిన్నారెడ్డి
జీవిత భాగస్వామి పాటిల్ శేషిరెడ్డి
సంతానం హిమవర్షిణి
మతం హిందూ

పాటిల్ నీరజా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2009లో ఆలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది.

రాజకీయ జీవితం

[మార్చు]

పాటిల్ నీరజా రెడ్డి తన భర్త పత్తికొండ మాజీ ఎమ్మెల్యే పాటిల్ శేసిరెడ్డి ఫ్యాక్షన్ గొడవల వల్ల 1996లో మరణించడంతో ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఆమె 2004లో పత్తికొండ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప అభ్యర్థి ఎస్.వి. సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయింది.

నీరజారెడ్డి 2009లో ఆలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి 2011లో నియోజకవర్గంలో అవినీతి జరుగుతుందని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది. ఆమె ఆ తరువాత కొంతకాలం సమైక్యాంధ్ర పార్టీలో పని చేసిన తర్వాత కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండి 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరింది.

నీరజారెడ్డి ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరగా ఆమెకు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా నియమితురాలైంది.

మరణం

[మార్చు]

నీరజా రెడ్డి 2023 ఏప్రిల్ 16న కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలం, జింకలపల్లి - బీచుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారు వెనక టైర్ పేలడంతో అదుపు తప్పి కారు పల్టీలు కొట్టడంతో తల, శరీర భాగాలకు తీవ్ర గాయలయ్యాయి. ఆమెను కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా గాయాలు తీవ్రమవడంతో చికిత్స పొందుతూ మరణించింది.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 April 2023). "విషాదం.. రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మృతి". Archived from the original on 17 April 2023. Retrieved 17 April 2023.
  2. Andhra Jyothy (16 April 2023). "మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డికి దుర్మరణం". Archived from the original on 17 April 2023. Retrieved 17 April 2023.
  3. Eenadu (16 April 2023). "రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి మృతి". Archived from the original on 17 April 2023. Retrieved 17 April 2023.