నిషా నూర్
నిషా నూర్ | |
---|---|
జననం | నిషా నూర్ 1962 సెప్టెంబరు 18 |
మరణం | 2007 ఏప్రిల్ 23 | (వయసు 44)
వృత్తి | సినిమా నటి |
నిషా నూర్ (1962, సెప్టెంబరు 18 – 2007, ఏప్రిల్ 23) తమిళనాడుకు చెందిన సినిమా నటి. 1980లలో తమిళ సినిమారంగంలోకి అడుగుపెట్టిన నిషా నూర్ తమిళం, మలయాళ, తెలుగు, కన్నడ భాషల సినిమాలలో రజినీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి అగ్రనటులతో నటించింది.[1]
జననం
[మార్చు]నిషా నూర్ 1962, సెప్టెంబరు 18న తమిళనాడులోని నాగపట్టినంలో జన్మించింది.
సినిమారంగం
[మార్చు]నిషా నూర్ 1986లో వచ్చిన కళ్యాణ అగతిగల్, 1990లో వచ్చిన అయ్యర్ ది గ్రేట్ సినిమాలలో నటించి గుర్తింపు పొందింది. టిక్ టిక్ టిక్, చువప్పు నాద, మిమిక్స్ యాక్షన్ 500, ఇనిమై ఇదో ఇదో మొదలైన అనేక ఇతర సినిమాలలో కూడా నటించింది. 1980 నుండి 1986 వరకు తన కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకుంది. దాదాపు 15 ఏళ్ళపాటు కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగింది.[2] కె. బాలచందర్, విసు, చంద్రశేఖర్ వంటి దర్శకులతో పనిచేసింది.
మరణం
[మార్చు]నూర్‌ను ఓ నిర్మాత వ్యభిచారంలోకి దింపాడు.[3][4] నూర్ 2007, ఏప్రిల్ 23న ఎయిడ్స్ సంబంధిత సమస్యలతో చెన్నైలోని తాంబరంలో మరణించింది.[5]
తమిళం
[మార్చు]- మంగళ నాయకి (1980)
- ముయలక్కు మూను కాల్ (1980)
- ఇలమై కోలం (1980)
- ఎనక్కగా కాతిరు (1981)
- టిక్ టిక్ టిక్ (1981)
- మనమదురై మల్లి (1982
- ఇనిమై ఇధో ఇధో (1983)
- అవల్ సుమంగళితన్ (1985). . . స్టెల్లా
- శ్రీ రాఘవేంద్రర్ (1985)
- కళ్యాణ అగతిగల్ (1986)
- అవల్ ఒరు వసంతం (1992)
మలయాళం
[మార్చు]- చువప్పు నాడ (1990)
- మిమిక్స్ పరేడ్ (1990)
- అయ్యర్ ది గ్రేట్ (1990)
- దేవాసురం (1993)
- మిమిక్స్ యాక్షన్ 500 (1995)
మూలాలు
[మార్చు]- ↑ "This actress worked with Rajinikanth, Kamal Haasan, was forced into prostitution, lost all her money, died in pain".
- ↑ "రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌తో నటించిన హీరోయిన్.. చివరకు ఎయిడ్స్‌తో!". Sakshi. 2023-07-12. Archived from the original on 2023-07-13. Retrieved 2023-07-13.
- ↑ "Tragic Life Of South Actress Nisha Noor: Forced Into Prostitution, Died Due To AIDS".
- ↑ "From romancing Rajinikanth and Kamal Haasan in films to getting forced into prostitution and dying of AIDS, here's tragic journey of Nisha Noor".
- ↑ "'Iyer the Great' Nisha passes away..." malayalam.cinesouth.com. 5 July 2007. Archived from the original on 16 June 2008.