Jump to content

నిషాన్ మదుష్కా

వికీపీడియా నుండి
నిషాన్ మదుష్క
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కొత్తసింఘక్కరగే నిషాన్ మదుష్క ఫెర్నాండో
పుట్టిన తేదీ (1999-09-10) 1999 సెప్టెంబరు 10 (వయసు 25)
మొరటువా, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 163)2023 మార్చి 17 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2023 జూలై 24 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2018/19కోల్ట్స్ క్రికెట్ క్లబ్
2018/19Police Sports Club
2020–presentRagama Cricket Club
2022Colombo Stars
మూలం: Cricinfo, 17 March 2023

కొత్తసింఘక్కరగే నిషాన్ మదుష్క ఫెర్నాండో, శ్రీలంక క్రికెట్ ఆటగాడు.[1] 2018 ఏప్రిల్ లో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం దంబుల్లా జట్టులో ఎంపికయ్యాడు.[2] 2018 మే 2న 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్‌లో దంబుల్లా తరపున తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[3] లిస్ట్ ఎ అరంగేట్రం కంటే ముందు 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[4]

జననం

[మార్చు]

కొత్తసింఘక్కరగే నిషాన్ మదుష్క ఫెర్నాండో 1999, సెప్టెంబరు 10న శ్రీలంకలోని మొరటువాలో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

2018 ఆగస్టులో 2018 ఎస్ఎల్సీ టీ20 లీగ్‌లో గాల్లె జట్టులో ఎంపికయ్యాడు.[5] 2018 ఆగస్టు 25న గాలే తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[6] 2018 డిసెంబరులో 2018 ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు.[7] 2019 జనవరి 11న 2018–19 ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో కోల్ట్స్ క్రికెట్ క్లబ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[8]

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2023 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం శ్రీలంక టెస్టు జట్టులో మదుష్క ఎంపికయ్యాడు.[9] 2023 మార్చి 17న రెండవ టెస్ట్‌లోకి అరంగేట్రం చేసాడు.[10]

2023 ఏప్రిల్ 27న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మధుష్క తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. తర్వాత దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. 339 బంతుల్లో 22 బౌండరీలు, ఒక సిక్స్‌తో 205 పరుగులు చేశాడు. చివరకు శ్రీలంక మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది.[11]

మూలాలు

[మార్చు]
  1. "Nishan Madushka". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
  2. "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-23.
  3. "1st Match, Sri Lanka Super Four Provincial Limited Over Tournament at Colombo, May 2 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
  4. "U-19 Cricket: Kamindu to lead Sri Lanka U19s at ICC Youth WC". Sunday Times (Sri Lanka). Archived from the original on 2017-12-14. Retrieved 2023-08-23.
  5. "SLC T20 League 2018 squads finalized". The Papare. Retrieved 2023-08-23.
  6. "SLC T20 League at Dambulla, Aug 25 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
  7. "Sri Lanka Squad for the ACC Emerging Teams Cup 2018". Sri Lanka Cricket. Archived from the original on 3 December 2018. Retrieved 2023-08-23.
  8. "Group B, Premier League Tournament Tier A at Colombo, Jan 11-13 2019". ESPN Cricinfo. Retrieved 2023-08-23.
  9. "Sri Lanka select uncapped Madushka, Rathnayake for Test tour of New Zealand in March". ESPNcricinfo. Retrieved 2023-08-23.
  10. "2nd Test, Wellington, March 17 - 21, 2023, Sri Lanka tour of New Zealand". ESPNcricinfo. Retrieved 2023-08-23.
  11. "Mendis, Madushka double-tons give Sri Lanka a chance to push for victory". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-23.

బాహ్య లింకులు

[మార్చు]