Jump to content

నియంత్రణ రేఖ

వికీపీడియా నుండి
ఆకుపచ్చ రంగులో ఉన్నవి పాక్ ఆక్రమిత భాగాలు: ఉత్తరాన గిల్గిట్-బల్టిస్తాన్, దక్షిణాన ఆక్రమిత కాశ్మీరు. కాషాయ రంగులోది జమ్మూ కాశ్మీరు. వాలు గీతలతో సూచించిన భాగం చైనా ఆక్రమిత అక్సాయ్ చిన్.
ఐక్యరాజ్యసమితి మ్యాపులో నియంత్రణ రేఖ.  సియాచెన్ గ్లేసియరు వద్ద  నియంత్రణ రేఖను నిర్వచించలేదు

నియంత్రణ రేఖ (Line of Control-LoC) భారత పాకిస్తాన్‌ల అధీనంలో ఉన్న కాశ్మీరు భూభాగాలను విడదీసే రేఖ. ఈనాటికీ అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తింపు పొందలేదీ రేఖ. అయితే, వాస్తవానికి ఇది సరిహద్దుగానే ఉంది. తొలుత సంధిరేఖగా పిలవబడిన ఈ రేఖను 1972 జూలై 3 నాటి సిమ్లా ఒడంబడిక తరువాత నియంత్రణ రేఖగా పిలుస్తున్నారు. భారత్ అధీనంలో ఉన్న కాశ్మీరు సంస్థాన భాగం జమ్మూ కాశ్మీరు రాష్ట్రం కాగా, పాకిస్తాను అధీనంలో ఉన్న రెండు భాగాలను గిల్గిట్-బల్టిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీరు అని పిలుస్తారు. పాకిస్తాన్ దీన్ని ఆజాద్ కాశ్మీరు అని పిలుస్తుంది.

నియంత్రణ రేఖ కాశ్మీరు లోని అనేక గ్రామాలను, కుటుంబాలనూ విడదీసింది.[1][2]

జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి, చైనా అధీనంలో ఉన్న అక్సాయ్ చిన్‌కూ మధ్య ఉన్న సంధి రేఖను వాస్తవాధీన రేఖ (Line of Actual Control) అని అంటారు. ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో ఒకటిగా భావిస్తారు.[3][4]

వాదనలు

[మార్చు]

పాకిస్తానీ

[మార్చు]

1933 నాటి పాకిస్తాను ప్రకటన ప్రకారం కాశ్మీరు సంస్థానం ప్రతిపాదిత  పాకిస్తాను యొక్క భూభాగాల్లో ఒకటి. ఇప్పటికీ కాశ్మీరు మొత్తం  పాకిస్తానుకు చెందినదే అని పాకిస్తాను వాదిస్తుంది.

భారత్

[మార్చు]

కాశ్మీరు సంస్థానాధీశుడైన మహారాజా హరిసింగ్, మౌంట్‌బాటెన్ సూచన మేరకు[5][6] కాశ్మీరును భారత్‌లో విలీనం చేసాడు. దాంతో కాశ్మీరు సంస్థానం మొత్తం భారత్‌లో కలిసినట్లేనని భారత్ ప్రకటించింది. ఈ కారణంగా పాక్ ఆక్రమిత కాశ్మీరు కూడా భారత్‌లో అంతర్భాగమేనని భారత్ వాదన.

నియంత్రణ రేఖకు కంచె

[మార్చు]

నియంత్రణ రేఖ నుండి 150 గజాల లోపల భారత్ ఒక కంచెను నిర్మించింది. ఈ కంచె మొత్తం 550 కి.మీ. పొడవుంటుంది. పాకిస్తాను వైపు నుండి  ఉగ్రవాదులు భారత్ లోకి రాకుండా నిరోధించేందుకు ఈ కంచెను భారత్ నిర్మించింది.[7]

ఈ కంచెను రెండు వరుసలుగా 8 నుండి 12 అడుగుల ఎత్తుతో, ముళ్ళతీగలతో ఏర్పాటు చేసారు. రెండు వరుసల మధ్య మందుపాతరలను అమర్చారు.[8][9] కంచెకు విద్యుత్తు సరఫరా ఉంటుంది. కదలికలను గమనించే సెన్సర్లు, థెర్మల్ ఇమేజింగు సెన్సర్లు, లైటింగు వ్యవస్థలు, అలారములూ ఉంటాయి. ఈ వ్యవస్థలు, కంచె దాటబోయిన ముష్కరులను గుర్తించి భారత దళాలను సత్వరమే అప్రమత్తం చేస్తాయి. 

1990 ల్లో మొదలైన కంచె నిర్మాణం, 2000 లలో భారత పాకిస్తాను దళాల మధ్య ఘర్షణల కారణంగా నెమ్మదించింది. 2003 నాటి సంధి ఒడంబడిక  తరువాత నిర్మాణం తిరిగి మొదలై, 2004 సెప్టెంబరు 30.[10] భారత సైన్యం అంచనాల మేరకు, కంచె కారణంగా ఉగ్రవాదుల చొరబాటు 80% మేరకు తగ్గిపోయింది.[11]

ఈ కంచె ద్వైపాక్షిక ఒప్పందాలను, ఈ ప్రాంతానికి సంబంధించిన ఐక్యరాజ్యసమితి తీర్మానాలనూ అతిక్రమిస్తోందని పాకిస్తాను ఆరోపించింది.[12] ఐరోపా సమాఖ్య  భారత్ చర్యను సమర్ధించింది. ఉగ్రవాదుల చొరబాటును అరికట్టే సాంకేతికతను మెరుగు పరుస్తుందని అది చెప్పింది. 1972 సిమ్లా ఒప్పందం నియంత్రణ  రేఖను కచ్చితంగా నిర్వచించిందని కూడా ఈ సందర్భంగా ఐరోపా సమాఖ్య చెప్పింది.[12]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Ranjan Kumar Singh, Sarhad: Zero Mile, (Hindi), Parijat Prakashan, ISBN 81-903561-0-0
  2. Women in Security, Conflict Management, a Peace (Program) (2008). Closer to ourselves: stories from the journ towards peace in South Asia. WISCOMP, Foundation for Universal Responsibility of His Holiness the Dalai Lam 2008. p. 75. Retrieved 19 June 2013.{{cite book}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Analysis: The world's most dangerous place?
  4. "'Most dangerous place'". Archived from the original on 2014-03-13. Retrieved 2016-12-31.
  5. Viscount Louis Mountbatten, the last Viceroy of British India, stayed on in independent India from 1947 to 1948, serving as the first Governor-General of the Union of India.
  6. Stein, Burton. 1998.
  7. ""cross-border infiltration and terrorism"". Archived from the original on 2008-12-21. Retrieved 2016-12-31.
  8. "LoC fencing in Jammu nearing completion". The Hindu. Feb 1, 2004. Archived from the original on 16 ఫిబ్రవరి 2004. Retrieved 23 June 2012.
  9. "Mines of war maim innocents". Tehelka. Archived from the original on 2011-10-17. Retrieved 2016-12-31.
  10. "LoC fencing completed: Mukherjee". The Times Of India. 16 December 2004. Archived from the original on 2012-10-22. Retrieved 2016-12-31.
  11. "Harsh weather likely to damage LoC fencing". Daily Times. Retrieved 2007-07-31.
  12. 12.0 12.1 "EU criticises Pak's stand on LoC fencing". Express India. Dec 16, 2003. Archived from the original on 21 డిసెంబరు 2008. Retrieved 23 June 2012.

మరింత సమాచారం కోసం

[మార్చు]