Jump to content

నిమృత్ కౌర్ అహ్లూవాలియా

వికీపీడియా నుండి
నిమృత్ అహ్లూవాలియా
2024లో నిమృత్ కౌర్ అహ్లూవాలియా
జననం (1994-12-11) 1994 డిసెంబరు 11 (వయసు 30)[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
[చోటి సర్దార్ని
బిగ్ బాస్ హిందీ సీజన్ 16

నిమృత్ కౌర్ అహ్లూవాలియా (జననం 1994 డిసెంబరు 11), ఆమె ప్రధానంగా హిందీ టెలివిజన్‌లో పనిచేసే భారతీయ నటి.[2] ఆమె కలర్స్ టీవి (Colors TV) ధారావాహిక చోటి సర్దార్ణిలో ప్రధాన పాత్రను పోషించి తన నటనను ప్రారంభించింది. ఆమె రియాలిటీ షో బిగ్ బాస్ హిందీ సీజన్ 16లో పాల్గొనడం ద్వారా ప్రసిద్ది చెందింది.

న్యాయవాది వృత్తిని చేపట్టి రాణించాలని అందులో డిగ్రీ చేసినా, ఆమె మోడల్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ఆమె ఫెమినా మిస్ మణిపూర్ (2018) టైటిల్‌ను గెలుచుకుంది. ఫెమినా మిస్ ఇండియా 2018లో టాప్ 12లో ఒకరిగా నిలిచింది. ఆమెను నిమృత్ అహ్లూవాలియా అని కూడా పిలుస్తారు,[3]

కెరీర్

[మార్చు]

ఆమె విద్యార్థి దశలో, అధిక బరువు కారణంగా సహవిద్యార్థుల చేష్టలతో వేధనకు గురైంది, ఇది ఆమె మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది.[4] అయినా, మోడలింగ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించింది. 2018లో ఫెమినా మిస్ మణిపూర్ టైటిల్‌ను గెలుచుకుంది.[5]

ఆ తర్వాత, ఆమె బి ప్రాక్ మ్యూజిక్ వీడియో మస్తానీలో చేసింది. ఇక, ఆమె కెరీర్‌ను వినోద పరిశ్రమదారిలోకి నడిపించింది.

నిమృత్ కౌర్ అహ్లూవాలియా ప్రియకాంత లైశ్రమ్ రూపొందించిన 2018 ఎడ్యుకేషనల్ ఫిల్మ్‌ హూ సెడ్ బాయ్స్ కాంట్ వేర్ మేక్ అప్? లో నటించింది. 2019లో, ఆమె టెలివిజన్ ధారావాహిక చోటి సర్దార్ణిలో చేసింది, ఆమె మెహర్ ధిల్లాన్, సెహెర్ గిల్ పాత్రలతో తన కెరీర్‌ను మలుపుతిప్పింది, అది 2022లో ముగిసే వరకు ఆమెకు మంచి పేరు సంపాదించి పెట్టింది.[6] 2021లో, ఆమె బానెట్ దోసాంజ్‌ సీరియస్ అనే మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది.[7]

2022 నుండి 2023 వరకు, ఆమె కలర్స్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 16లో పాల్గొన్నది,[8] ఆమె చివరి వారంలో తొలగించబడి 6వ స్థానంలో నిలిచింది.[9]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర నోట్స్ మూలాలు
2019–2022 చోటి సర్దార్ని మెహెర్ కౌర్ ధిల్లాన్/సెహెర్ కౌర్ గిల్ [10][11]
2022–2023 బిగ్ బాస్ సీజన్ 16 పోటీదారు 6వ స్థానం [12]

స్పెషల్ అప్పీయరెన్స్

[మార్చు]
సంవత్సరం టైటిల్ పాత్ర మూలాలు
2019 బిగ్ బాస్ సీజన్ 13 మెహర్ [13]
2020 బిగ్ బాస్ సీజన్ 134
నాటి పింకీ కి లంబీ లవ్ స్టోరీ
2021 శక్తి - అస్తిత్వ కే ఎహసాస్ కీ
ఇష్క్ మే మార్జవాన్ 2 సెహెర్
ఉదారియన్
ది బిగ్ పిక్చర్ [14]
2022 ది ఇండియన్ గేమ్ షో నిమృత్ అహ్లూవాలియా
ఖత్రా ఖత్రా ఖత్రా [15]

మ్యూజిక్ వీడియోలు

[మార్చు]
సంవత్సరం టైటిల్ గాయని / గాయకులు మూలాలు
2018 మస్తానీ బి ప్రాక్, జానీ [16]
2019 తీవ్రమైన బానెట్ దోసంజ్ [16]
2023 జిహాల్-ఎ-మిస్కిన్ శ్రేయా ఘోషల్, విశాల్ మిశ్రా [17]
సోనియే టోనీ కక్కర్, కమల్ కహ్లోన్ [18]
జానే జా స్టెబిన్ బెన్, అసీస్ కౌర్

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
సంవత్సరం పురస్కారం కేటగిరి ధారావాహిక ఫలితం మూలాలు
2021 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ ఉత్తమ నటి (నాటకం) ఛోటీ సర్దార్ణి నామినేట్ చేయబడింది [19]
ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ ఐకానిక్ పాత్ బ్రేకింగ్ నటి విజేత [20]
2023 ఇండియన్ టెలీ అవార్డ్స్ ఫ్యాన్ ఫేవరేట్ యాక్ట్రెస్ విజేత [21]

మూలాలు

[మార్చు]
  1. Bureau, ABP News (2022-12-11). "Nimrit Kaur Ahluwalia Receives Wishes on her 28th Birthday From Rumoured Boyfriend Mahir Pandhi. Watch". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2022-12-20.
  2. "Choti Sardarni's Nimrit Kaur Ahluwalia opens up on mental health; writes 'There were endless days of not wanting to wake up and feeling claustrophobic'". The Times of India. June 7, 2021.
  3. "Nimrit Kaur Ahluwalia Shares Her Transformational Journey After Femina Miss India 2018 - Beauty Pageants - Indiatimes".
  4. "Exclusive - I was fat-shamed and bullied in college, says Choti Sardarni's Nimrit Kaur Ahluwalia". The Times of India (in ఇంగ్లీష్). 2020-04-09. Retrieved 2023-07-18.
  5. "'Masstaani': B Praak's latest has a strong message". The Times of India. Retrieved 25 July 2018.
  6. Maheshwri, Neha. "Exclusive! I had to be fair to myself: Nimrit Kaur Ahluwalia on quitting Choti Sarrdaarni - Times of India". The Times of India.
  7. "Nimrit Kaur Ahluwalia to grace the 'Khatra Khatra Khatra' show - Beauty Pageants - Indiatimes". Femina Miss India. Archived from the original on 2023-01-07. Retrieved 2024-03-28.
  8. "Bigg Boss 16 contestant Nimrit Kaur Ahluwalia: Here's all you need to know about the Choti Sardarni actress - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-09-30.
  9. "Bigg Boss 16: After Nimrit Kaur Ahluwalia's Surprise Exit, Here Are The 5 Finalists". NDTV.com. Retrieved 2023-02-07.
  10. "Avinesh Rekhi, Nimrit Kaur Ahluwalia and Hitesh Bharadwaj at the launch of Choti Sarrdaarni". The Times Of India. Archived from the original on 29 June 2019.
  11. Maheshwri, Neha. "Exclusive! I had to be fair to myself: Nimrit Kaur Ahluwalia on quitting Choti Sarrdaarni - Times of India". The Times of India.
  12. Yadav, Monica (1 October 2022). "Bigg Boss 16: Sajid Khan, Tina Datta, Abdu Rozik, Nimrat Kaur Ahluwalia & more confirmed contestants from Salman Khan's reality show". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 1 October 2022.
  13. "Bigg Boss 13 Day 81 highlights: Rubina Dilaik, Nimrit Ahluwalia, other TV stars join Christmas celebrations". Firstpost (in ఇంగ్లీష్). 26 December 2019. Retrieved 2022-12-20.
  14. "The Big Picture: Nimrit Kaur Ahluwalia and Priyanka Chahar Choudhary challenge Ranveer Singh to enact to television dialogues; watch the Bollywood actor's killer expressions - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-20.
  15. "Nimrit Kaur Ahluwalia to grace the 'Khatra Khatra Khatra' show - Beauty Pageants - Indiatimes". Femina Miss India. Archived from the original on 2023-01-07. Retrieved 2024-03-28.
  16. 16.0 16.1 "Did you know 'Bigg Boss 16' contestant Nimrit Kaur Ahluwalia has done Punjabi music videos? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-01-24.
  17. "Nimrit Kaur Ahluwalia and Rohit Zinjurke promote their new song Zihaal-e-Miskin". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-05-26.
  18. "Nimrit Kaur Ahluwalia featuring 'Soniye' is out now! - Indiatimes". Femina Miss India. Retrieved 2023-08-22.
  19. "Indian Television Academy Awards Popular Actress Ashi Singh, Helly Shah, Mallika Singh, Shivangi Khedkar, and Rupali Ganguly are nomminess" (in ఇంగ్లీష్). 19 February 2021.
  20. "Iconic Gold Awards 2021: Hina Khan, Surbhi Chandna, Shivangi Joshi Win Big; Check Out the Full Winners' List!". Latestly. Retrieved 26 September 2021.
  21. "Indian Telly Awards 2023". www.indiantellyawards.com. Archived from the original on 2023-09-02. Retrieved 2023-04-27.