Jump to content

నిజామాబాదు వ్యవసాయ మార్కెట్

వికీపీడియా నుండి
నిజామాబాదు వ్యవసాయ మార్కెట్

నిజామాబాదు వ్యవసాయ మార్కెట్ తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, నిజామాబాదులో ఉంది. దాదాపు 67 ఎకరాల్లో విస్తరించివున్న ఈ మార్కెట్ తెలంగాణలోనే రెండవ అతిపెద్ద మార్కెట్.

చరిత్ర

[మార్చు]

1933లో నిజాం కాలంలో ఈ మార్కెట్ ప్రారంభించబడింది.[1] తెలంగాణ ప్రభుత్వ మార్కెటింగ్ విభాగం కమిటీ ఈ వ్యవసాయ మార్కెట్‌ను నిర్వహిస్తుంది.

మార్కెట్ వివరాలు

[మార్చు]

వరి, మొక్కజొన్న, పసుపు, పప్పుధాన్యాలు, సోయా చిక్కుడు, పొద్దుతిరుగుడు, ఆమ్చూర్, ఉల్లిపాయలు, ఇతర పంటలు ఈ మార్కెట్లో లభిస్తాయి. భారతదేశంలోని మార్కెట్లలో ఇది పసుపుకు ప్రసిద్ది చెందింది.[2][3]

ఈ-నామ్ మార్కెట్

[మార్చు]

ఇక్కడ ఎలక్ట్రానిక్ బరువు ప్రమాణాలను ఉపయోగించి ధాన్యపు బరువును నిర్ధారించడానికి జరుగుతుంది.[4] అందుకే 2016, ఏప్రిల్ 14న భారత ప్రభుత్వం జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ ప్రాజెక్ట్ (నామ్ ప్రాజెక్ట్) కోసం తెలంగాణలోని 40 మార్కెట్లలో ఒకటిగా మార్కెట్‌ను ఎంపిక చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పద్ధతిని ఈ-నామ్ అని పిలుస్తారు. ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారి అయినా మధ్యవర్తులు లేకుండా ఈ మార్కెట్లోని ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

ఈ-నామ్ ప్రాజెక్టుకు ముందు పసుపు రైతులు మంచిధర పొందడానికి మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు వెళ్ళేవారు.

అవార్డులు

[మార్చు]

2016లో ఈ మార్కెట్ దేశంలోని ఉత్తమ ఈ-నామ్ మార్కెట్ గా జాతీయ అవార్డు అందుకుంది.[5][6]

మూలాలు

[మార్చు]
  1. 10.60 lakh quintal turmeric crop reaches Nizamabad market yard
  2. Turmeric farmers an unhappy lot - The Hindu
  3. As exports rise, turmeric price shoots up in nizamabad market yard- The New Indian Express
  4. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (13 January 2015). "నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఈ-బిడ్డింగ్‌ పైలట్‌ ప్రాజెక్టు". www.andhrajyothy.com. Archived from the original on 30 జూలై 2019. Retrieved 30 July 2019.
  5. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (18 April 2017). "నిజామాబాద్ మార్కెట్‌యార్డుకు జాతీయ అవార్డు". www.ntnews.com. Archived from the original on 30 జూలై 2019. Retrieved 30 July 2019.
  6. Nizamabad market yard bags national award - The Hindu