నిజరూపాలు
స్వరూపం
నిజరూపాలు (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి.నందనరావు |
---|---|
తారాగణం | జి.రామకృష్ణ , విజయనిర్మల |
సంగీతం | సాలూరు హనుమంతరావు |
నిర్మాణ సంస్థ | ఉదయభాను ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నిజరూపాలు 1974లో విడుదలైన తెలుగు సినిమా. దీనిలో ఎస్.వి.రంగారావు ద్విపాత్రాభినయం చేశాడు.[1]
కథ
[మార్చు]జమీందారు కేశవవర్మ ఆస్తికి ఎసరు పెట్టడానికి ఎందరెందరో ఎన్నో రకాలుగా పన్నాగాలు పన్నుతుంటారు. ఆత్మీయులనుకొన్న వాళ్ళు శత్రువులవుతారు. అయినవాడు అనుకొన్న పెద్ద కొడుకు ప్రసాదవర్మ ప్రేమించిన వనిత కోసం ఇల్లు వదలి వెళ్ళిపోతాడు. ఆ అదను చూసి జమీందారును ఎవరో హత్యచేస్తారు. ఆ నేరం ప్రసాదవర్మపై పడింది. కళాప్రియుడు, సరళుడు, ధర్మాత్ముడు అయిన కేశవవర్మను పొట్టనపెట్టుకున్న నేరస్థుల కోసం పరిశోధన మొదలు పెడతారు ప్రసాదవర్మ, అతని భార్య అరుణ. వారి పరిశోధన పర్యవసానమేమిటనేది మిగిలిన కథ.
నటీనటులు
[మార్చు]- ఎస్.వి.రంగారావు
- రామకృష్ణ
- నాగభూషణం
- ప్రభాకరరెడ్డి
- రాజబాబు
- అల్లు రామలింగయ్య
- సి.హెచ్.కృష్ణమూర్తి
- వై.వి.రాజు
- పొట్టి ప్రసాద్
- పూసల
- విజయనిర్మల
- సూర్యకాంతం
- జి.నిర్మల
- జయకుమారి
- సుజాత
- బేబి ఉషారాణి
- సూర్యకళ
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె.వి.నందనరావు
- కథ: కొమ్మినేని శేషగిరిరావు
- మాటలు: ఆదివిష్ణు
- పాటలు: మైలవరపు గోపి, సి.నారాయణరెడ్డి, దాశరథి
- సంగీతం: సాలూరు హనుమంతరావు
- ఛాయాగ్రహణం: మధు
- కళ: భాస్కరరాజు
- కూర్పు: బి.గోపాలరావు
- నిర్మాత: బి.సరోజినీసీతారామ్
పాటలు
[మార్చు]- ఓడిపోదురా న్యాయం వీడబోకు నీ శాంతం - ఎ.వి.యన్.మూర్తి - రచన: గోపి
- కృష్ణా మయింటికి రావో గజ్జలందియల్ ఘల్ ఘల్ - కౌసల్య
- నేనంటే చెకుముకి చెకుముకి రవ్వనురో సై అంటే - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: సి.నారాయణరెడ్డి
- రాజరాజశ్రీ దొరగారు కాబోయే మా శ్రీవారూ - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రమణ్యం - రచన: రాజశ్రీ
- లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ హి ఈజ్ మిస్టర్ జేమ్స్ - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: గోపి
- సకల లోక బాంధవం కరుణరస పయోనిధిం (శ్లోకం) - ఎస్.పి. బాలసుబ్రమణ్యం - రచన: దాశరథి
- సింగపూరు లేడీ నీ అందమైన బాడీ నా సొంతమైతే - ఎస్.పి. బాలసుబ్రమణ్యం, బి.వసంత - రచన: దాశరథి
మూలాలు
[మార్చు]- ↑ సంపాదకుడు (5 April 1974). "నిజరూపాలు". ప్రగతి వారపత్రిక. 6 (1): 20–21. Retrieved 27 December 2017.[permanent dead link]