నా పిలుపే ప్రభంజనం
నా పిలుపే ప్రభంజనం (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
---|---|
తారాగణం | కృష్ణ |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | పద్మాలయా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నా పిలుపే ప్రభంజనం పద్మాలయా ఫిల్మ్స్ బేనర్‌పై కృష్ణ సమర్పణలో జి.ఆదిశేషగిరిరావు నిర్మించిన రాజకీయ ప్రేరేపిత సినిమా. ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉండగా అతడి పరిపాలను విమర్శిస్తూ త్రిలింగ రాజ్యాధిపతి అంటూ ఎన్టీయార్‌ను పోలిన కారెక్టరును పెట్టి, కోదండరామయ్య అని పేరుపెట్టి ఈ సినిమాను పి.చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో నిర్మించాడు. ఈ సినిమా 1986 సెప్టెంబర్ 10న విడుదలయ్యింది.
తారాగణం
[మార్చు]- కృష్ణ - ప్రతాప్
- కీర్తి - వాసంతి
- కైకాల సత్యనారాయణ - కోదండరామయ్య
- ప్రభాకరరెడ్డి
- నూతన్ ప్రసాద్
- గొల్లపూడి మారుతీరావు
- కోట శ్రీనివాసరావు
- గిరిబాబు
- సంగీత
- రాజ్యలక్ష్మి
- చంద్రమోహన్
- తులసి
- జె.వి.సోమయాజులు - జానకిరామయ్య
- గుమ్మడి
- అన్నపూర్ణ
- నిర్మలమ్మ
- వై.విజయ
- త్యాగరాజు
- పి.ఎల్. నారాయణ
- విజయలలిత
- వరలక్ష్మి
- మాడా
- సాక్షి రంగారావు
- వల్లం నరసింహారావు
- జయమాలిని
సాంకేతిక వర్గం
[మార్చు]- చిత్రానువాదం: ఘట్టమనేని హనుమంతరావు
- పాటలు: ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి, మోదుకూరి జాన్సన్, జాలాది,జి.కె.మూర్తి
- నేపథ్య గాయకులు: పి.సుశీల, రాజ్ సీతారాం
- సంగీతం: రాజ్ - కోటి
- ఛాయాగ్రహణం: పుష్పాల గోపీకృష్ణ
- కూర్పు: కోటగిరి గోపాలరావు
- కళ: కళాధర్
- పోరాటాలు: సూపర్ సుబ్బరాయన్
- నిర్మాత: ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
- దర్శకుడు: పి.చంద్రశేఖరరెడ్డి
టూకీగా కథ
[మార్చు]రిటైర్మెంటు వయసు 58 నుంచి 55కు (సినిమాలో 59 నుంచి 56 అని చూపారు) తగ్గించడం వలన ఓ టీచరు గుండె పగిలి చనిపోవడం, ఇద్దరు అల్లుళ్లు పాలనలో జోక్యం చేసుకోవడం, తక్కినవాళ్లందరూ తనకు ఒంగి ఒంగి దణ్ణాలు పెట్టాలని పాలకుడు ఆశించడం, మాటిమాటికి తెలుగు, తెలుగు అంటూండడం - వంటి ఘటనలు పెట్టి, ఎన్టీయార్‌పైనే ఈ సినిమాలో పూర్తిగా అస్త్రాలను సంధించారు. సినిమా చివర్లో కృష్ణ యీ నియంతృత్వంపై తిరగబడి విజయం సాధిస్తాడు. కోదండరామయ్య పారిపోగా, చిన్నల్లుడు జైలుకి వెళతాడు[1].
మూలాలు
[మార్చు]- ↑ ఎమ్బీయస్ ప్రసాద్. "ఎమ్బీయస్: ఎన్టీయార్ - 08". గ్రేట్ ఆంధ్ర. Archived from the original on 6 జూన్ 2020. Retrieved 6 June 2020.