Jump to content

నారాకోడూరు

అక్షాంశ రేఖాంశాలు: 16°11′N 80°33′E / 16.183°N 80.550°E / 16.183; 80.550
వికీపీడియా నుండి
నారాకోడూరు
తెనాలి, బాపట్ల వెళ్లు రహదారులలో నారాకోడూరు గ్రామం జంక్షన్
తెనాలి, బాపట్ల వెళ్లు రహదారులలో నారాకోడూరు గ్రామం జంక్షన్
పటం
నారాకోడూరు is located in ఆంధ్రప్రదేశ్
నారాకోడూరు
నారాకోడూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°11′N 80°33′E / 16.183°N 80.550°E / 16.183; 80.550
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాగుంటూరు
మండలంచేబ్రోలు
విస్తీర్ణం12.09 కి.మీ2 (4.67 చ. మై)
జనాభా
 (2011)
6,564
 • జనసాంద్రత540/కి.మీ2 (1,400/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,250
 • స్త్రీలు3,314
 • లింగ నిష్పత్తి1,020
 • నివాసాలు1,800
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్522212
2011 జనగణన కోడ్590300

నారాకోడూరు, గుంటూరు జిల్లా, చేబ్రోలు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన చేబ్రోలు నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1800 ఇళ్లతో, 6564 జనాభాతో 1209 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3250, ఆడవారి సంఖ్య 3314. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1557 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 77. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590300[2].గుంటూరు నుండి పొన్నూరు వైపు, తెనాలి వైపు వెళ్ళే రోడ్లు ఈ గ్రామం వద్దే చీలిపోతాయి.

గ్రామ చరిత్ర

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[3]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

[మార్చు]

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

సమీప గ్రామాలు

[మార్చు]

సుద్దపల్లి 3 కి.మీ, వేజెండ్ల 4 కి.మీ, చేబ్రోలు 5 కి.మీ, శ్రీరంగాపురం 6 కి.మీ, వడ్లమూడి 7 కి.మీ.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల చేబ్రోలులోను, ఇంజనీరింగ్ కళాశాల వడ్లమూడిలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల వడ్లమూడిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

నారాకోడూరులో ఉన్న ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

నారాకోడూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు (కెనరా బ్యాంక్.) ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆశా కార్యకర్త, ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 20 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

నారాకోడూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 133 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1076 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 537 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 539 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

నారాకోడూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 294 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 245 హెక్టార్లు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]
  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- దేశ, విదేశాలలో ఉంటున్న ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుచున్నారు. [ఈనాడు గుంటూరు సిటీ; 2015, ఆగస్టు-11; 29వపేజీ]
  2. సి.ఎం.ఎస్.వసతిగృహం.

రాజకీయాలు

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన బండ్లమూడి వెంకట శివయ్య బీ.ఎస్.సీ, 1955లో మార్టూరు ఎం.ఎల్.ఏగా పోటీచేసి గెలుపొందారు. అక్కడ రైతులు పొగాకు ఎక్కువగా పండించేవారు. ఆయన పొగాకు పరిశోధనలు నిర్వహించుచూ, రైతులకు చేరువయ్యారు. 1962 వరకూ ఎం.ఎల్.ఏగా ఉన్నారు. 1972 లో మొదటిసారి ఇండియన్ టొబాకో గ్రోయర్స్ అసోసియేసన్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, పొగాకు ఉత్పత్తిదారుల సమస్యలను వెలుగులోకి తెచ్చారు. భారత ప్రభుత్వం 1974 లో ది ఇండియన్ టొబాకో డెవెలప్‍మెంట్ కౌన్సిల్ అధ్యక్షునిగా ఎన్నిక చేసింది. 1978 వరకూ ఆ పదవిలో ఉన్నారు. నాలుగు సార్లు పొగాకు బోర్డు ఉపాధ్యక్షునిగా పదవి చేపట్టారు. మళ్ళీ భారతప్రభుత్వం 1975 నుండి 1988 వరకూ బోర్డు అధ్యక్షునిగా నియమించింది. 1984 లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో పోటీచేసి గెలుపొంది, 1990 వరకూ సర్పంచిగా పనిచేశారు. ఈయన హయాంలో గ్రామంలో యస్.సీ., యస్టీ కాలనీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన గుర్తుగా రహదారికి "శివయ్య బాట"గా నామకరణం చేశారు. గుంటూరు పట్టణం, చేబ్రోలు మండలం, వట్టి చెరుకూరు మండలాలలో 25,000 ఎకరాల భూమి, సాగులోనికి రావటానికి శివయ్య ప్రముఖ పాత్ర వహించారు. గుంటూరు ఛానల్ రూపకల్పనలో ఆయన చేసిన కృషితోనే పట్టణానికి తాగునీరు, భూమికి సాగునీరు అందుతోంది.[4]

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో జాలాది లక్ష్మీదుర్గ, సర్పంచిగా ఎన్నికైంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
  1. శ్రీ వినాయకస్వామివారి విగ్రహం:- స్థానిక గుండవరం రహదారిప్రక్కన, గణేష్ సంఘం ఆధ్వర్యంలో, గ్రామస్థుల సహకారంతో ఏర్పాటుచేసిన ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2015, మే-31వ తేదీ ఆదివారంనాడు, వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [4]
  2. శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
  3. క్వారీ శ్రీ బాలకోటేశ్వరస్వామివారి ఆలయం.
  4. శ్రీ చింతయ్య, వీరమ్మ పేరంటాలమ్మ అమ్మవార్ల ఆలయం:- స్థానిక గుండవరం రహదారిపై ఉన్న ఈ ఆలయంలో, వార్షిక తిరునాళ్ళు, 2016, ఫిబ్రవరి-21వ తేదీ మాఘశుద్ధ చతుర్దశినాడు వైభవంగా నిర్వహించారు. 22వ తెదీ పౌర్ణమినాడు అమ్మవారి కల్యాణం నిర్వహించి, అనంతరం భక్తులకు అన్నసమారధన నిర్వహించెదరు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

[మార్చు]

మద్దినేని సుధాకర్

[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ మద్దినేని కోటేశ్వరరావు, సామ్రాజ్యం దంపతులు సామాన్య రైతు కుటుంబీకులు. వీరి కుమారుడు శ్రీ సుధాకర్, ప్రస్తుతం గుంటూరులోని ఆర్.వి.ఆర్ & జె.సి. ఇంజనీరింగు కళాశాలలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. వీరు సమాజసేవ చేయుచూ, విద్యార్థులచేత చేయించుచూ, పలువురికి ఆదర్శంగా నిలుచుచున్నారు. చిన్నతనంలో తన తల్లికి బ్లడ్ క్యాన్సర్ సోకగా, అందుకు రక్తం కోసం వీరు పడిన బాధ ఇతరులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వీరు, 2004లో వేయిమందితో రక్తదాతల క్లబ్ స్థాపించి, ఇప్పటికి 40కి పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. 4500 మందికి పైగా రక్తదానం చేసారు. తను స్వయంగా 48 పర్యాయాలు రక్తదానం చేసారు. 2003లోనే వీరు, ఆర్.వి.ఆర్ & జె.సి. ఇంజనీరింగు కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్.యెస్.యెస్) ఏర్పాటుచేసి, విద్యార్థులకు సామాజిక సృహను రగిలించారు. ప్రకృతి విపత్తులు వచ్చినపుడుగూడా, తాను కూడబెట్టిన సొమ్ముతోపాటు, విరాళాలు సేకరించి, బాధితులను ఆదుకుంటున్నారు. వీరి సేవలకు గుర్తింపుగా ఇంతవరకు 34 పురస్కారాలు అందుకున్నారు. 2012, డిసెంబరు-12నాడు, జాతీయ సేవా పథకం ద్వారా 7,500 మంది విద్యార్థులతో చెప్పులు లేకుండా, "ఆరోగ్యం కొరకు నడక" కార్యక్రమాన్ని ఐదు కి.మీ. మేర నిర్వహించి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. తాజాగా వీరు రాష్ట్రపతి చేతులమీదుగా ఇందిరా గాంధీ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

గణాంకాలు

[మార్చు]
  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 6300, పురుషుల సంఖ్య 3125, మహిళలు 3175, నివాస గృహాలు 1546, విస్తీర్ణం 1209 హెక్టారులు

మూలాలు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
  4. ఈనాడు గుంటూరు రూరల్ జులై 20, 2013. పేజీ-9.