నారద నారది
స్వరూపం
నారద నారది (1946 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | రాజా గజపతిదేవ్, చిత్తజల్లు పుల్లయ్య |
తారాగణం | పి.సూరిబాబు, లక్ష్మీరాజ్యం, ముదిగొండ లింగమూర్తి, సూర్యకాంతం, పద్మనాభం, విశ్వనాధం, చంద్రకళ, సౌదామిని, వెల్లాల ఉమామహేశ్వరరావు, జి.ఎన్.సూరి |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నారద నారది 1946లో విడుదలైన తెలుగు పౌరాణిక చలనచిత్రం. సి.పుల్లయ్య దర్శకత్వంలో జగన్‌మోహిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. పర్లాకిమిడి జమిందారు రాజా గజపతిదేవ్ ఈ చిత్ర నిర్మాత. 'నారద నారది' చిత్రం ద్వారా సంగీతదర్శకుడుగా సుసర్ల దక్షిణామూర్తి, మూగ పాత్రలో సూర్యకాంతం పరిచయం అయ్యారు. పి. సూరిబాబు, లక్ష్మీరాజ్యం ముఖ్యపాత్రలు పోషించారీ చిత్రంలో.[1]
తారాగణం
[మార్చు]పి.సూరిబాబు
లక్ష్మీరాజ్యం
ముదిగొండ లింగమూర్తి
సూర్యకాంతం
పరబ్రహ్మ శాస్త్రి
పద్మనాభం
విశ్వనాధం
చంద్రకళ
సౌధామిని
వెల్లాల ఉమామహేశ్వరరావు
జి.ఎన్.సూరి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు:రాజా గణపతి దేవ్ , చిత్తజల్లు పుల్లయ్య
- నిర్మాత: రాజా గణపతి దేవ్
- సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
- నిర్మాణ సంస్థ: జగన్ మణి
- విడుదల:06:10:1946.
పాటలు
[మార్చు]- చిగురులు తిని పొగరెక్కితివా
- ఏమని పాడుదునో
- ఎయిరా సూస్తవేరా
- ఇలాటి సుఖములు కలవా కలవా
- కోరికలన్నీ పూలుగజేసి
- నా మనసు వంటిది నీ మనసైతే
- నారదుడు పెండ్లికుమారుడైనాడు
- నోములపంటగదా నా నోములపంటగదా
- ఓహె చిన్నదానా బలేమంచిదానా
- ఊహాతీతమహా యేమిది