నాగారం (కీసర మండలం)
నాగారం | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°28′59″N 78°36′30″E / 17.483010°N 78.608299°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్‌గిరి |
మండలం | కీసర |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ 500083 | |
ఎస్.టి.డి కోడ్ 08720 |
నాగరం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కీసర మండలంలోని గ్రామం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న నాగారం పురపాలకసంఘం ఏర్పడింది.[2]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం. 30502, పురుషులు 15504, స్త్రీలు 14998, నివాస గృహాలు.1985. ఆరు 6 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు 3680, అక్షరాస్యులు 22907 ప్రధాన భాష. తెలుగు.
సమీప గ్రామాలు
[మార్చు]పర్వతపూర్ 5 కి.మీ. చీర్యాల్ 5 కి.మీ. చంగిచెర్ల 6 కి.మీ. జవహర్ నగర్ 7 కి.మీ. యాద్గార్ పల్లి 7 కి.మీ దూరంలో ఉన్నాయి.
విద్యాసంస్థలు
[మార్చు]గ్రామంలో హరిజన కాలేజి ఆఫ్ ఫార్మసి, గౌతమీ వికాస్ మోడల్ స్కూల్, సెయింట్ మేరీ బెతోని కాన్వెంట్ స్కూల్, సెయింట్ ఆంతోని గ్రామర్ స్కూల్, జిల్లాపరిషత్ హైస్కూల్ ఉన్నాయి.[3]
అభివృద్ధి పనులు
[మార్చు]నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 15, 17, 3వ వార్డులలో 75 లక్షల 30 వేల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు 2022 జూన్ 22న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, కమిషనర్ ఎ. వాణిరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లేష్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4]
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 2 April 2021.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-26. Retrieved 2016-06-06.
- ↑ telugu, NT News (2022-06-22). "తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే : మంత్రి మల్లారెడ్డి". Namasthe Telangana. Archived from the original on 2022-06-22. Retrieved 2022-06-22.