నాగరాజు సురేంద్ర
నాగరాజు సురేంద్ర | |
---|---|
జననం | 1953 |
వృత్తి | వైద్యుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కవి, రచయిత, వైద్యుడు |
నోట్సు | |
సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం 2023 |
నాగరాజు సురేంద్ర , తెలంగాణ రాష్ట్రం , కరీంనగర్ జిల్లా, కరీంనగర్ మండలం లోని ఎలగందుల గ్రామానికి చెందిన కవి, రచయిత. పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’' గ్రంథాన్ని గాలిబ్ నాటి కాలం పేరుతో తెలుగు భాషలో అనువదించి పుస్తకం ప్రచురించినందుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం - 2023 లభించింది.[1][2][3] ఎలనాగ కలం పేరుతో రచనలు చేస్తూ రాణిస్తుంటాడు. వృత్తిరీత్యా వైద్యుడు, ప్రవృత్తి రీత్యా కవి, రచయిత, అనువాదకుడు, విమర్శకుడుగా ప్రసిద్ధి.
జీవిత విశేషాలు
[మార్చు]నాగరాజు సురేంద్ర, కరీంనగర్ జిల్లా , ఎలగందుల గ్రామంలో 1953లో జన్మించాడు.[4] అతను ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పడే రచనా వ్యాసంగం ప్రారంభించాడు. విద్యార్థి దశలో అతను రాసిన కవిత మొదటిసారిగా కరీంనగర్ నుండి అప్పట్లో వెలువడుతుండిన ‘గౌతమి’ అనే పత్రికలో ప్రచురితమైంది. అప్పుడు మొదలైన రచనా వ్యాసంగం మెడిసిన్ చదువుతున్నప్పుడు మరింత విస్తరించింది.
వృత్తి
[మార్చు]1. వైద్య విధాన పరిషత్ లో రాష్ట్ర స్థాయిలో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు.
పుస్తకాలు
[మార్చు]- వాగంకురాలు (కవితా సంపుటి)
- సజల నయనాల కోసం (కవితా సంపుటి)
- అంతర్లయ (కవితా సంపుటి)
- అంతర గాంధారం (కవితా సంపుటి)
- అంతర్నాదం (కవితా సంపుటి)
- పెన్మంటలు – కోకిలమ్మ పదాలు (గేయసంపుటి)
- అంతస్తాపము (ఛందోబద్ధ పద్యాల సంపుటి)
- మోర్సింగ్ మీద మాల్కౌఁస్ రాగం (ప్రయోగ పద్యాల సంపుటి)
- కొత్తబాణి (ప్రయోగ పద్యాల సంపుటి)
- పొరుగు వెన్నెల (ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసిన కవితా సంపుటి)
- ఊహల వాహిని (ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసిన కవితా సంపుటి)
- ఫేడెడ్ లీవ్స్ అండ్ ఫైర్ ఫ్లైస్ (ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసిన కవితా సంపుటి)
- ఇంప్రెషన్-ఇమేజెస్ (ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసిన కవితా సంపుటి)
- మెమొరబుల్ మెలోడీ మేకర్స్ అండ్ అదర్ పోయెమ్స్ ఆన్ మ్యూజిక్ (ఆంగ్లం నుండి తెలుగులోకి తర్జుమా చేసిన కవితా సంపుటి)
- కథాతోరణం (వివిధ దేశాల కథల అనువాద గ్రంథం)
- గాలిబ్ – నాటి కాలం (పవన్ కె. వర్మ రాసిన ‘గాలిబ్: దమ్యాన్, ద టైమ్స్’ గ్రంథ అనువాదం)
- భాషాసవ్యతకు బాటలు వేద్దాం
- యుక్తవాక్యం
- నుడిక్రీడ (ప్రామాణిక గళ్లనుడికట్ల పుస్తకం)
- పన్’నీటి జల్లు
- మేధామథనం
- పళ్లెరం (భాష, సాహిత్యం, సంగీతాల మీద రాసిన వ్యాసాల సంపుటి)
- ఉత్తమ ఆఫ్రికన్ కథలు
పురస్కారాలు
[మార్చు]- తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారం-2017.
- కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం-2023.
మూలాలు
[మార్చు]- ↑ "నాగరాజు సురేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం". EENADU. Retrieved 2024-03-12.
- ↑ https://www.eenadu.net/telugu-news/ap-top-news/general/2501/124048895
- ↑ "[[ఎలనాగ]]కు సాహిత్య అకాడమీ అనువాద అవార్డు - Prajasakti". 2024-03-11. Retrieved 2024-03-13.
{{cite web}}
: URL–wikilink conflict (help) - ↑ telugu, NT News (2024-03-12). "నాగరాజు సురేంద్రకు కేంద్ర సాహిత్య అవార్డు". www.ntnews.com. Retrieved 2024-03-13.