నాగన్నపాలెం(మద్దిపాడు)
నాగన్నపాలెం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
నాగన్నపాలెం(మద్దిపాడు) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°39′43.200″N 80°2′1.140″E / 15.66200000°N 80.03365000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | మద్దిపాడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08592 ) |
పిన్కోడ్ | 523 211 |
రవాణా సౌకర్యాలు
[మార్చు]నాగన్నపాలెం గ్రామం నుండి జాతీయరహదారి వరకు, రు. 80 లక్షలతో నూతనంగా నిర్మించనున్న రహదారికి, 2015,మే-24వ తేదీ ఆదివారంనాడు, భూమిపూజ నిర్వహించారు.
సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]ఊర చెరువు:- ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016,మే-17న, పూడికతీత కార్యక్రమం ప్రారంభించారు. సారవంతమైన ఈ మట్టిని, ఈ గ్రామ రైతులు, తమ ట్రాక్టర్లతో పొలాలకు తరలించుకొనిపోవుచున్నారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామంలో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ
[మార్చు]2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, ఎం.శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనారు.
ప్రధానపంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]- నల్లూరి వెంకటేశ్వర్లు (ప్రముఖ రంగస్థల నటులు)
మూలాలు
[మార్చు]