నవ్వుల తోట
రకం | హాస్య మాసపత్రిక |
---|---|
సంపాదకులు | కోసూరు గురునాథమూర్తి |
స్థాపించినది | ఆగస్టు 1, 1922 |
భాష | తెలుగు |
కేంద్రం | మచిలీపట్నం |
నవ్వుల తోట 1922, ఆగస్టు నెలలో ప్రారంభమైన హాస్య పత్రిక. ఇది మాసపత్రికగా వెలువడింది. కృష్ణాజిల్లా, మచిలీపట్నం నుండి ఈ పత్రిక ప్రచురితమయ్యింది. కోసూరు గురునాథమూర్తి సంపాదకునిగా వ్యవహరించినాడు.
విశేషాలు
[మార్చు]తనదైన ప్రత్యేకశైలి కారణంగా, అప్పట్లో ఈ పత్రిక పాఠకాదరణ బాగా పొందింది. ఈ పత్రికలో వచ్చిన శీర్షికల్లో ‘సంపాదకీయ వ్యాఖ్యానాలు, విలేఖరులకు బ్రత్యుత్తరములు, కబుర్లు, పిట్టకథలు..’ మొదలైనవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఇందులో వచ్చిన వ్యంగ్య రచనల్ని పాఠకులు ఎంతో ఆసక్తిగా చదివేవారు. ఈ పత్రికలో ‘విదూషకోపన్యాసము’ శీర్షికలో ప్రచురితమైన ‘స్త్రీల ప్రత్యేక సభ’ అనే వ్యాసం పాఠకుల్ని కడుపారా నవ్వించింది. అందులోని ఓ భాగం ఇలా సాగుతుంది... ‘పీతవర్ణపు పింగళాక్షులును, రక్తవర్ణపు రమణీమణులును, కృష్ణవర్ణపు కేశినులును, శుక్లవర్ణపు సుదతులు సభనలంకరించి యుండిరి. నేను చతికిలబడి ఐదారు నిముసములైనదో లేదో! జారుముళ్ళవారును, ముచ్చటముళ్ళవారును, ముందుకత్తిరింపులవారును, వలపలి పాపటలవారును, డాపలి పాపటలవారును, జారుముళ్ళవారును, జంటజడలవారును, కండ్ల జోళ్ళవారును, కాళ్ళజోళ్ళవారును, మేజోళ్ళవారును, మెడపట్టీల వారును, పైటలంగాలవారును, పట్కాలవారును, గూడకట్లవారును, కుచ్చెళ్ళవారును, జాకెట్లవారును, జారుపైటల వారును...’ అంటూ సాగిన ఈ వ్యాసం అప్పట్లో పాఠకులను ఎంతగానో నవ్వించింది. ఈ వ్యాస రచయిత పేరు ఇందులో ప్రచురితం కాలేదు.[1]
మూలాలు
[మార్చు]- ↑ కప్పగంతు రామకృష్ణ. "తెలుగులో హాస్యపత్రికలు: ఒక పరిశీలన". ఔచిత్యమ్. Retrieved 27 February 2025.