Jump to content

నరేంద్ర దభోల్కర్

వికీపీడియా నుండి
నరేంద్ర దభోల్కర్
జననం
నరేంద్ర దభోల్కర్

(1945-11-01)1945 నవంబరు 1
మరణం20 ఆగస్టు 2013(2013-08-20) (aged 67)
వృత్తిసామాజిక కార్యకర్త
జీవిత భాగస్వామిషైలా
పిల్లలుముక్తా, హమీద్

నరేంద్ర అచ్యుత్ దభోల్కర్ (1945 నవంబరు 1 – 2013 ఆగస్టు 20) [1] ఒక భారతీయ హేతువాది, మహారాష్ట్రకు చెందిన రచయిత. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా గళం విప్పి వాటి నిర్మూలనకు "మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి " (MANS) స్థాపించాడు. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

దభోల్కర్ 1945 నవంబరు 1 లో అచ్యుత్, తారాబాయి దంపతులకు జన్మించాడు. వీరికి 10 మంది సంతానం. కనిష్ఠ కుమారుడు నరేంద్ర దభోల్కర్. జ్యేష్ఠ కుమారుడైన దేవదత్త దభోల్కర్ ప్రముఖ గాంధేయవాది, సామజిక వేత్త, విద్యావేత్త. .[2] సతారా, సాంగ్లీలలో విద్యాభ్యాసం జరిగింది. వైద్యపట్టా 'మీరజ్' మెడికల్ కాలేజినుండి పొందాడు.[1] ఇతను షైలాను వివాహమాడాడు, వీరికి ఇద్దరు సంతానం, కొడుకు హమీద్, కుమార్తె ముక్తా దభోల్కర్.[3] తన కుమారునికి ప్రముఖ సంఘసంస్కర్త హమీద్ దల్వాయ్ పేరును పెట్టాడు.[4]

శివాజీ విశ్వవిద్యాలయంలో కబడ్డీ కేప్టన్ గా ఉన్నాడు. ఇతడు భారత్ తరపున బంగ్లాదేశ్ లో కబడ్డీ టోర్నమెంటులో పాల్గొన్నాడు. ఇతడికి మహారాష్ట్ర ప్రభుత్వంచే " శివ ఛత్రపతి యువ పురస్కారం " లభించింది.[1][5]

సామాజిక కార్యకర్తగా

[మార్చు]

వైద్యుడిగా 12 సం.లు పనిచేసిన తరువాత దభోల్కర్ సామాజిక రంగంలో 1980 లో ఉద్యమించాడు.[6][7] బాబా అధవ ఉద్యమమైన వన్ విలేజ్ - వన్ వెల్ లాంటి సామాజిక న్యాయ ఉద్యమాలలో పాల్గొన్నాడు.[8]

ఆ తరువాత దభోల్కర్ అంధవిశ్వాసాలను రూపుమాపాలనే దృష్టితో అఖిలభారతీయ అంధశ్రద్ధా నిర్మూలన సమితిలో చేరాడు. 1989 లో 'మహారాష్ట్ర అంధశ్రద్ధా నిర్మూలన సమితి ' ని స్థాపించి అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపాడు. మాంత్రిక తాంత్రికుల క్షుద్రవిద్యలకు వ్యతిరేకంగా పనిచేశాడు.[9][10] దేశంలో 'గాడ్ మెన్ ' లుగా ప్రసిద్ధి చెందిన సాధువులనూ వారి లీలలను, మాంత్రిక శక్తులనూ ఖండించాడు, విమర్శించాడు, వారి శిష్యులనూ భక్తగణాలనూ విమర్శించాడు.[11] సతారా లోని "పరివర్తన్" సంస్థకు స్థాపక సభ్యుడు.[12] ప్రముఖ భారతీయ హేతువాద సంస్థ యైన సనల్ ఎదమరుకు తో సమీప సంబంధాలను కలిగి ఉన్నాడు.[13] సానే గురూజీ స్థాపించిన మరాఠీ వారపత్రికైన "సాధన"కు దభోల్కర్ ఎడిటర్.[6] భారతీయ హేతువాద సంఘానికి ఉపాధ్యక్షుడిగానూ సేవలందించాడు. 1990–2010 మధ్యకాలంలో దభోల్కర్ దళితుల సమానత్వంకోసం, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు, మరాఠ్వాడా విశ్వవిద్యాలయానికి 'బాబాసాహెబ్ అంబేద్కర్ ' పేరును పెట్టడం కోసం పోరాడాడు. అంధవిశ్వాసాలూ వాటి నిర్మూలన గురించి పుస్తకాలు వ్రాసాడు. దాదాపు 3000 పైగా సభలను ఉద్దేశించి ప్రసంగించాడు.[3] హోళీ సందర్భంగా ఆసారాం బాపూ ను విమర్శించాడు, మహారాష్ట్రలో తీవ్ర కరవు అలుముకుని ఉంటే హోళీ పండుగ సందర్భాన అతని శిష్యగణానికి నీటిని వృధా చేస్తున్నందున తీవ్రంగా వ్యతిరేకించాడు.[14][15]

అంధవిశ్వాస, క్షుద్రవిద్య వ్యతిరేక బిల్లు

[మార్చు]

2010 దభోల్కర్ అనేక పర్యాయాలు మహారాష్ట్రలో "అంధవిశ్వాసాల వ్యతిరేక బిల్లు" తేవడానికి ప్రయాసపడ్డాడు, కాని విజయం పొందలేక పోయాడు. ఇతని ఆధ్వర్యంలో "జాదూ టోనా వ్యతిరేక బిల్లు" (Anti-Jaadu Tona Bill ) ముసాయిదా తయారైంది.[16] ఈ బిల్లును హిందూ తీవ్రవాద సంస్థలు, హిందూ ఛాందసవాదులూ, అభ్యుదయ వ్యతిరేక వాదులూ తీవ్రంగా వ్యతిరేకించాయి, అలాగే వర్కారీ తెగ కూడా వ్యతిరేకించింది.[6] రాజకీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, శివసేన మొదలగు పార్టీలూ వ్యతిరేకించాయి. ఈ బిల్లు వలన భారతీయ సంస్కృతి, విశ్వాసాలు, ఆచారాలు దెబ్బతింటాయని వాదించాయి.[17] విమర్శకులైతే ఇతడిని "మతవ్యరేకి"గా అభివర్ణించారు. ఫ్రాన్స్ ప్రెస్ ఏజెంసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దభోల్కర్ ఇలా అన్నాడు "ఈ బిల్లులో ఒక్క పదమైనా దేవుడు లేదా మతం అనేవాటికి వ్యతిరేకంగానూ లేదా గురించినూ లేదు. ఇలాంటిదేమీ లేదు. భారత రాజ్యాంగం మతపరమైన హక్కును స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది, ఎవరైనా ఏ మతమైనా అవలంబించవచ్చును, కానీ ఈ బిల్లు, అంధవిశ్వాసాలకూ, ద్రోహపూరిత ఆచారాలగూర్చిమాత్రమే.[11]

మరణానికి కొద్ది వారాలకు ముందు దభోల్కర్ ఈ బిల్లు గురించి చర్చే జరగలేదు, ఎన్నోసార్లు శాసనసభలో ప్రవేశపెట్టబడిననూ చర్చలకు నోచుకోలేదని విమర్శించాడు. మహారాష్ట్రలో అభ్యుదయ భావాలకు ముఖ్యమంత్రి చవాన్ తీవ్ర అడ్డంకిగా తయారయ్యాడనీ విమర్శించాడు.[18] దభోల్కర్ హత్య జరిగిన ఒకదినం తరువాత, మహారాష్ట్ర కేబినెట్ ఈ "జాదూ టోనా వ్యతిరేక-బిల్లు"ను ఆర్డినెంస్ ద్వారా పాస్ చేసింది. అయిననూ ఇపుడు ఈ బిల్లు శాసనంగా మారుటకు పార్లమెంటు ఆమోదించాల్సి వుంటుంది.[11][19]

హత్య

[మార్చు]

దభోల్కర్ అనేక హత్యాబెదిరింపులకు ఎదుర్కొన్నాడు. 1983 నుండి అనేక అవమానాలనూ భరించాడు. పోలీసుల భద్రతను వద్దన్నాడు.[3]

"ఒకవేళ నేను నాదేశంలో నా ప్రజల మధ్య పోలీసుల భద్రత తీసుకుంటే, ఇందులో నాలోనే ఏదో దోషం ఉన్నట్లు, నేను భారతీయ రాజ్యాంగ చట్టాల ద్వారానే ఎవరితోనూ కాదుగాని, అందరికోసం పోరాడుతున్నాను."[3]
- పోలీసుల భద్రతను నిరాకరిస్తున్న సంధర్భంగా

నరేంద్ర దభోల్కర్

2013 ఆగస్టు 20 న హత్య గావింపబడ్డాడు. ఉదయాన కాలినడక బయల్దేరాడు, ఓంకారేశ్వర్ మందిరం వద్ద గుర్తు తెలియని దుండగులు 7:20 సమయాన ద్విచక్రవాహనంలో వచ్చి తుపాకీతో కాల్చి చంపారు.[20][21] రెండు బుల్లెట్లు అతని తల, చాతీలోనూ దూసుకుపోయాయి. పుణె లోని ససూన్ వైద్యశాలలో మరణించాడు.

దభోల్కర్ హత్యను అనేక రాజకీయ పార్టీల నేతలు, సామాజిక వేత్తలు, సంఘ సేవకులు ఖండించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ హత్యను ఖండిస్తూ, ఈ హత్యా నేరస్తుల గురించి తెలిపిన వారికి 10 లక్షల రూపాయల బహుమానాన్ని ప్రకటించాడు.[12][22] అనేక రాజకీయ పార్టీలు ఆగస్టు 21 న పుణెలో బంద్ ను ప్రకటించాయి,[23] పుణె నగరంలోని అనేక సంస్థలు దభోల్కర్ హత్యకు నిరసనగా బందును పాటించి తమ సంస్థలను మూసి ఉంచాయి.[24] చవాన్ 2013 ఆగస్టు 26 న, ఈ హత్య గురించి పోలీసులకు కొన్ని సాక్ష్యాలు లభించాయని ప్రకటించాడు.[25]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 Shailendra Paranjpe (20 August 2013). "Narendra Dabholkar: A rationalist to the core". DNA. Retrieved 21 August 2013.
  2. Chinchkar Dilip Kumar (2010-12-19). "तर्कशुद्ध विचारांचा मूर्तिमंत आविष्कार: परिवर्तन चळवळीतील विचारवंत शिक्षक". Sakal (in Marathi). Mumbai. p. 9.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  3. 3.0 3.1 3.2 3.3 Radheshyam Jadhav (21 August 2013). "Doctor who fought to stamp out superstition". Times of India.
  4. "Dabholkar practised what he preached". Business Standard. 24 August 2013. Retrieved 2 October 2013.
  5. "Founder:Dr. Narendra Dabholkar". Maharashtra Andhashraddha Nirmoolan Samiti. Retrieved 2010-12-21.
  6. 6.0 6.1 6.2 "Narendra Dabholkar, the man who waged a war against superstition in all forms". DNA. Pune. 2013-08-20.
  7. Johannes Quack (2011). Disenchanting India: Organized Rationalism and Criticism of Religion in India. Oxford University Press. p. 145. ISBN 978-0-19-981260-8. Retrieved 20 August 2013.
  8. Satyajit Joshi (21 August 2013). "Dabholkar was a true crusader of rationalism". Hindustan Times. Archived from the original on 25 సెప్టెంబరు 2013. Retrieved 1 సెప్టెంబరు 2013.
  9. Priyanka Kakodkar (21 August 2013). "He was not against God but fought exploitation". The Hindu.
  10. <"Anti-superstition campaigner killed in Pune". Business Standard. 2013-08-20.
  11. 11.0 11.1 11.2 "Narendra Dabholkar: India's Maharashtra state bans black magic after killing". BBC India. 21 August 2013.
  12. 12.0 12.1 Deshmukh, Chaitraly (20 August 2013). "Anti-superstition leader Narendra Dabholkar shot dead; Prithviraj Chavan announces Rs10 lakh reward for info on killers". Mumbai: DNA. Retrieved 20 August 2013.
  13. Maseeh Rahman (2013-08-20). "Indian anti-superstition activist Narendra Dabholkar shot dead". The Guardian.
  14. "Social group blames Asaram Bapu for 'wasting' water". Nagpur: Yahoo! News. 13 March 2013. Retrieved 22 August 2013.
  15. Mehta, Tejas (18 March 2013). "As Maharashtra battles drought, Asaram Bapu wastes water, abuses media". Mumbai: NDTV. Retrieved 22 August 2013.
  16. "Full text of the draft Anti-Superstition Law proposed by Narendra Dabholkar". DNA. Pune. 2013-08-20.
  17. "Pilgrims' annual march of faith may grind to a halt". Times of India. Archived from the original on 31 ఆగస్టు 2013. Retrieved 20 August 2013.
  18. "'CM failed to discuss Anti-Jaadu Tona Bill'". DNA. Pune. 2013-08-06.
  19. "Maharashtra Cabinet clears anti-black magic and superstition ordinance". IBNLive. 2013-08-21. Archived from the original on 2013-08-24. Retrieved 2013-09-01.
  20. "A blow by blow account of the last moments of Narendra Dabholkar's life". DNA. 2013-08-20.
  21. Sorry doctor, we didn’t deserve you - The Hindu
  22. "Anti-superstition activist Dabholkar shot dead in Pune; CM, Pawar condemn killing". The Times of India. Pune. 2013-08-20.
  23. "Bandh in Pune over rationalist Narendra Dabholkar's murder". 21 August 2013. Retrieved 21 August 2013.
  24. Bende, Anurag (22 August 2013). "Bandh a partial success". Pune: Daily News and Analysis. Retrieved 22 August 2013.
  25. Times of India, Aug 26, 2013, Pune Police have some clues in Narendra Dabholkar murder case: Prithviraj Chavan (Accessed on 26 Aug 2013)

బాహ్య లింకులు

[మార్చు]