నరనారాయణ సేతు వంతెన
స్వరూపం
నరనారాయణ సేతు | |
---|---|
నిర్దేశాంకాలు | 26°13′N 90°34′E |
OS grid reference | [1] |
దీనిపై వెళ్ళే వాహనాలు | రోడ్డు, రైల్వే |
దేనిపై ఉంది | బ్రహ్మపుత్రా నది |
స్థలం | జోగిఘోపా, అస్సాం |
లక్షణాలు | |
డిజైను | ట్రస్ |
మొత్తం పొడవు | 2.284 కిలోమీటర్లు |
అత్యంత పొడవైన స్పాన్ | 125 మీ. |
స్పాన్ల సంఖ్య | 10 |
చరిత్ర | |
నిర్మించినవారు | ది బ్రెయిత్‌వైట్ బర్న్ & జెస్సోప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ |
నిర్మాణం ప్రారంభం | 1989 |
నిర్మాణ వ్యయం | రూ. 301 కోట్లు |
ప్రారంభం | 1998 ఏప్రిల్ 15 |
ప్రదేశం | |
Lua error in మాడ్యూల్:Mapframe at line 384: attempt to perform arithmetic on local 'lat_d' (a nil value). |
చరిత్ర
[మార్చు]ఈ వంతెన బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. దీన్ని రోడ్డు, రైలు మార్గాలు రెండింటి కోసం నిర్మించారు. బ్రహ్మపుత్రా నదిపై నిర్మించిన మూడవ వంతెన ఇది. ఈ వంతెన అస్సాంలోని బొంగైగావ్ జిల్లా లోని జోగిఘోపాను, గోల్‌పారా జిల్లా లోని పంచరత్నల కలుపుతుంది. కోచ్ వంశానికి చెందిన 16 వ శతాబ్దపు రాజు నర నారాయణ్ పేరుమీదుగా ఈ వంతెనకు నరనారాయణ సేతు అని పేరు పెట్టారు. దీని నిర్మాణం 1989 లో మొదలైంది. 1998 ఏప్రిల్ 15 న అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించాడు. డబుల్ డెక్ మోడల్‌లో నిర్మించిన ఈ వంతెన నిర్మాణానికి సుమారు రూ. 301 కోట్ల రూపాయలు ఖర్చయింది.[1][2]
ఈ ట్రస్ రకం వంతెన పొడవు 2.284 కిలోమీటర్లు. దీన్ని ది బ్రెయిత్‌వైట్ బర్న్ & జెస్సోప్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. 125 మీటర్ల పొడవుండే ప్రధాన స్పాన్లతో దీన్ని నిర్మించారు.
మూలాలు
[మార్చు]- ↑ "Naranarayan Setu In India". India9. Retrieved 5 October 2018.
- ↑ "Model project on Construction of Naranarayan Setu over river Brahmaputra at Jogihopa" (PDF). Archived from the original (PDF) on 14 ఏప్రిల్ 2014. Retrieved 28 మే 2019.