Jump to content

నఫీసా జోసెఫ్

వికీపీడియా నుండి
నఫీసా జోసెఫ్
అందాల పోటీల విజేత
Nafisa Joseph on trains and at stations.jpg
జననము(1978-03-28)1978 మార్చి 28
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
మరణము2004 జూలై 29(2004-07-29) (వయసు 26)
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
పూర్వవిద్యార్థిసెయింట్. జోసెఫ్ కళాశాల, బెంగుళూరు
వృత్తిమోడల్, టీవీ ప్రెజెంటర్, నటి
బిరుదు (లు)ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 1997
ప్రధానమైన
పోటీ (లు)
ఫెమినా మిస్ ఇండియా 1997
(విజేత)
మిస్ యూనివర్స్ 1997
(టాప్ 10)

నఫీసా జోసెఫ్ (1978 మార్చి 28 - 2004 జూలై 29) భారతీయ మోడల్. ఆమె ఎంటీవీ వీడియో జాకీ. ఆమె ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ 1997 విజేత. అంతేకాకుండా ఆమె మియామీ బీచ్‌లో జరిగిన మిస్ యూనివర్స్ 1997 పోటీలో ఫైనలిస్ట్ కూడా.

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 కిరీటం ధరించిన సినీ శెట్టి కంటే ముందు కర్ణాటకకు చెందిన ఆరుగురు మహిళలు మిస్‌ ఇండియా టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. వీరిలో లారా దత్తా, సారా జేన్ డయాస్, సంధ్యా చిబ్, రేఖా హండే, లిమరైనా డిసూజాలతో పాటు నఫీసా జోసెఫ్ ఉన్నారు.[1]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఆమె 1978 మార్చి 28న ఢిల్లీలో నిర్మల్ జోసెఫ్, ఉషా జోసెఫ్ దంపతులకు జన్మించింది.[2][3] అయితే కర్ణాటకలోని బెంగళూరులో పెరిగింది. ఆమె బిషప్ కాటన్ బాలికల పాఠశాల, సెయింట్ జోసెఫ్ కళాశాలలో చదువుకుంది.

కెరీర్

[మార్చు]

ఆమె 12 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ చేయడం ప్రారంభించింది. ప్రసాద్ బిడపా వద్ద ఆమె మోడల్‌గా ఎదిగింది. ఆమె 1997లో మిస్ ఇండియా పోటీలో గెలిచిన అతి పిన్న వయస్కురాలుగా వాసికెక్కింది. 1997 మే 16న ఫ్లోరిడాలోని మయామి బీచ్‌లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో కూడా ఆమె పాల్గొన్నది. ఈ పోటీలో ఆమె 10 మంది సెమీఫైనలిస్టులలో ఒకరుగా నిలిచింది.

1999లో, ఆమె ఎంటీవీ ఇండియా వి.జె. హంట్‌కి న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. అలాగే ఎం టీవీకి వీజెగా చేసింది. అలా ఆమె దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఎంటీవీ హౌస్ ఫుల్ షోను నడిపింది. ఆమె సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ లో ప్రసారమైన చార్లీస్ ఏంజిల్స్ (Charlie's Angels) భారతీయ వెర్షన్ C.A.T.S. అనే టెలివిజన్ సిరీస్‌లో కూడా నటించింది. 2004లో, ఆమె స్టార్ వరల్డ్‌లో స్టైల్ షోను నిర్వహించింది.

ఆమె తన కాబోయే భర్త గౌతం ఖండూజా సహాయంతో టెలివిజన్ ప్రోగ్రామింగ్ యూనిట్ 2 కంపెనీని కూడా ప్రారంభించింది. ఆమె గుర్ల్జ్ అనే పత్రికకు సంపాదకత్వం వహించింది. సుభాష్ ఘై చిత్రం తాల్‌లో ఆమె అతిధి పాత్రలో నటించింది.

మోడలింగ్, హోస్టింగ్ లతో పాటు, ఆమె జంతువుల ప్రేమికురాలుగా వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ (WSD), పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA), పీపుల్ ఫర్ యానిమల్స్ (PFA) వంటి పలు జంతు సంరక్షణ సంస్థలతో కలసి పనిచేసింది.టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగుళూరు ఎడిషన్‌లో నఫీసా ఫర్ యానిమల్స్ అనే వారపు కాలమ్ నిర్వహించింది.[4]

మరణం

[మార్చు]

2004 జూలై 29న వెర్సోవాలోని తన ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంకొన్ని వారాలలో వ్యాపారవేత్త గౌతమ్ ఖండూజాను వివాహం చేసుకోనున్న సమయంలో ఇలా జరిగింది.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "Miss India Sini Shetty: చిన్నప్పటి నుంచే కలలు కంది.. సాధించింది | a 21-year-old karnakata woman sini shetty wins miss india title in telugu". web.archive.org. 2023-07-28. Archived from the original on 2023-07-28. Retrieved 2023-07-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Bhakoo, Shivani (2 June 2002). "City's hospitality wins glamourous [sic] hearts". The Tribune. Archived from the original on 26 June 2002. Retrieved 24 June 2019.
  3. "Nafisa Joseph 1978-2004". MiD DAY. 31 July 2004. Retrieved 23 April 2011.
  4. "Nafisa Joseph profile on Femina Miss India". Archived from the original on 17 July 2012. Retrieved 30 July 2004.
  5. Goshwami, Kanta. "Nafisa Joseph - murder or suicide? The behind the scene real story." India Daily. 30 July 2004. Archived 27 ఏప్రిల్ 2006 at the Wayback Machine
  6. "Trial in Nafisa Joseph suicide case stayed". The Hindu. 30 November 2005. Archived from the original on 25 January 2013.