నడాదూరు రంగ రామానుజాచార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నడాదూరు రంగ రామానుజాచార్య ఇరవయ్యవ శతాబ్ది పూర్వభాగంలో నెల్లూరు రంగనాయకులపేటలో నివాసం ఉంటూ, నెల్లూరు వేదసంస్కృత పాఠశాలలో కొంతకాలం సంస్కృతం బోధించిన మహాపండితులు. ఈయన దేశంలోనే అనేక శాస్త్రాలు అధ్యనం చేసిన గొప్ప విదుషులని, తర్క, వ్యాకరణ శాస్త్రవేత్త అని ప్రసిద్హి. ఆనాటి నెల్లూరు పండితులు కాళిదాసు వెంకట సుబ్బాశాస్త్రి, పుష్పగిరి హనుమచ్చాస్త్రి వంటి గొప్ప పండితులు ఈయన మిత్రులు. 1950లో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఆద్వర్యంలో రాజ్యాంగ రచనాసంఘం ఏర్పాటు అయినపుడు, ఆ సభ్యులకు సందేహాలు కలిగితే వివరించడానికి భారత ప్రభుత్వం ఒక పండిత వర్గాన్ని నియమించింది. వారిలో నడాదూరు రంగ రామానుజాచార్య పేరు కూడా ఉంది. దురదృష్టం, ఆ నియామకం లేఖ అందే సమయానికి కొద్ది రోజుల ముందే ఆయన చనిపోయారు. షుమారు 65 సంవత్సరాలు జీవించి ఉంటారేమో!

రంగ రామానుజాచార్య రచనలు:

  1. మంజూషా వ్యాఖ్య
  2. పంచకావ్యవ్యాఖ్య
  3. ఆగమమీమాంసా
  4. ధాతుపాఠ కారికలు
  5. పూర్వమీమాంసా పరామర్శ
  6. గీతాభాష్య పరామర్శము

రంగ రామానుజాచార్య అల్లుడు కృష్ణస్వామి నెల్లూరు వేద సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా, మనుమడు గోపాలాచార్యులు నెల్లూరు వి.ఆర్.కళాశాలలో చరిత్ర ఉపన్యాసకులుగా పనిచేశారు.

మూలాలు

[మార్చు]
  • నెల్లూరు మండల సర్వస్వం, సంపాదకులు: ఎన్.ఎస్.కృష్ణమూర్తి, నెల్లూరు జిల్లాపరిషద్ ప్రచురణ, 1964, తృతీయ ఖండం లోని ఉడాలి సుబ్బారామశాస్త్రి వ్యాసం " నెల్లూరు మండల సంస్కృత విద్యా పరిచయము" pp 133-140