Jump to content

నటరాజన్ చంద్రశేఖరన్

వికీపీడియా నుండి
నటరాజన్ చంద్రశేఖరన్
నటరాజన్ చంద్రశేఖరన్, 2013
జననం
నటరాజన్ చంద్రశేఖరన్

(1963-06-02) 1963 జూన్ 2 (వయసు 61)
మోహనూర్, నామక్కల్ జిల్లా, తమిళనాడు, భారతదేశం
విద్యకోయంబత్తూరు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ
ఎన్.ఐ.టి తిరుచిరప్పల్లి
వృత్తిచైర్మన్, టాటా గ్రూప్
ఉద్యోగంటాటా గ్రూప్
బోర్డు సభ్యులుటాటా సన్స్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మానేజ్మెంట్, లక్నో
జీవిత భాగస్వామిలలిత చంద్రశేఖరన్
పిల్లలుప్రణవ్ చంద్రశేఖరన్[1]

నటరాజన్‌ చంద్రశేఖరన్‌ టాటా గ్రూప్‌ సంస్థల చైర్మన్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆయన టాటాసన్స్‌ చైర్మన్‌గా 2017 జనవరి 12న నియమితుడయ్యాడు.[2] నటరాజన్‌ చంద్రశేఖరన్‌కు 2022లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది.[3] టాటా సన్స్‌ ఛైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్‌ ఐదేళ్ల తన పదవీకాలాన్ని సమర్థంగా నిర్వహించారు. ఆ కారణంగా మరో ఐదేళ్లు పదవీకాలాన్ని పొడిగిస్తూ కంపెనీ బోర్డు 2022 ఫిబ్రవరి 11న నిర్ణయం తీసుకుంది.[4] ప్రస్తుతం టాటా సన్స్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న నటరాజన్‌ చంద్రశేఖరన్‌ ఇకపై ఎయిరిండియా విమానయాన సంస్థకూ ఛైర్మన్‌గా వ్యవహరిప్తారు. ఈ మేరకు ఎయిరిండియా బోర్డు ఆయన నియామకానికి 2022 మార్చి 14న ఆమోదం తెలిపింది.[5]

విద్యాభాస్యం , వృత్తి జీవితం

[మార్చు]

నటరాజన్ చంద్రశేఖరన్ మోహనూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి తర్వాత తమిళనాడులోని కోయంబత్తూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి 1986లో తమిళనాడు తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల నుండి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తి చేశాడు. ఆయన 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో చేరి ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేసి 2009 అక్టోబరు 6న టాటా సి.ఈ.ఓగా బాధ్యతలు చేపట్టాడు. చంద్రశేఖరన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ లో సీనియర్ సభ్యుడు, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, బ్రిటిష్ కంప్యూటర్ సొసైటీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నాడు.ఆయన 2015 ఏప్రిల్లో భారతీయ ఐటీ పరిశ్రమ సంస్థ నాస్కామ్ ఛైర్మన్‌గా నామినేట్ అయ్యాడు.

అవార్డులు , పురస్కారాలు\గుర్తింపు

[మార్చు]
  • CNN- IBN ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2014[6]
  • జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, హైదరాబాద్ నుండి 2014లో గౌరవ డాక్టరేట్‌ అందుకున్నాడు
  • 2013లో నెదర్లాండ్స్‌లోని టాప్ ప్రైవేట్ బిజినెస్ స్కూల్ నుండి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నాడు
  • చంద్రశేఖరన్‌కు 2013లో గీతం విశ్వవిద్యాలయం, 2012లో కే.ఐ.ఐ.టి విశ్వవిద్యాలయం, లో ఎస్.ఆర్.ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పలు విశ్వవిద్యాలయాలు గౌరవ డిగ్రీలను ప్రధానం చేశాయి.
  • ఇండియా టుడే 2017 భారతదేశంలోని 50 మంది అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో ఆయనకి 10వ ర్యాంక్ ఇచ్చింది.[7]
  • 2022లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ పురస్కారం

మూలాలు

[మార్చు]
  1. The Week (29 January 2017). "A nice man to know". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
  2. Vaartha (2 January 2017). "టాటాసన్స్‌ చైర్మన్‌గా నటరాజన్‌ చంద్రశేఖర్‌". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
  3. Andhrajyothy (26 January 2022). "చంద్రశేఖరన్‌కు పద్మ భూషణ్‌". Archived from the original on 26 January 2022. Retrieved 26 January 2022.
  4. "Tata Sons: టాటా సన్స్‌ ఛైర్మన్‌గా మళ్లీ చంద్రశేఖరన్‌". EENADU. Retrieved 2022-02-11.
  5. "ఎయిరిండియా చైర్మన్‌గా చంద్ర". andhrajyothy. Retrieved 2022-03-14.
  6. "List of winners of Indian of the Year 2014". News18.com. 2015-03-17. Retrieved 2016-08-03.
  7. "India's 50 powerful people". India Today. 14 April 2017.