నటనాలయం (నాటకం)
స్వరూపం
నటనాలయం | |
కృతికర్త: | మోదుకూరి జాన్సన్ |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | నాటకం |
ప్రచురణ: | సరళ పబ్లికేషన్స్ |
విడుదల: | 1965 |
పేజీలు: | 97 |
నటనాలయం మోదుకూరి జాన్సన్ రాసిన సాంఘీక నాటకం.[1] కళాకారుని జీవన నేపథ్యంలో రాయబడిన ఈ మెలోడ్రామా నాటకం తెలుగు నాటకరంగంలో అత్యుత్తమ నాటకాలలో ఒకటిగా గుర్తింపుపొంది, అనేక నాటకాలకు మార్గదర్శిగా నిలిచింది.[2] ఈ నాటకానికి ముందుగా అనుకున్న పేరు గిజిగాడు, కానీ ఇతర పాత్రల వల్ల నటనాలయం అని పేరు పెట్టారు.
కథానేపథ్యం
[మార్చు]నటుడు తన నటన ద్వారా ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తుంటాడుకానీ తన జీవితంలో అతనికి ఎన్నో సమస్యలు ఉంటాయి. నిజమైన నటుడు నటనలో జీవించాలేకాని జీవితంలో నటించకూడదన్న సందేశంతో నటనకు, జీవితానికి మధ్య నలిగిపోయి ఉక్కిరిబిక్కిరి అయిన రాజారావు జీవిత నేపథ్యంతో ఈ నాటకం ఉంటుంది. ఒక కళాతపస్వి కళకోసం పడే తపన, ఆవేదన, లక్ష్యసాధనలో బాహ్య పరిస్థితులలో పడే ఘర్షణ ఈ నాటకంలో అడుగడుగునా కనిపిస్తుంది.[3]
పాత్రలు
[మార్చు]- రాజారావు
- చిట్టిబాబు
- డాక్టర్
- గిజిగాడు
ఇతర వివరాలు
[మార్చు]- ఇది తొలిసారిగా వల్లూరి వెంకట్రామయ్య చౌదరి ఆధ్వర్యంలో ఆంధ్రరసాలిని సంస్థ తరపున ఆలపాటి వెంకట్రామయ్య కళాపరిషత్తులో ప్రదర్శించబడింది. ఆ తరువాత గురజాడ కళామందిరం (విజయవాడ) నుండి ఎ. శివరామిరెడ్డి, ఊట్ల బుడ్డయ్య చౌదరి విరివిగా ప్రదర్శించారు.
- రంగస్థల, సినిమా నటుడు దర్శకుడు సంజీవి ఈ నాటకంలోని చిట్టిబాబు పాత్ర ద్వారా నాటకరంగ జీవితాన్ని ప్రారంభించాడు. ఈ నాటకంలోని సంజీవి నటనను చూసి బి.ఎన్. రెడ్డి తన రంగులరాట్నం సినిమాలో బాలనటుడి వేషం ఇచ్చాడు.
- తెలుగు నాటకరంగంలోని అనేక నాటక సంస్థలచే ప్రదర్శించబడిన ఈ నాటకం ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును అందుకుంది.
- ఆంధ్ర నాటక కళా పరిషత్తు పోటీలలో, మరెన్నో పరిషత్తు పోటీలలో ఉత్తమ రచనకు, ఉత్తమ ప్రదర్శనకు ఎన్నెన్నో బహుమతులు అందుకుంది.[3]
- నాటకంలో ప్రధానమైన రాజారావు పాత్రను ధరించి, మెప్పించాలని ఆ తరంలోని సీనియర్ నటులందరూ అనుకునేవారు.[3]
అవార్డులు
[మార్చు]- ఉత్తమ బాల నటుడు (సంజీవి ముదిలి) - ఆంధ్ర నాటక కళా పరిషత్తు, 1965, హైదరాబాదు.
- ఉత్తమ బాల నటుడు (సంజీవి), ఉత్తమ నటుడు (వై. శంకరరావు-ఏఎన్ఆర్ రోలింగ్ షీల్డు) - లలిత కళానికేతన్ (రాజమండ్రి).
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, సినిమా (24 December 2014). "ఆ పాట.. ఆయన.. చిరంజీవులు". Sakshi. రెంటాల జయదేవ. Archived from the original on 14 జూలై 2017. Retrieved 11 September 2019.
- ↑ అద్భుత నాటకం నటనాలయం, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 24 జూలై 2017, పుట.14
- ↑ 3.0 3.1 3.2 విశాలాంధ్ర, సాహిత్యం (22 February 2010). "తెనాలి తేజోమూర్తులు బొల్లిముంత, జాన్సన్". పెనుగొండ లక్ష్మీనారాయణ. Archived from the original on 11 సెప్టెంబరు 2019. Retrieved 11 September 2019. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "తెనాలి తేజోమూర్తులు బొల్లిముంత, జాన్సన్" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు