నక్షత్ర (నటి)
నక్షత్ర | |
---|---|
జననం | నక్షత్ర 1990 |
ఇతర పేర్లు | దీప్తి[1] |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2009 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు | డి. రాజేంద్ర బాబు సుమిత్ర |
కుటుంబం | ఉమాశంకరి (సోదరి) |
నక్షత్ర ఒక భారతీయ నటి. ఆమె ప్రధానంగా మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో నటిస్తుంది.
జీవితం తొలి దశలో
[మార్చు]కన్నడ చలనచిత్ర దర్శకుడు డి. రాజేంద్ర బాబు, నటి సుమిత్రలకు చిన్న కుమార్తెగా నక్షత్ర జన్మించింది.[2] ఆమెకు ఉమాశంకరి అనే ఒక అక్క ఉంది, ఆమె కూడా నటి.[3] ఆమె ఈరోడ్ సెంగుంతర్ ఇంజనీరింగ్ కళాశాలలో బయోటెక్ చదివింది.[4] నటి కావాలని ఎంత కోరికగా ఉన్నా నక్షత్ర తల్లిదండ్రులు మొదట వ్యతిరేకించారు.[5][6]
కెరీర్
[మార్చు]17 సంవత్సరాల వయస్సులో నక్షత్రని దర్శకుడు సునీల్ కుమార్ దేశాయ్ ఒక ఫంక్షన్‌లో చూసాడు. ఆ తరువాత ఆమె తల్లి సుమిత్రకు ఫోన్ చేసి తన సినిమాలో నటి కోసం ఆసక్తిని వ్యక్తం చేసాడు.[7] అలా ఆయన తన సరిగమ చిత్రంలో ఆమెకు ప్రధాన పాత్ర ఇచ్చాడు. కొంతకాలం తర్వాత గోకులలో ఒక పాత్రను పోషించింది. ఇది ఆమె తొలిచిత్రంగా విడుదలైంది. హరే రామ హరే కృష్ణలో ఆమె ప్రధాన పాత్రలో నటించింది.[8] ఆమె గోకులలో సిగ్గుపడే అమ్మాయిగా తల్లితో కలిసి నటించడం విశేషం. ఆ చిత్రంలో ఆమె నటనకు విమర్శకులు సానుకూలమైన సమీక్షలు ఇచ్చారు.[9][10][11] చివరకు అనేక కారణాలతో సరిగమ చిత్రం విడుదలకాలేదు.[12] అయితే, విరుద్ధమైన షెడ్యూల్‌ల కారణంగా హరే రామ హరే కృష్ణ నుండి వైదొలగవలసి వచ్చింది.[13] ఆ పాత్ర చివరికి పూజా గాంధీని వరించింది.[14] 2011లో విడుదలైన డూ, మరుధవేలు చిత్రాల ద్వారా నక్షత్ర తమిళ నాట అడుగుపెట్టింది.[15] మరుసటి సంవత్సరం, ఆమె మలయాళంలో వైదూర్యంతో అరంగేట్రం చేసింది.[16] అయితే మలయాళ చిత్రాల కోసం తన స్క్రీన్ పేరును దీప్తిగా మార్చుకుంది. అదే సంవత్సరం తన రెండవ మలయాళ చిత్రం కిలి పాడుం గ్రామమ్ విడుదలైంది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు బ్లాక్‌బస్టర్స్ గా నిలిచాయి.[17]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]Year | Film | Role | Language | Notes |
---|---|---|---|---|
2009 | గోకుల | మహాలక్ష్మి | కన్నడ | |
2011 | డూ | స్వప్న | తమిళం | |
2011 | మరుధవేలు | విద్యా వేణుగోపాలన్ | తమిళం | |
2011 | హరే రామ హరే కృష్ణ | కన్నడ | ||
2012 | వైడూర్యం | గాయత్రి | మలయాళం | |
2012 | కిలి పాడుమ్ గ్రామం | పల్లెటూరి అమ్మాయి | మలయాళం | |
2013 | ఫర్ సేల్ | బాల | మలయాళం | |
2013 | ఆర్య సూర్య | చంద్రగంధ | తమిళం | |
2014 | మొనాయి అంగనే ఆనయి | మాయ | మలయాళం | |
2014 | ఫెయిర్ & లవ్లీ | కన్నడ | ||
2015 | విలేజ్ గాయ్స్ | ఆరతి వాసుదేవన్ | మలయాళం | |
2015 | కూచికూ కూచికూ | కన్నడ | ||
2015 | ఓరు న్యూ జనరేషన్ పానీ | ఇందుజ | మలయాళం |
మూలాలు
[మార్చు]- ↑ "Sumithra's daughter Deepthi to star opposite Biyon". timesofindia.indiatimes.com. Retrieved 7 January 2015.
- ↑ "Director Rajendra Babu dies of cardiac arrest". Newindianexpress.com. Archived from the original on 2016-03-04. Retrieved 2022-08-15.
- ↑ "Star kids in Sandalwood". Timesofindia.com. Retrieved 7 January 2015.
- ↑ "One more star from Babu's family". Newindianexpress.com. Archived from the original on 2016-03-07. Retrieved 2022-08-15.
- ↑ "One more star from Babu's family". Newindianexpress.com. Archived from the original on 2016-03-07. Retrieved 2022-08-15.
- ↑ "Nakshatra: A star among stars". The Times of India.
- ↑ "Nakshatra's grand entry". The Times of India. Retrieved 29 November 2021.
- ↑ [1] [dead link]
- ↑ "Review: Gokula is a treat to watch". Rediff.com.
- ↑ "Gokula review. Gokula Kannada movie review, story, rating". IndiaGlitz.com. Retrieved 29 November 2021.
- ↑ "Gokula". Sify.com. Archived from the original on 15 ఆగస్టు 2015. Retrieved 29 November 2021.
- ↑ "Sunil Kumar Desai back with a new film". The Times of India.
- ↑ "Techie's film in doldrums". New Indian Express. Archived from the original on 2015-07-03. Retrieved 2022-08-18.
- ↑ "Pooja Gandhi set to replace Honey Rose". Filmibeat.com. 2 March 2010.
- ↑ "Sumithra's daughter arrives in Tamil". The New Indian Express. Retrieved 29 November 2021.
- ↑ "Veteran actress Sumithra's daughter Nakshatra enters the Malayalam film industry with a film titled Vaidooryam". The Times of India.
- ↑ "Nakshatra: A star among stars". The Times of India.