Jump to content

నక్కా వెంకటయ్య

వికీపీడియా నుండి
నక్కా వెంకటయ్య
జననంజూన్ 19, 1909
నివాస ప్రాంతంమార్కాపురం
వృత్తిరాజకీయ నాయకుడు.
పదవి పేరుశాసనసభ్యుడు
పదవీ కాలం1952-1956
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెసు

నక్కా వెంకటయ్య (N. Venkatayya) ఆంధ్ర రాష్ట్ర శాసన సభ్యునిగా పనిచేసాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

నక్కా వెకటయ్య 1909 జూన్ 19న జన్మించాడు. అతను బి.ఎ. ఎ.ఐ.ఐ పట్టభద్రులు. తరువాత 4 సంవత్సరాల పటు కిర్లంపూడి చెక్కెర ఫ్యాక్టరీ జనరల్ మేనేజరుగా పనిచేసాడు. తరువాత సామర్లకోట చక్కెర ఫ్యాక్టరీలో 6 సంవత్సరాల పాటు కెమిస్టు గానూ, ఉయ్యూరు చక్కెర ప్యాక్టరీలో 8 యేండ్లు మెకిస్టుగా పనిచేసాడు. తరువాత ఆంధ్రా సిమెంటు కంపెనీ కన్‌సల్‌టింగ్ కెమిస్టు గా పంచదార పరిశ్రమలో చిరకాలం పనిచేశారు.

రాజకీయ జీవితం

[మార్చు]

అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా ఎఱ్ఱగొండపాలెం నియోజకవర్గం నుండి ఆంధ్రరాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు[2]. 1952 మద్రాసు శాసనసభ ఎన్నికలలో లోక్ పార్టీ అభ్యర్ధిగా మార్కాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ఉమ్మడి మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. అతనికి పరిశ్రమలు, వాటి అభివృద్ధిపై ప్రత్యేక అభిమానం.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్ర శాసనసభ్యులు 1955. యన్.సత్యనారాయణరావు, గుంటూరు. p. 6. Retrieved 9 June 2016.
  2. "Yerragondipalem 1955 Assembly MLA Election Andhra Pradesh | ENTRANCEINDIA" (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-10-09. Archived from the original on 2021-06-14. Retrieved 2021-06-14.