నక్కల కాలువ
స్వరూపం
నక్కల కాలువ మురుగుకాలువలలో అతి పెద్ద కాలువ. ఇది పెరవలి పరిసరప్రాంతాల నుండి మొదలై చివరలో దొడ్డిపట్ల పరిసరప్రాంతాలలో గోదావరిలో కలుస్తుంది. ఇది గోదావరి నదిలో కలిసే మధ్య దీనిలో మరికొన్ని మురుగు కాలువలు కలుస్తాయి. అటునుండి ఇది మరింతగా వ్యాపిస్తూ గోదావరిలో కలిసే దగ్గర అతి పెద్దగా మారుతుంది[ఆధారం చూపాలి].

ఇతర విశేషాలు
[మార్చు]- దీని పరీవాహక ప్రాంతము తరచు వరదలకు గురికవడం వలన దీని ప్రక్కనచాలా దూరం వరకూ ఊళ్ళు ఉండేవి కావు. అందువలన దీ ప్రక్కల దట్టంగా చెట్లతో అడవిగా ఉందటంతో నక్కలు ఎక్కువగా సంచరించేవి. కాలక్రమాన దీనిని నక్కల కాలువగా వ్యవహరించారు.
- లక్ష్మీపురం దగ్గర స్లూయిస్ లాకులవల్ల నక్కల కాలువలోని నీరు గోదావరి నదిలోకి వెళ్ళక ఎదురుతన్ని వద్దిపర్రు రావిపాడు గ్రామాలు కొన్నిసార్లు ఎండాకాలంలో కూడా వరద పాలౌతాయి.