Jump to content

నందిరాజు నారాయణమూర్తి

వికీపీడియా నుండి
నందిరాజు నారాయణమూర్తి
జననంజూలై 31, 1934
మరణం2006
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు, దర్శకుడు, నాటక ప్రయోక్త
తల్లిదండ్రులువెంకట్రామయ్య, బాలా త్రిపురసుందరి

నందిరాజు నారాయణమూర్తి (జూలై 31, 1934 - 2006) ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, నాటక ప్రయోక్త. నటనాచార్య, కళాతపస్వి, ఆంధ్రశివాజీ బిరుదాంకితుడు.[1]

జననం - ఉద్యోగం

[మార్చు]

నారాయణమూర్తి 1934, జూలై 31 న వెంకట్రామయ్య, బాలా త్రిపురసుందరి దంపతులకు తెనాలి జన్మించాడు. బి.ఏ. పూర్తిచేశాడు.

వివాహం - ఉద్యోగం

[మార్చు]

నారాయణముర్తి గారి మొదటి భార్య పేరు శ్రీమతి కుసుమ. ఆవిడ పరమపదించక సుప్రసిద్ద నాటక నటిమణి జ్యొతి గారిని వివాహం చేసుకున్నారు. ఆయనకు నలుగురు కొడుకులు. ఆయన వి.డి.ఓ.గా ప్రభుత్వ ఉద్యోగం చేశారు. ఆయన ఉద్యొగంలొ ఉంటూ, నాటక రంగంలొ విశేష సేవలు అందించారు.

నాటకరంగ ప్రస్థానం

[మార్చు]

నారాయణమూర్తి తన 12వ ఏట వీలునామా అనే హాస్యనాటికతో రంగస్థలంలోకి ప్రవేశించాడు. ప్రసిద్ధ నటులు అబ్బూరి వరప్రసాదరావు, ముదిగొండ లింగమూర్తి ల సాహచర్యంతో అభినయంలో మెళకువలను నేర్చుకున్నాడు. 1976లో అబ్బూరి కళా పరిషత్తు ప్రారంభించాడు. కృష్ణాజిల్లా గుడివాడ లో స్థిరనివాసం ఏర్పాటుచేసుకొని అనేక నాటకాలను ప్రదర్శించాడు. సుమారు 70 నాటకాలకు దర్శకత్వం వహించిన నందిరాజు పౌరాణికాలలో ప్రతినాయక పాత్రలను ఏరి కోరి ఎంచుకుని వాటితోనే మంచి గుర్తింపును సాధించాడు. నట దంపతులుగా నారాయణమూర్తి, జ్యోతిలు నాటకరంగానికి ఎనలేని సేవ చేశారు. సినిమాలో నటించమని ఆదుర్తి సుబ్బారావు కోరినా నాటకరంగంలో ఉండడానికే ఇష్టపడ్డాడు. వేమూరి రామయ్య చుండూరు మధుసూదనరావు, ఎ.వి.సుబ్బారావు, ఆచంట వెంకటరత్నం నాయుడు, గుమ్మడి గోపాలకృష్ణ, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి, బి.ఎన్. సూరి వంటి ప్రసిద్ధ నటులతో కలిసి నటించాడు.

నటించిన నాటకాలు

[మార్చు]
  1. వీలునామా
  2. కులం లేని పిల్ల
  3. కూలి పిల్ల
  4. పునర్జన్మ
  5. ఇన్స్ పెక్టర్ జనరల్
  6. భయం
  7. వీలునామా
  8. బాలనాగమ్మ
  9. రామదాసు
  10. మోహినీ భస్మాసుర
  11. సీతారామ కళ్యాణం
  12. వారసత్వం
  13. వెంకన్న కాపురం
  14. పల్లెపడుచు
  15. ఉద్యోగ విజయాలు
  16. కురుక్షేత్రం

నటించిన పాత్రలు

[మార్చు]

మరణం

[మార్చు]

అనేక నాటక సమాజాలకు కార్యవర్గ సభ్యుడిగా పనిచేసిన నందిరాజు 2006లో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.386.