నండూరి పార్థసారథి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నండూరి పార్థసారథి
(నం.పా.సా)
జననం1939 జూలై 31
మరణం2024 జూన్ 14(2024-06-14) (వయసు 84)
జాతీయతభారతీయుడు
వృత్తిపాత్రికేయుడు, రచయిత
బంధువులునండూరి రామ్మోహనరావు (సోదరుడు)

నండూరి పార్థసారథి (1939, జూలై 31 - 2024 జూన్ 14) సుప్రసిద్ధ పాత్రికేయుడు, రచయిత.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1939, జూలై 31న కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, ఆరుగొలను గ్రామంలో జన్మించాడు. "నరావతారం", "విశ్వరూపం" మొదలైన రచనల ద్వారా ప్రసిద్ధుడైన నండూరి రామమోహనరావు ఇతనికి అన్న. విజయవాడలో ఇంటర్మీడియట్, హైదరాబాద్ లో బి.ఎ., తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి ఎం.ఎ. చదివాడు. 1959లో ఆంధ్రప్రభ దినపత్రికలో పాత్రికేయుడిగా ఉద్యోగంలో చేరాడు. 1996వరకు ఆంధ్రప్రభ దినపత్రిక, ఆంధ్రప్రభ వారపత్రికలలో పనిచేశాడు. నీలంరాజు వేంకటశేషయ్య, శార్వరి, గొల్లపూడి మారుతీరావు, విద్వాన్ విశ్వం మొదలైన వారితో కలిసి పనిచేశాడు. గుంటూరు శేషేంద్రశర్మ ఇతని మిత్రుడు. ఇతని మొదటి కథ 1957లో ప్రచురితమైంది. అప్పటి నుండి వివిధ పత్రికలలో అనేక కథలు, గల్పికలు, ధారవాహిక నవలలు, సంగీత, నాటక, సాహిత్య రంగాలపై వందల కొద్దీ వ్యాసాలు, సమీక్షలు ప్రకటించాడు. 2000 నుండి 2009 వరకు రసమయి అనే సాంస్కృతిక మాసపత్రికను స్వీయ సంపాదకత్వంలో ప్రచురించాడు. 1992లో హాస్యరచనకు గాను, 2002లో పత్రికారంగంలో చేసిన కృషికిగాను తెలుగు విశ్వవిద్యాలయం ఇతడికి పురస్కారాలను అందజేసింది.[1]

రచనలు

[మార్చు]
  1. రాంబాబు డైరీ (మూడు భాగాలు)
  2. శిఖరాలు - సరిహద్దులు
  3. సాహిత్య హింసావలోకనం
  4. పిబరే హ్యుమరసం
  5. స్వరార్ణవం
  6. కార్ఖానాఖ్యానము
  7. అయోమయరాజ్యం
  8. శ్రీకృష్ణకథామృతం

మరణం

[మార్చు]

84 ఏళ్ల నండూరి పార్థసారథి మెదడుకు సంబంధించిన సమస్యకు హైదరాబాదు నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2024 జూన్ 14న తుదిశ్వాస విడిచాడు.[2] ఆయనకు భార్య సువర్చలా దేవి, కుమారుడు మధు సారథి ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. Cbrao (డిసెంబరు 19, 2015). "దీప్తి ధార: నండూరి పార్థసారధి గారితో ముఖాముఖి". దీప్తి ధార. Archived from the original on 2019-11-07. Retrieved 2020-01-21.
  2. "ప్రముఖ వ్యంగ్య, హాస్య రచయిత..నండూరి పార్థసారథి కన్నుమూత | Renowned Satirist and Comic writer..Nanduri Parthasarathy Passed Away". web.archive.org. 2024-06-15. Archived from the original on 2024-06-15. Retrieved 2024-06-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)