ధర్మాన ప్రసాదరావు
ధర్మాన ప్రసాదరావు | |||
ధర్మాన ప్రసాదరావు | |||
రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2022 ఏప్రిల్ 11 – ప్రస్తుతం | |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం | |||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | గుండ అప్పలసూర్యనారాయణ | ||
---|---|---|---|
తరువాత | గుండ లక్ష్మీదేవి | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం | |||
పదవీ కాలం 1989 – 1994 | |||
ముందు | శిమ్మ ప్రభాకరరావు | ||
తరువాత | బగ్గు లక్ష్మణరావు | ||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | బగ్గు లక్ష్మణరావు | ||
తరువాత | ధర్మాన కృష్ణదాస్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట, మబగాం | 1957 మే 21||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | రామలింగంనాయుడు (తండ్రి) సావిత్రమ్మ (తల్లి) | ||
జీవిత భాగస్వామి | గజలక్ష్మీ | ||
బంధువులు | ధర్మాన కృష్ణదాస్ (సోదరుడు) | ||
సంతానం | రామమనోహర్ నాయుడు | ||
నివాసం | శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట, మబగాం | ||
వృత్తి | వ్యవసాయం, వ్యాపారం | ||
మతం | హిందూ |
ధర్మాన ప్రసాదరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను శ్రీకాకుళం శాసనసభ నియోజక వర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడు, మాజీ రాష్ట్ర మంత్రి. అతను ఆంధ్ర ప్రదేశ్ విభజన జరగక పూర్వం గల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రోడ్లు, భవనాల శాఖ, రెవెన్యూ మంత్రిగా పనిచేశాడు.[1] ఆంధ్ర ప్రదేశ్ లో తాజాగా రెవెన్యూ, స్టాంప్ లు, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా నియమితులయ్యారు
జీవిత విశేషాలు
[మార్చు]అతను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలానికి చెందిన మబగాం గ్రామంలో సావిత్రమ్మ, రామలింగంనాయుడు దంపతులకు 1957 మే 21 న జన్మించాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా 1989, 1999, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికలలో నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. అతను నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో చేనేత,జౌళిశాఖ, క్రీడలు, చిన్నతరహా నీటిపారుదలం మైనరు ఫోర్టుల శాఖలకు మంత్రిగా తన సేవలనందించాడు. అతను వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసాడు.
అతను 1981లో మబగాం గ్రామ సర్పంచ్‌గా, 1982లో బ్లాక్ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, 1987లో పోలాకి మండల తొలి అద్యక్షునిగా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసాడు. 1994లో ఎ.ఐ.సి.సి సభ్యునిగా, 2001లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తన సేవలనందించాడు.
అవినీతి ఆరోపణలు
[మార్చు]అతను ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు వాన్ పిక్ భూముల కేటాయింపులో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించబడ్డాడు. వాన్ పిక్ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటులో మంత్రి ధర్మాన ప్రసాద రావు పేరును కూడా సిబిఐ పేర్కొంది. దీంతో ధర్మాన తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు.[2][3][4] తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించాడు. సమైక్యాంధ్రకు మద్ధతుగా రాజీనామా చేసినట్లు ధర్మాన తెలిపాడు.[5]
2013లో అతను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లోకి చేరాడు. అతను వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తన సేవలనందిస్తున్నాడు.[6] ఆయన వైఎస్సార్‌సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా, పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా, తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జిగా, అధికార ప్రతినిధిగా వివిధ హోదాల్లో పనిచేసి 2019లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి 2022 ఏప్రిల్ 11న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[7][8][9]
మూలాలు
[మార్చు]- ↑ Jagan assets case: Dharmana grilled Archived 2013-01-26 at Archive.today. The Times of India, 14 April 2012.
- ↑ "కెవిపి, ధర్మాన గూడుపుఠాణి: జగన్‌పార్టీ నేత సంచలనం".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-08-18. Retrieved 2015-01-12.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-18. Retrieved 2015-01-12.
- ↑ "ధర్మాన ప్రసాదరావు రాజీనామా: సీఎం కిరణ్‌కు లేఖ!".
- ↑ "శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో సంఘీబావ యాత్ర జరిగింది".[permanent dead link]
- ↑ Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
- ↑ 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (11 April 2022). "ఎట్టకేలకు నెరవేరిన ధర్మాన కోరిక". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
ఇతర లింకులు
[మార్చు]- Pages using the JsonConfig extension
- Webarchive template archiveis links
- All articles with dead external links
- CS1 maint: unrecognized language
- Date of birth not in Wikidata
- వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులు
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు
- శ్రీకాకుళం జిల్లా రాజకీయ నాయకులు
- శ్రీకాకుళం జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు
- ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు (2019)