ధర్మదాత
స్వరూపం
ధర్మాదాత , 1970 లో విడుదలైన తెలుగు డ్రామా చిత్రం . ఎ.సంజీవి దర్శకత్వంలో , రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి నిర్మించిన ఈచిత్రంలో, అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం చేయగా , కాంచన, పద్మనాభం, గీతాంజలి, నాగభూషణం మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి, సంగీతం తాతినేని చలపతిరావు సమకూర్చారు . తమిళంలో 1968 లో వచ్చిన" ఎంగ ఊర్ రాజా" ఈ చిత్రానికి మూలం. బాక్స్ఆఫీసు వద్ద విజయవంతమైన చిత్రంగా పేరు గాంచింది.
ధర్మదాత (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.సంజీవి |
---|---|
కథ | బాలమురుగన్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, కాంచన, నాగభూషణం |
సంగీతం | తాతినేని చలపతిరావు |
నిర్మాణ సంస్థ | రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]పాటలు
[మార్చు]క్ర.సం. | పాట | గాయినీగాయకులు | గీత రచన |
---|---|---|---|
1 | ఎవ్వడికోసం ఎవడున్నాడు పొండిరా పొండి నా కాలం ఖర్మం | ఘంటసాల | కొసరాజు |
2 | ఎవరివో నీవెవరివో కోరిక తీర్చే కల్పతరువువో | టి.ఆర్.జయదేవ్, పి.సుశీల | కొసరాజు |
3 | శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం (శ్లోకం) | ఘంటసాల | వేదవ్యాసుడు |
4 | ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతంకన్నా | ఘంటసాల, పి.సుశీల, టి.ఆర్.జయదేవ్ | సినారె |
5 | జో లాలీ జో లాలి .. లాలీ నా చిట్టి తల్లి లాలి ననుగన్న తల్లి లాలి | ఘంటసాల | సినారె |
6 | చిన్నారి బుల్లెమ్మా సిగ్గెందుకు లేవమ్మా చన్నీట స్నానాలు | ఘంటసాల | సినారె |
7 | హల్లో ఇంజినియర్ హల్లో కం హియర్ ఓ ఓ ఓ మై డియర్ | పి.సుశీల బృందం | సినారె |
8 | ఓం పరమేశ్వరి.. జగదీశ్వరి.. రాజేశ్వరి.. కాళేశ్వరి | ఘంటసాల, పి.సుశీల | సినారె |
9 | ఎవరూ నీవారు కారు ఎవరూ నీతోడు రారు అడిగిన వారికి | ఘంటసాల | సినారె |
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.