ద సాంగ్ ఆఫ్ స్పేరోస్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ద సాంగ్ ఆఫ్ స్పేరోస్
The Song of Sparrows
దస్త్రం:The Song of Sparrows, 2008 film.jpg
Film poster
దర్శకత్వంMajid Majidi
రచన
నిర్మాతMajid Majidi
తారాగణంReza Naji
ఛాయాగ్రహణంTuraj Mansuri
కూర్పుHassan Hassandoost
సంగీతంHossein Alizadeh
విడుదల తేదీs
1 ఫిబ్రవరి 2008 (2008-02-01)(Fajr)
1 అక్టోబరు 2008 (Iran)
సినిమా నిడివి
96 నిమిషాలు
దేశంఇరాన్
భాషపర్షియన్ భాష
బాక్సాఫీసు$220,360

"ద సాంగ్ ఆఫ్ స్పేరోస్" {The Song of Sparrows} 2008లో విడుదలైన ఇరాన్ దేశపు సినిమా. కరీమ్ ఉష్ట్రపక్షుల కేంద్రంలో మంద కాపరి. ఒక తుంటరి పక్షి దొడ్డిలోంచి తప్పించుకొని పారిపోతుంది. కరీమ్ దాన్ని వెనక్కి తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తాడు కాని అది తప్పించుకొని కొండల్లోకి పారిపోతుంది. 2000డాలర్ల ఖరీదైన పక్షిని నష్టపోయినందుకు ఉద్యోగం పోగొట్టుకొని కుటుంబ పోషణకోసం నానా అగచాట్లు పడతాడు.

బతుకుదెరువుకోసం అనుకోకుండా దొరికిన టాక్సీపనిలో చేరుతాడు. టెహరాన్ వీధుల్లో కస్టమర్లను గమ్యస్థానాలకు చేర్చి సంపాదించుకొంటూ నగరంలో పడివున్న పాతవస్తువులు ఇంటికి తెచ్చి పెడతాడు.

దురదృష్టం ఒంటరిగా రాదు, అతని చెవిటి కుమార్తె చెవిటి మిషను నీటిలోపడి పనికిరాకుండా పోతుంది. దాని ఖరీదు 400/డాలర్లు. అతని మధ్య తరగతి మనస్తత్వం భార్యా పిల్లలు పనిచేయడానికి అంగీకరించదు.

కరీమ్ భార్య నర్గీస్ అతను సేకరించిన పాతవస్తువుల్లో ఒకతలుపును పొరుగువారికి ఇస్తే, కరీమ్ భార్యతో గొడవపడి దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చేసుకొంటాడు. ప్రమాదవశాత్తు పాతసామాన్ల గుట్ట అతనిపైన కూలి తీవ్రంగా గాయపడి మంచంపడతాడు.

కరీం పిల్లలు వీధుల్లో పేపర్లు, పుష్పగుచ్ఛాలు అమ్మి డబ్బు సంపాదిస్తారు. పెద్దపిల్లవాడు పూలమొక్కలు రవాణాచేసే లారీలో కూలీగా చేర్తాడు. క్రమంగా అతని బాధ్యతలు పిల్లలు పైనవేసుకొంటారు.

కుమారుడికి ఇంట్లోని నీటిగుంటలో రంగుల చేపలు పెంచి డబ్బు సంపాదించాలని కోరిక. వాడి సంపాదనంతా పెట్టి డ్రమ్ములో రంగుచేపలు కొనితెస్తూంటే నీరంతా కారిపోయి చేపలన్నీ చచ్చిపోతాయి. ఒక్క చేపను మాత్రం కాపాడి నీటిగుంటలో విడిచి కోర్కె తీర్చుకొంటాడు.

కరీమ్ నెమ్మదిగా కోలుకొంటాడు. ఒకరోజు ఆతను గదిలో చిక్కుకొని వెలుపలికి పోలేక లోపలే తిరుగుతున్న పిచ్చుకను బైటకి పోవడానికి సహాయపడతాడు.

అతనిలో జీవితంపట్ల కొత్తచూపు మేల్కొన్నట్లు దర్శకుడు ఈ సంఘటనతో సూచిస్తాడు.

సినిమాలో చెడ్డపాత్రలు ఉండవు. కరీమ్ మోటార్ సైకిల్ టేక్సీమీద వెళ్ళిన కస్టమర్ ఒకడు బలవంతంగా సామాన్లన్ని అతనిచేత మోయిస్తాడు, మరొక కస్టమర్ బాడుగ ఇవ్వకుండానే ఇచ్చినట్లు, తనకు చిల్లర ఇమ్మని కరీమ్ ను దబాయిస్తాడు.

సినిమా చివర పారిపోయిన ఉష్ట్రపక్షి పక్షుల గుంపును వెంటపెట్టుకొని ఇల్లుచేరుతుంది.

కరీమ్ పిల్లలు, భార్య నర్గీస్ ఆనందమైన సంసారం. సినిమా మంచి కవిత చదువుతున్న భావన కలిగిస్తుంది.

మూలాలు

[మార్చు]
  • The Song of Sparrows, Iraniayan film, 2009 release, direction: Majid Majidi. winner of Berlin International filam Festival award.