ద్వారం వెంకటకృష్ణ గణేష్ త్యాగరాజ్
ద్వారం వెంకటకృష్ణ గణేష్ త్యాగరాజ్ కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఆయన ప్రముఖ వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి మనుమడు.
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన ప్రముఖ సంగీతకారుడు, ద్వారం వెంకటస్వమినాయుడు గారి కుమారుడు అయిన ద్వారం భావనారాయణ రావు, వెంకటవరదమ్మ దంపతులకు జన్మించారు. ఆయన సహోదరులలో ద్వారం లక్ష్మి, ద్వారం అనంత వెంకటస్వామి లు కూడా ప్రముఖ సంగీత విద్వాంసులు, గాయకులు.
ఆయన తన తల్లిదండ్రుల నుండి ప్రాథమిక సంగీత శిక్షణ పొందారు. తరువాత ఆయన సంగీత కళానిథి, పద్మభూషణ పురస్కార గ్రహీత శ్రీమతి ఎం.ఎల్.వసంత కుమారి, డి.కె.జయరామన్, ప్రొఫెసర్ టి.ఆర్ సుబ్రహ్మణ్యన్, పి.సూర్యారావు, సంగీత కళానిథి శ్రీ నేదునూరి కృష్ణమూర్తివద్ద సంగీత జ్ఞానాన్ని అభ్యసించారు.
ఆయన మృదంగాన్ని కె.వీరభద్రరావు, సి.హెచ్.కృష్ణమూర్తి, ముళ్ళపూడి శ్రీరామమూర్తి గార్ల వద్ద అభ్యసించారు. ఆయన లైట్ మ్యూజిక్ ను తిరుపతి రామానుజ సూరి వద్ద నేర్చుకున్నారు. హిందూస్తానీ సంగీతాన్ని జె.వి.ఎస్.రావు వద్ద అభ్యసించారు.
ఆయన తన 29 మంది శిష్యులతో కలసి విశాఖపట్నం లోని కళాభారతి వద్ద విశాఖ మ్యూజిక్ అకాడమీ, నాద సుధా తరంగిణి నిర్వహించిన అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో పాల్గొని కచేరీ చేసారు. [1]
కెరీర్
[మార్చు]- బి-గ్రేడు ఆర్టిస్టు, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్.
- దేశ విదేశాలలో తన ప్రదర్శనలిచ్చారు.
- వివిధ సంస్థల నుండి పురస్కారాలను అందుకున్నారు.
- అనేక ఆల్బం లకు సంగీతాన్ని స్వరపరచి, దర్శకత్వం వహించి, పాడి, విడుదల చేసారు.
- ఆయన టెలివిజన్ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.
- సింగపూర్, మలేసియా దేశాలలో సంగీత కచేరీలు నిర్వహించారు.