దొనబండ (ఇబ్రహీంపట్నం)
స్వరూపం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
దొనబండ కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
దొనబండ | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | ఇబ్రహీంపట్నం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521456 |
ఎస్.టి.డి కోడ్ | 0866 |
గ్రామ పంచాయతీ
[మార్చు]దొనబండ గ్రామం, కాచవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ సత్తెమ్మ, మారెమ్మ, కాళేమ్మ అమ్మవారల ఆలయాలు
[మార్చు]- దొనబండలోని ముగురమ్మల ఆలయం తిరునాళ్ళ మహోత్సవం, జనవరి-2014, 8&9 లలో జరిగింది. 35 ఏళ్ళక్రితం తమిళనాడు నుండి ఇక్కడకు వచ్చి స్థిరపడిన కార్మికులు క్వారీ, క్రషర్ యజమానుల సహకారంతో, బోరబండ గ్రామంలో సత్తెమ్మ, మారెమ్మ, కాళేమ్మ ఆలయాలను నిర్మించుకున్నారు. ఈ ప్రాంత క్వారీ, క్రషర్ కార్మికులు, యజమానులు, గ్రామస్థులు ఏటా ధనుర్మాసంలో ఈ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించెదరు. క్వారీ కార్మికులు, ముగురమ్మలకు పూజలు చేసి, క్వారీ పనులు నిర్వహించేటందుకు శ్రీకారం చుడతారు. పూజా కార్యక్రమాలు తమిళ, ఆంధ్ర సంప్రదాయాలతో నిర్వహించెదరు. క్వారీ కార్మిక మహిళలు, మొక్కులు తీర్చుకునేటందుకు బోనాలు నెత్తిపై పెట్టుకొని, నిప్పుల గుండంలో అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తారు.
- ఈ ముగురమ్మల ఆలయాల వార్షిక జాతర మహోత్సవాలు 2016,జనవరి-7వ తేదీ గురువారం నుండి 9 రోజులపాటు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో తమిళనాడుకు చెందిన పూజారులు తొమ్మిదిరోజులపాటు పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. [2]
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు