Jump to content

దేవ్ మోహన్

వికీపీడియా నుండి
దేవ్ మోహన్
జననం (1992-09-18) 1992 సెప్టెంబరు 18 (వయసు 32)[1]
త్రిస్సూర్, కేరళ, భారతదేశం
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థవిద్యా అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
వృత్తి
  • నటుడు
  • మోడల్
  • మెకానికల్ ఇంజనీర్
క్రియాశీల సంవత్సరాలు2020–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రజినా
(m. 2020)

దేవ్ మోహన్ (జననం 1992 సెప్టెంబరు 18) మలయాళం సినిమాకు చెందిన భారతీయ నటుడు, మోడల్. ఆయన సూఫియుం సుజాతయుం (2020), పంత్రండు (2022) సినిమాలతో ప్రసిద్ధిచెందాడు.[2] 2023లో, అతను పౌరాణిక నాటక చిత్రం శాకుంతలం ద్వారా తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టాడు, ఇది విమర్శకుల ప్రశంసలతో పాటు విజయవంతమైన చిత్రంగా నిలిచింది.[3] ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదలైంది.[4][5]

ప్రారంభ జీవితం

[మార్చు]

దేవ్ మోహన్ 1992 సెప్టెంబరు 18న కేరళలోని త్రిసూర్‌లో జన్మించాడు.[6] ఆయన త్రిస్సూర్‌లోని టెక్నికల్ హై స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించాడు. త్రిస్సూర్‌లోని విద్యా అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత. అక్కడ అతను తన మోడలింగ్ వృత్తిని ప్రారంభించాడు. 2016లో ముంబైలో నిర్వహించిన పీటర్ ఇంగ్లండ్ మిస్టర్ ఇండియా 2016లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచాడు.[7]

కెరీర్

[మార్చు]

2020లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సూఫియుమ్ సుజాతాయుమ్ చిత్రంలో దేవ్ మోహన్ టైటిల్ రోల్ సూఫీగా నటించాడు.[8] ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.[9][10][11][12][13][14]

ఆ తర్వాత మరో మలయాళ చిత్రం పుల్లి సినిమా చేశాడు.[15][16] 2021లో తెలుగులో సమంత సరసన శాకుంతలం చిత్రంలో దుష్యంతగా నటించి మెప్పించాడు.[17] ఈ చిత్రం 2023 ఏప్రిల్ 14న విడుదలైంది.[18] 2022లో, ఆయన మలయాళ చిత్రం పంత్రాండులో నటించాడు, ఇది థియేటర్లలో విడుదలైన అతని మొదటి చిత్రం.[19][20]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర నోట్స్ మూలాలు
2020 సూఫియుం సుజాతయుమ్ సూఫీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది [21]
2021 హోమ్ సినిమా స్టార్ అతిధి పాత్ర

అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది

[22]
2022 పంత్రాండు ఇమ్మానుయేల్ [23]
2023 శాకుంతలం దుష్యంత తెలుగు సినిమా [24]
వాలట్టి ఆనంద్ అతిధి పాత్ర [25]
పుల్లి [26]
TBA రెయిన్బో † తెలుగు సినిమా చిత్రీకరణలో ఉంది [27]
పరాక్రమం † చిత్రీకరణ

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2020లో తన చిరకాల స్నేహితురాలు రజినాను పెళ్లాడాడు.[28][29]

గుర్తింపు

[మార్చు]
  • 2020లో సూఫియుం సుజాతయుమ్ చిత్రానికి ఉత్తమ నూతన నటుడు (మలయాళం) గా 10వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ ఆయనకు వచ్చింది.[30]
  • 2022లో సూఫియుం సుజాతయుమ్ చిత్రానికి ఉత్తమ నూతన నటుడు (మలయాళం) గా 67వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ కూడా ఆయనను వరించింది.[31]

మూలాలు

[మార్చు]
  1. "Happy birthday Dev Mohan: Actor's first look as King Dushyant from Samantha's 'Shaakuntalam' is out". The Times of India. 18 September 2022.
  2. "About Dev Mohan". Filmibeat. Archived from the original on 13 April 2022. Retrieved 3 July 2022.
  3. "Madhoo opens up about Samantha-starrer Shaakuntalam's box office failure, says 'I feel very sad...'".
  4. A. B. P. Desam, A. B. P. (10 February 2023). "ఏప్రిల్‌లో సమంత 'శాకుంతలం' - విడుదల ఎప్పుడంటే?". telugu.abplive.com. Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
  5. Eenadu. "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే". c. Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
  6. "Makers of 'Pulli' throws a surprise birthday party for Dev Mohan". The Times Of India. 7 October 2021. Archived from the original on 5 November 2021. Retrieved 3 July 2022.
  7. "Mr India 2016 Contestants full details". beautypeagents.com. Archived from the original on 3 December 2018. Retrieved 3 July 2022.
  8. "'Sufiyum Sujatayum' trailer: Mystique and music in Aditi Rao Hydari's next". The Hindu. 24 June 2022. Retrieved 10 August 2022.
  9. "Dev Mohan's showbiz journey began in Bengaluru". The Times Of India. 8 July 2020. Archived from the original on 7 December 2020. Retrieved 3 July 2022.
  10. "Dev Mohan makes his acting début in 'Sufiyum Sujatayum' opposite Aditi Rao Hydari". Th Hindu. 30 June 2020. Retrieved 10 August 2022.
  11. "'ഡാൻസ് പഠിക്കാൻ ഒൻപത് മാസമെടുത്തു; കാത്തിരുന്നത് രണ്ട് വർഷം'; സുജാതയുടെ 'സൂഫി' മനസ് തുറക്കുന്നു". Twenty Four News. 4 July 2020. Retrieved 10 August 2022.
  12. "Sufiyum Sujathayum review: A mystical tale laced with lingering romance". OnManorama. 3 July 2020. Retrieved 10 August 2022.
  13. "Sufiyum Sujatayum Movie Review: Aditi Rao Hydari and Dev Mohan power a heart-rending love story". The India Today. 3 July 2020. Retrieved 10 August 2022.
  14. "സൂഫിയാണ് താരം; ദേവ് മോഹൻ അഭിമുഖം". Malayalam Indian Express. 21 July 2020. Retrieved 10 August 2022.
  15. "'Sufiyum Sujatayum' famed Dev Mohan's second film 'Pulli' starts rolling". 24 February 2021. Retrieved 22 July 2022.
  16. "Dev Mohan looks intense in the first look of 'Pulli'". The Times Of India. 9 July 2022. Retrieved 22 July 2022.
  17. "Mohan Dev gets into the part of King Dushyantha". Deccan Chronicle. 22 April 2021. Retrieved 22 July 2022.
  18. "Shaakuntalam: Samantha Ruth Prabhu's upcoming mythological epic drama enters the post-production phase". The Times Of India. 3 January 2022. Retrieved 22 July 2022.
  19. "Panthrandu Movie Review: A disjointed gang story". The Times Of India. 24 June 2022. Retrieved 22 July 2022.
  20. "Panthrand Movie Review: A disjointed gang story". Timesofindia.indiatimes.com. 2022-06-24. Retrieved 2022-08-11.
  21. "Vathikkalu Vellaripravu: Aditi Rao and Dev Mohan are in love in new song from Sufiyum Sujatayum". India Today. 26 June 2020. Archived from the original on 17 November 2020. Retrieved 3 July 2022.
  22. "Exclusive! Dev Mohan: I don't want to compare my growth as an actor with the budget of the film".
  23. "Dev Mohan was guided by Alphonse Joseph to play oud in mystical action drama Panthrandu". The Times Of India. 6 February 2022. Archived from the original on 2 July 2022. Retrieved 3 July 2022.
  24. "Shaakuntalam: Samantha Akkineni finds her 'Prince Charming' in Dev Mohan". The Indian Express. 7 March 2021. Archived from the original on 2 May 2021. Retrieved 3 July 2022.
  25. "Valatty Review | A Safe Bet Sweet Kids' Film That Capitalizes on the Adorability".
  26. "Dev Mohan is a convict haunted by his past in his next in 'Pulli'". The Times Of India. 4 January 2022. Archived from the original on 2 July 2022. Retrieved 3 July 2022.
  27. "Rashmika Mandanna begins shooting for 'Rainbow'". The Times Of India. 8 April 2023. Retrieved 14 April 2023.
  28. "നടന്‍ ദേവ് മോഹന്‍ വിവാഹിതനായി; വധു റജീന". Asianet News. 2 September 2020. Archived from the original on 2 July 2022. Retrieved 3 July 2022.
  29. "മുസ്ലിം പെണ്‍കുട്ടിയുമായിട്ടുള്ള വിവാഹം സംഘര്‍ഷമായിരുന്നോ? താന്‍ വ്യക്തികളെയാണ് നോക്കുന്നതെന്ന് ദേവ് മോഹന്‍". Filmibeat. 24 June 2022. Archived from the original on 28 June 2022. Retrieved 3 July 2022.
  30. "SIIMA awards: Check out Malayalam winners of 2019 and 2020". OnManorama. 21 September 2021. Archived from the original on 6 October 2021. Retrieved 3 July 2022.
  31. "Suriya's Soorarai Pottru, Allu Arjun's Pushpa win big at 67th Filmfare Awards South". The News Minute. 10 October 2022. Retrieved 19 Jan 2023.