దేవతిలకుల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1965కు పూర్వం బలహీన వర్గాలు మాదిరిగానే తెలికుల కులస్తులు కూడా గతంలో వివక్షను ఎదుర్కొన్నారు. వీరు నెత్తిన నూనె డబ్బా పెట్టుకుని ఎదురుపడితే చాలు... గ్రామస్థులు అశుభంగా భావించేవారు. ఎంత ముఖ్యమైన పని ఉన్నా అడుగు ముందుకు వేసేవారు కాదు. ఇంట్లో కొంత సమయాన్ని గడిపి మళ్లీ రోడెక్కేవారు. అంతేకాదు వీరిని ‘శని’ గ్రహాలనీ, జిడ్డుగాళ్లని హేళన చేసి మాట్లాడేవారు. గాంధీ అప్పట్లో అంటరానివారిని ఏవిధంగా దగ్గరకు చేర్చుకుని వారికి హరిజనులని నామకరణ చేశారో అదే విదంగా హేళనకు గురవుతున్న గాండ్ల, తెలికుల కులస్తులను ఓదార్చే విధంగా ‘మై గాంచ్‌ తేలీ హూ...’ అని చెప్పడం జరిగింది. అయితే సమాజం నుండి వస్తున్న ప్రతిహేళననూ తెలికుల కులస్తులు ఛాలెంజ్‌గా తీసుకోవడంతో అప్పట్లో నూనె గానుగలు ఆడించే వీరు తమ పిల్లలను బడికి పంపించి చదివించే ప్రయత్నం చేశారు.

ఇక వీరు చేసే వృత్తి ఆధారంగానే వీరిని తెలికుల కులస్తులుగా పిలిచేవారు. గానుగ ఆడించి నూనె తీసి, నూనె వ్యాపారం చేస్తారు కనుక తెలీకులోరు అని పిలిచేవారు. రాష్ర్టంలో వీరి కులాన్ని రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో గాండ్ల అని, కోస్తా జిల్లాల్లో తెలికుల, దేవతిలకులు అని పిలుస్తారు. తూర్పు, తెలగ తెలికుల, దేవతిలకుల, దేవగాండ్ల, సజ్జనపు తెలికుల అని కూడా వీరూ పిలుబడుతున్నారు. అయితే దేవతిలకుల, దేవ గాండ్ల మాత్రం శాకాహారులు కావడం గమనార్హం. కాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలవడంతో వీరు వేరే కులస్తులనే భావన సమాజంలో కలగకుండా ఉండేందుకు ఈ కులస్తులు ‘గాండ్ల తెలికుల’ అని చెప్పుకోవడంతో ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా వీరు అఖిల గాండ్ల తెలికులుగా గుర్తింపు పొందారు. వీరి జనాభా రాయలసీమ ప్రాంతంలోనే అధికంగా కనిపిస్తుంది. ఒక్క చిత్తూరు జిల్లాలలోనే పెద్ద సంఖ్యలో ఉన్నారు. కనుకనే గాండ్ల కులానికి చెందిన ఎపిసి చెట్టి 1962లో, డి వెంకటేశం 1967, 1972లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అప్పట్లో విత్తనాల నుండి నూనె తీసే ప్రక్రియ విచిత్రంగా ఉండేది. చింతమొద్దుతో తయారు చేసిన గానుగలో నూనె గింజలను వేసి వాటిని మెత్తగా రుబ్బటానికి ఎడ్లను వినియోగించేవారు. గానుగ ఆడించేవారు కూడా చిన్న గోచీ పెట్టుకుని పని చేసేవారు. నూనె గింజలనుండి వచ్చే నూనెను డబ్బాలలోకి పట్టేవారు.

ఒక విధంగా చెప్పాలంటే వీరిని యాత్రీకరణ దెబ్బతీసిన తర్వాత వీరిని ఆదుకున్నాయి ఆ పశువులే! కాగా పులిమీదపుట్రలా యాంత్రీకరణ వీరిని దెబ్బతీసింది. 1965 ప్రాంతంలో గానుగలు స్థానంలో మార్వాడీలు యంత్రాలను ప్రవేశపెట్టారు. అయితే తెలికుల కులస్తులు కూడా రోటరీ పద్ధతి ద్వారా నూనె తీసే ప్రక్రియను అందుకున్నారు. దీంతో మార్వాడీలు బేబీ ఎక్స్‌పెల్లర్‌లను అధునీకరించి ఆయిల్‌ ఎక్స్‌పెల్లర్లుగా రంగంలోకి దించడంతో అంతపెట్టుబడి పెట్టే స్తోమతలేని తెలికుల కులస్తులు క్రమంగా వృత్తికి దూరమయ్యారు. దీంతో వీరు నూనె తీయడానికి స్వస్తిపలికినారు గ్రామీణ ప్రాంతాల లోని ఎస్సీ, ఎస్టీలతో పోల్చుకున్నప్పటికీ వీరు ఇప్పటికీ వెనుబడే ఉన్నారు.2005 సంవత్సరం లో వీరి కులస్తుల అవసరాల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వీరు డిమాండ్ చేయడం జరిగింది.

గానుగ