Jump to content

దేవగుప్తాపు భరద్వాజము

వికీపీడియా నుండి

దేవగుప్తాపు భరద్వాజము పిఠాపురం సంస్థానంలో రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు ఆశ్రయం పొందిన కవులలో ఒకడు. వేంకట రామకృష్ణ కవులు పిఠాపురం రాజాశ్రయం పొందడానికి ఒకవిధంగా ఇతడు కారకుడు.

రచనలు

[మార్చు]

ఇతడు శ్రీ సూర్యరాయ శతకము, శర్మిష్ఠావిజయము అనే నాటకాన్ని వ్రాశాడు.

శ్రీ సూర్యరాయ శతకము

[మార్చు]

23 పేజీలలో 100 పద్యములు కల శ్రీ సూర్యరాయ శతకము[1] 1916లో చెన్నపురి ఆంధ్రపత్రికాలయములో ముద్రింపబడింది. పిఠాపురం మహారాజా రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు దాతృత్వాన్ని వర్ణించి, కొన్ని నీతులు బోధింపబడిన ఈ శతకములో "సూర్యనృపా" అనే మకుటం కలదు. ఇది కాక కవి "సూర్యరాయ విబుధవిదేయా!" "సూర్యరాయ సజ్జనగేయా!" "సూర్యరూప! చిత్తజరూపా!" అని కూడా సంబోధించాడు. అపాత్రదానము పనికి రాదని, ప్రభువెన్నడు తనకున్నదంతయు వెచ్చింపరాదని, వెనుక ముందు చూచి ఇవ్వవలెనని కవి ఈ శతకము ద్వారా ప్రభువుకు హితబోధ చేశాడు.

కం. పండితున కొక్కడబ్బిడఁ
గొండగు, మఱి వేనవేలు కొండీండ్రకిడన్
బెండగు పాత్రాపాత్రల్
ఖండితముగ నెంచి చూడ ఘనసూర్యనృపా!

ఇతని హితబోధను పాటించకుండుట వల్లనేమో మహారాజా వృద్ధాప్యం శోచనీయంగా మారింది.

మూలాలు

[మార్చు]
  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973