దుర్గాబాయి కామత్
దుర్గాబాయి కామత్ | |
---|---|
జననం | సుమారు 1879 |
మరణం | 1997 మే 17 (వయస్సు 117–118) |
వృత్తి | నటి |
పిల్లలు | కమలాబాయి గోఖలే (కుమార్తె) |
బంధువులు |
|
దుర్గాబాయి కామత్ (1879 - 1997, మే 17) మరాఠీ సినిమా నటి. భారతీయ సినిమారంగంలో తొలితరం నటిమణీగా గుర్తింపు పొందింది.[1]
జననం
[మార్చు]దుర్గాబాయి కామత్ 1879లో మహారాష్ట్రలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.[2] ఈమె ప్రముఖ మరాఠీ నటుడు చంద్రకాంత్ గోఖలేకి అమ్మమ్మ,[3] నటులు విక్రమ్ గోఖలే, మోహన్ గోఖలేలకు ముత్తాతమ్మ.[4]
కెరీర్
[మార్చు]1900ల ప్రారంభకాలంలో నాటకాలు, సినిమాలలో మహిళలు నటించడం నిషిద్ధం, కాబట్టి భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే మొదటి భారతీయ సినిమా రాజా హరిశ్చంద్ర లో స్త్రీ పాత్రలకు పురుష నటులను ఉపయోగించాల్సివచ్చింది. అయితే ఆ సినిమా విజయవంతమవడంతో మహిళా నటీమణులకు ప్రోత్సాహం దొరికింది. దాంతో అతను 1913లో తన రెండవ సినిమా మోహిని భస్మాసుర్[5] దుర్గాబాయి కామత్‌ను పార్వతిగా పరిచయం చేయగా, ఆమె కుమార్తె కమలాబాయి గోఖలే మోహిని పాత్రను పోషించింది. ఆవిధంగా భారతీయ సినిమారంగ మొదటి బాలనటి అయింది. కామత్ తరువాత, ఇతర నటీమణులు సినిమాల్లో నటించింది ప్రారంభించారు.[6]
మరణం
[మార్చు]దుర్గాబాయి కామత్ తన 117 సంవత్సరాల వయస్సులో 1997, మే 17న మహారాష్ట్రలోని పూణేలో మరణించింది.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1913 | మోహినీ భస్మాసురుడు | పార్వతి |
మూలాలు
[మార్చు]- ↑ "Vikram Gokhale has an illustrious family lineage". The Times of India. 23 January 2013. Archived from the original on 29 June 2013. Retrieved 2022-12-20.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Durgabai Kamat: The First Female Actor In Indian Cinema". Idiva Dot Com (in ఇంగ్లీష్). 2018-03-07. Retrieved 2022-12-20.
- ↑ Veteran actor Gokhale dead, The Times of India, 21 June 2008.
- ↑ "Vikram Gokhale has an illustrious family lineage". The Times of India. 23 January 2013. Archived from the original on 29 June 2013. Retrieved 2022-12-20.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో దుర్గాబాయి కామత్ పేజీ
- ↑ Riya Chakravarty (3 May 2013). "Indian cinema@100: First women on screen: Durgabai Kamat and her daughter Kamlabai Ghokhle". NDTV. Archived from the original on 2013-05-04. Retrieved 2022-12-20.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)