దుంపరాష్ట్రము
దుంపరాష్ట్రము | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Tribe: | |
Genus: | |
Species: | A. galanga
|
Binomial name | |
Alpinia galanga |
దుంపరాష్ట్రము యొక్క వృక్ష శాస్త్రీయ నామం అల్పినియా గలంగ (Alpinia galanga).
ఇతర భాషలు
[మార్చు]హిందీ - కులాంజన్, కులింజన్, కన్నడ - డొడ్డరసగట్టె, మలయాళం - అరట్టి, పేరరట్టి, సంస్కృతం -రాస్నా, సుగంధమూల
వ్యాప్తి
[మార్చు]ముఖ్యంగా పశ్చిమ కనుమలలో విస్తృతంగా దొరుకుతుంది. అన్ని కాలాలలోనూ నిరంతరంగా పెరిగే మొక్క. సుగంధ ద్రవ్యం.
వర్ణన
[మార్చు]నేలలో నేలబారుగా దుంపలు విస్తరిస్తాయి. ఆ దుంపలకు కాండంపైన ఆకులు మొక్కలు వస్తాయి. మొక్కలు 1.8 నుంచి 2.1 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఆకులు కొలగా మొనదేలి, నున్నగా, ఆకర్షణీయమైన పచ్చని రంగుతో ఉంటాయి. పూవులు, సువాసన కలిగి, లేత ఆకుపచ్చ తెలుపు రంగులో, ఎర్రటి తొడిమలతో గుత్తులుగా ఉంటాయి. ముదిరి పండిన కాయలు కాషాయ రంగులో ఉంటాయి.
ఔషధానికి ఉపయోగపడే భాగాలు
[మార్చు]దుంపభాగం. దుంపలు చేదుగానూ, కొద్ది మంట, చురుకుమనిపించే రుచి కలిగి ఉంటాయి. సువాసన కలిగి, నరాలకు బలాన్నిచ్చే టానిక్, ఉత్ప్రేరకం, జీర్ణకారి, కడుపును శుభ్ర పరచేది. దురదలను నివారిస్తుంది. వాత, కఫలాలను తగ్గిస్తుంది. దగ్గు, ఉబ్బసము, ఎక్కిళ్ళు, ఆయాసము, జ్వరాలు, మధుమేహము, అజీర్ణము, కడుపులో నొప్పి, కొవ్వు జ్వరాలకు దివ్యౌషధము.
చిత్రమాలిక
[మార్చు]-
దుంపరాష్ట్రము
-
A. galanga plant
మూలాలు
[మార్చు]ఆదిమ గిరిజన వైద్యము - పలురేతు షణ్ముఖరావు