దీప్తి దివాకర్
అందాల పోటీల విజేత | |
జననము | బెంగళూరు, కర్ణాటక భారతదేశం |
---|---|
పూర్వవిద్యార్థి | * పార్సన్స్ ది న్యూ స్కూల్ ఫర్ డిజైన్, న్యూయార్క్ సిటీ, యునైటెడ్ స్టేట్స్ * యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్, యునైటెడ్ స్టేట్స్ * బెంగళూరు యూనివర్సిటీ, భారతదేశం * శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ, యునైటెడ్ స్టేట్స్ |
వృత్తి | మోడల్, నటి, రచయిత |
జుత్తు రంగు | నలుపు |
కళ్ళ రంగు | నలుపు |
బిరుదు (లు) | ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 1981 |
దీప్తి దివాకర్ (జననం 1958 అక్టోబరు 31) ఒక భారతీయ నటి, రచయిత్రి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె 1981లో మిస్ ఇండియా టైటిల్ విజేత.[1][2]
ప్రారంభ జీవితం
[మార్చు]దీప్తి దివాకర్ బెంగళూరులో జన్మించింది. ఆమె తాత డాక్టర్ ఆర్. ఆర్. దివాకర్ భారతదేశపు మొదటి సమాచార, ప్రసార శాఖా మంత్రి, బీహార్ రాష్ట్ర గవర్నర్. ఆమె న్యూయార్క్ లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్, లాస్ ఏంజిల్స్ లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలలో ఇంటీరియర్ డిజైన్ కోర్సులు అభ్యసించింది. ఆమె బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిగ్రీ, శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీ నుండి రేడియో అండ్ టెలివిజన్ లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని కలిగి ఉంది.
ఆమె భారతదేశం, యూరప్, యునైటెడ్ స్టేట్స్ లలో భారతీయ శాస్త్రీయ నృత్యం భరతనాట్యం ప్రదర్శించింది. ఈ ప్రయత్నంలో పశ్చిమ బెంగాల్ ప్రపంచ అభివృద్ధి పార్లమెంటు ఆమెకు "భరతనాట్యం మహారత్నం" అనే జాతీయ అవార్డును ప్రదానం చేసింది.
మూలాలు
[మార్చు]- ↑ "The Hindu : Metro Plus Bangalore / People : A different dimension". www.hindu.com. Archived from the original on 5 October 2013. Retrieved 17 January 2022.
- ↑ "Former Miss India reaches out to slum-dwellers". The Times of India. 6 April 2002. Retrieved 1 February 2019.