Jump to content

దీనబాంధవ

వికీపీడియా నుండి
దీనబాంధవ
జననంజూలై 20, 1983
విద్యఎం.ఫిల్ (రంగస్థల కళలు)
విద్యాసంస్థతెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నాటకరంగ నటుడు, దర్శకుడు, రచయిత, గాయకుడు.
జీవిత భాగస్వామివల్లి వసంతం
పిల్లలువాగ్వేద

దీనబాంధవ నాటకరంగ నటుడు, దర్శకుడు, రచయిత, గాయకుడు. మిఠాయి థియేటర్ సంస్థను స్థాపించి చిల్డ్రన్ థియేటర్ లో కృషి చేస్తూ, చిన్నారులకు నాటకరంగంలో శిక్షణ ఇస్తున్నాడు.[1]

జీవిత విషయాలు

[మార్చు]

దీనబాంధవ 1983, జూలై 20న వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండలో జన్మించాడు. 2000లో హైదరాబాద్ వచ్చిన దీనబాంధవ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృతంలో ఎం.ఏ., తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళలశాఖలో ఎంపిఏ పూర్తిచేసాడు.

భాస్కర్ అనే మిత్రుడి సహాయంతో సొంతంగా పాటలు రాసి, స్వరకల్పన చేసి, పాడుతూ దాదాపు 30 ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించాడు. దీనబాంధవ రూపొందించిన జంగిట్యూన్ అనే ఆల్బమ్ ను అప్పటి గవర్నర్ సుర్జీత్ సింగ్ బర్నాల చేతుల మీదుగా విడుదల చేశాడు. సర్వశిక్షా అభియాన్ నిర్వహించిన నేషనల్ ఆడియో, వీడియో ఫెస్టివల్ లో పాల్గొని జాతీయ అవార్డును అందుకున్నాడు.[2]

నాటకరంగం

[మార్చు]

నాటకరంగంలో పరిశోధన చేస్తున్న దీనబాంధవ, చిన్నపిల్లలతో నాటకాలు వేయిస్తూ సాంస్కృతి, సంప్రదాయాలను, పురాణాలను, స్ఫూర్తి ప్రదాతల జీవిత చరిత్రలను నాటకాలుగా మలిచి నేటి తరానికి చైతన్యం కలిగిస్తున్నాడు. 2015, ఫిబ్రవరి 23న 250మంది చిన్నారులతో 12 గంటలపాటు రవీంద్రభారతిలో 'శ్రీ ఆంజనేయం' నాటకాన్ని ప్రదర్శించాడు.[3][4][5]

నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో సూరజ్ ఖుండ్ లో 15రోజుల పాటు జరిగిన 'థియేటర్ ఇన్ ఎడ్యుకేషన్' శిక్షణ శిబిరంలో పాల్గొని, నాటక కళ బడి పిల్లలకు ఎలా ఉపయోగపడుతుందనే అంశంపై శిక్షణ పొందాడు.[2]

దర్శకత్వం చేసినవి

  • శ్రీ ఆంజనేయం
  • చీమకుట్టిన నాటకం
  • ఇచ్చంత్రం[6]
  • తుర్రుపిట్ట
  • పాపు టికెట్ పరేషాన్
  • ఓ ఆఫీస్ కథ
  • మనం బాగుండాలి
  • బిస్కెట్ బేబి[7]
  • బతుకుకోరె బతుకమ్మ

నటించినవి

  • చింతబరిగే స్కీం
  • ప్రసన్నకు ప్రేమతో
  • జంబూద్వీపం
  • దయ్యలున్నాయి జాగ్రత్త

రచనలు

[మార్చు]

వాట్సాప్ వేదికగా 'శ్రీ రమణి'అనే సీరియల్ కథను రాసాడు. ఈ సీరియల్ ప్రజాదరణ పొంది, ముద్రణకు సిద్ధంగా ఉంది.[8]

మూలాలు

[మార్చు]
  1. థియేటర్ ఇన్ ఎడ్యుకేషన్, నమస్తే తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్, 12 ఆగస్టు 2018, పుట. 13.
  2. 2.0 2.1 కళాబాంధవుడు, నమస్తే తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్, 25 జులై 2018.
  3. ఔరా.. అనిపించిన 'దీనబాంధవ, నమస్తే తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్, 30 మార్చి 2015
  4. Giving a Boost to Telugu Theatre, Daccan Chronicle, Hyderabad, 27 March 2015
  5. సాక్షి, ఫీచర్స్ (8 March 2015). "కిడ్స్ కిష్కింద". Sakshi. Archived from the original on 14 December 2015. Retrieved 29 June 2021.
  6. ఈటివి భారత న్యూస్, తెలంగాణ (27 November 2019). "విద్యార్థుల విచిత్రమైన అలవాట్లు ఎలా ఉంటాయో తెలుసా?" (in ఇంగ్లీష్). Archived from the original on 29 June 2021. Retrieved 29 June 2021.
  7. ఆంధ్రజ్యోతి, సాహిత్యం. "ఆకట్టుకున్న బిస్కట్ బేబీ నాటకం". lit.andhrajyothy.com. Archived from the original on 29 June 2021. Retrieved 29 June 2021.
  8. వాట్సాప్ సీరియల్ శ్రీ రమణి, వి6 వెలుగు లైఫ్, 7 జూలై 2020, పుట.3.
"https://te.wikipedia.org/w/index.php?title=దీనబాంధవ&oldid=4344047" నుండి వెలికితీశారు