దీకొండ సారంగపాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Sarangapani Deekonda
శంకర్ ఎడమవైపు సారంగపాణి
జననంసారంగపాణి
10.04.1957
వరంగల్ జిల్లా
మరణం01.09.2002
వరంగల్ .
నివాస ప్రాంతంహన్మకొండ
ప్రసిద్ధిఓరుగల్లు ప్రముఖ,జానపద సినీ నేపథ్య గాయకుడు.
మతంహిందు
భార్య / భర్తదీకొండ ప్రమీల
పిల్లలుప్రణీత,గౌతమ్,రాజమహేంద్ర .
తండ్రిలక్ష్మయ్య
తల్లిగౌరమ్మ

దీకొండ సారంగపాణి తెలంగాణ ప్రముఖ తెలుగు జానపద, సినీ నేపథ్య గాయకుడు[1].

బాల్యం, వృత్తి జీవితం

[మార్చు]

వరంగల్ జిల్లాలో దీకొండ సారంగపాణి జన్మించారు. బాల్యమంతా హనుమకొండ లలోనే గడిచింది. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన సానా యాదిరెడ్డి సినిమాలతో సినీ నేపథ్య గాయకుడుగా వెలుగులోకొచ్చాడు. అనంతరం జానపద సినీ నేపథ్య గాయకుడుగా సినిమాలలో సారంగపాణి అనేక పాటలు పాడారు. పిట్టల దొర రావే వయ్యరి రాస గుమ్మడి ఈ రాలుగారి పిట్టలదొర నీసరి జోడి. ప్రేమ పల్లకి సినిమాలో కొండకోన తిరిగేటి మామయ్యో నీ అండ నేనుంటాను రావయ్యో లాంటి... తెలుగు సినిమా గాయకుడు చిత్రతో సారంగపాణీ అనేక పాటలు పాడారు. దీకొండ సారంగపాణి, జానపద సినీ నేపథ్య గాయకుడైన వరంగల్ శంకర్కి సమకాలికుడు.

వివాహం

[మార్చు]

ప్రమీల సారంగపాణి సతీమణి వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు.

ప్రజాదరణ పొందిన పాటలు

[మార్చు]

దీకొండ సారంగపాణి పాటలు... ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు గజ్జల సింగారామ తందనానే తాన... తయ్యందతయ్యం తయ్యందతయ్యం లంబాడోల్లం మేము బాబు బంజాలం ... పండు వెన్నెలే పల్లె నిండా రాలుతూ ... జానపద, సినిమా గేయాలు ఉరుతలుగించినవి[2].

మరణం

[మార్చు]

సికింద్రాబాదు రైల్వే స్టేషన్లో ప్రమాదవ శాత్తు రైలు కింద పడి సారంగపాణి మరణించారు.

మరణాంతరం

[మార్చు]

భర్త స్నేహితులే ఆదుకున్నారు జానపద కళాకారుడిగా సారంగపాణి సంపాదించింది ఏమీ లేదు. ఆయన మరణాంతరం స్నేహితులే కుటుంబాన్ని ఆదుకున్నారు. భర్త లేని తనకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆర్థిక సాయం అందించాడు. సారంగపాణి సతీమణి ప్రమీల.[1].

ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, కాకతీయ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీదేవి ఫీజులు లేకుండా చదివించారని సారంగపాణి కొడుకు రాజమహేందర్ తెలియజేశాడు.

మూలాలు

[మార్చు]