Jump to content

ది డెవిల్స్ చైర్

వికీపీడియా నుండి
ది డెవిల్స్ చైర్
దర్శకత్వంగంగ సప్తశిఖర
రచనగంగ సప్తశిఖర
స్క్రీన్‌ప్లేబాబీ కె ఎస్ ఆర్
నిర్మాత
  • కె కె చైతన్య
  • వెంకట్ దుగ్గిరెడ్డి
  • చంద్ర సుబ్బగారి
తారాగణం
ఛాయాగ్రహణంవిజయానందన్
కూర్పుహేమంత్ నాగ్
సంగీతంబి షేక్ _మ్యూజికల్
నిర్మాణ
సంస్థలు
  • బాబీ ఫిలిమ్స్
  • ఓం సాయి ఆర్ట్స్
  • సి ఆర్ ఎస్ క్రియేషన్స్
విడుదల తేదీ
21 ఫిబ్రవరి 2025 (2025-02-21)
దేశంభారతదేశం
భాషతెలుగు

ది డెవిల్స్ చైర్ 2025లో తెలుగులో విడుదలైన సినిమా.[1] బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్ బ్యాన‌ర్స్‌పై కె కె చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్ర సుబ్బగారి నిర్మించిన ఈ సినిమాకు గంగ సప్తశిఖర దర్శకత్వం వహించాడు.[2] అదిరే అభి, స్వాతి మండల్, ఛత్రపతి శేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 19న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేశారు.

విక్రమ్ (అదిరే అభి) జూదానికి బానిసై తను పనిచేస్తున్న కంపెనీలోని కోటి రూపాయలు కొట్టేసి బెట్టింగ్ ఆడతాడు. ఈజీ మనీకి అలవాటు పడిన విక్రమ్ డబ్బు మొత్తం బెట్టింగ్ లో పోగొట్టుకుని ఉద్యోగం పోగొట్టుకోవడమే కాదు లీగల్ గా కేసులో ఇరుక్కుంటాడు. అతనికి రుధిర (స్వాతి మండల్) ఎయిర్ హోస్టెస్ ప్రియురాలు వుంటంది. విక్రమ్ కి ఉద్యోగం పోవడంతో తనే ఆర్థికంగా ఆదుకుంటూ అండగా వుంటుంది. రుధిర ఒక యాంటిక్ కుర్చీని ఇష్టపడి కొని తెచ్చుకుని ఇంట్లో పెడుతుంది. ఆ కుర్చీ వల్ల విక్రమ్ కి కావాల్సినప్పుడల్లా డబ్బులు వచ్చి పడుతుంటాయి. ఈ కుర్చీ వల్ల విక్రమ్, రుధిర జీవితాల్లో ఎలాంటి మార్పులు ఎదురుకున్నారు ? ఆ తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."అవునని, కాదని[5]"ఆదిలక్ష్మి కేఅభిషేక్3:52
2."చాక్లెట్ బేబీ"మెర్సీ మార్గరెట్జయంత్ బి4:32

మూలాలు

[మార్చు]
  1. "మనిషికి ఉండే దురాశ ఇతివృత్తంతో 'ది డెవిల్స్‌ చైర్‌'". Chitrajyothy. 20 February 2025. Archived from the original on 21 February 2025. Retrieved 21 February 2025.
  2. "ప్రయోగాత్మక చిత్రంతో వస్తున్న యంగ్‌ డైరెక్టర్‌.. ఎవ్వరు ఊహించని కాన్సెప్ట్ తో..!". Zee News Telugu. 21 February 2025. Archived from the original on 21 February 2025. Retrieved 21 February 2025.
  3. "'ది డెవిల్స్ చైర్' మూవీ రివ్యూ". Sakshi. 21 February 2025. Archived from the original on 21 February 2025. Retrieved 21 February 2025.
  4. "ఇంకో 23 ఏళ్లయినా కష్టపడతా..సక్సెస్‌ తర్వాతే బయటకు వెళ్తా: అదిరే అభి". Sakshi. 21 February 2025. Archived from the original on 21 February 2025. Retrieved 21 February 2025.
  5. ""ది డెవిల్స్ చైర్" నుండి అవునని, కాదని సాంగ్ విడుదల". NTV Telugu. 15 February 2025. Archived from the original on 21 February 2025. Retrieved 21 February 2025.