ది గోట్ లైఫ్
స్వరూపం
ది గోట్ లైఫ్ | |
---|---|
దర్శకత్వం | బ్లెస్సీ |
రచన | బెన్యామిన్ |
దీనిపై ఆధారితం | ఆడుజీవితం |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | సునీల్ కె.ఎస్ కె.యు. మోహనన్ |
కూర్పు | ఏ. శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ (మలయాళం) రెడ్ జెయింట్ మూవీస్ (తమిళం) మైత్రి మూవీ మేకర్స్ (తెలుగు) హోంబలే ఫిల్మ్స్ (కన్నడ) ఏఏ ఫిలిమ్స్ (హిందీ) |
విడుదల తేదీ | 28 మార్చి 2024 |
సినిమా నిడివి | 173 నిముషాలు[1] |
దేశాలు |
|
భాష |
|
ది గోట్ లైఫ్ (ఆడుజీవితం) 2024లో విడుదలైన తెలుగు సినిమా. విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, ఆల్టా గ్లోబల్ మీడియా బ్యానర్‌లపై బ్లెస్సీ, జిమ్మీ జీన్-లూయిస్, స్టీవెన్ ఆడమ్స్ నిర్మించిన ఈ సినిమాకు బ్లెస్సీ దర్శకత్వం వహించగా తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ విడుదల చేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, అమలా పాల్, జిమ్మీ జీన్-లూయిస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 28న విడుదలైంది.
90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రచయిత బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ పుస్తకం ఆధారంగా నిర్మించిన ఈ సినిమా 2008లో ప్లాన్ చేసిన ఈ సినిమాను పదేళ్ల తర్వాత 2018లో షూటింగ్ ప్రారంభించి 2024 మార్చి 28న విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]- నజీబ్ మహమ్మద్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్
- ఇబ్రహీం ఖాదిరిగా జిమ్మీ జీన్-లూయిస్
- హకీమ్‌గా కె. ఆర్. గోకుల్
- ఖఫీల్‌గా తాలిబ్ అల్ బలూషి
- నజీబ్ భార్య సైనుగా అమలా పాల్
- నజీబ్ తల్లిగా శోభా మోహన్
- జాసర్‌గా రిక్ అబీ
- కుంజిక్కగా నాజర్ కరుతేని
- హిందీవాలాగా రాబిన్ దాస్
- కరువట్ట శ్రీకుమార్‌గా బాబూరాజ్ తిరువళ్ల
- హమీద్‌గా అజీ జార్జ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్:విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, ఆల్టా గ్లోబల్ మీడియా
- నిర్మాత: బ్లెస్సీ, జిమ్మీ జీన్-లూయిస్, స్టీవెన్ ఆడమ్స్
- కథ: బెన్యామిన్
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బ్లెస్సీ
- సంగీతం: ఎ. ఆర్. రెహమాన్
- సినిమాటోగ్రఫీ: సునీల్ కె.ఎస్, కె.యూ. మోహనన్
- ఎడిటర్: ఏ. శ్రీకర్ ప్రసాద్
మూలాలు
[మార్చు]- ↑ "Aadujeevitham (The Goat Life)".
- ↑ ETV Bharat News (22 March 2024). "ఎట్టకేలకు తెరపైకి 'ది గోట్ లైఫ్'- 16ఎళ్ల తర్వాత పృథ్వీరాజ్ సినిమాకు మోక్షం - The Goat Life Movie Release". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.