దిశా వకాని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిశా వకాని
'ఎక్స్‌పీరియన్స్ బ్లైండ్‌నెస్' లాంచ్‌లో దిశా పాడియా
జననంఆగస్టు 17
విద్యగుజరాత్ కళాశాల, అహ్మదాబాద్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1997-ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తారక్ మెహతా కా ఊల్తా చష్మా
జీవిత భాగస్వామి
మయూర్ పాడియా
(m. 2015)
పిల్లలు2

దిశా వకాని, గుజరాత్ రాష్ట్రానికి చెందిన నాటకరంగ, టీవి, సినిమా నటి. తారక్ మెహతా కా ఊల్తా చష్మా అనే సీరియల్‌లో దయా జెతలాల్ గదా పాత్రలో నటించి పేరు పొందింది.

తారక్ మెహతా కా ఊల్తా చష్మా సీరియల్‌లోని దయా గదా పాత్రలో కెబిసి సెట్స్‌లో దిశా వకాని
11వ ఇటా అవార్డులలో వకాని- పాడియా

జననం, విద్య

[మార్చు]

దిశా వకాని ఆగస్టు 17న గుజరాత్‌ రాష్ట్ర, అహ్మదాబాద్‌లోని గుజరాతీ కుటుంబంలో జన్మించింది.[1] అహ్మదాబాద్‌లోని గుజరాత్ కళాశాల నుండి డ్రామాటిక్స్‌లో పట్టా పొందింది.[2]

నటనా జీవితం

[మార్చు]

గుజరాతీ నాటకరంగం ద్వారా నటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించి కమల్ పటేల్ వర్సెస్ ధమాల్ పటేల్, లాలీ లీలా వంటి నాటకాలలో నటించింది.[2] దేవదాస్ (2002), జోధా అక్బర్ (2008) వంటి హిందీ సినిమాలలో సహాయ పాత్రలు పోషించింది.[3] 2008లో సోనీ సబ్ టీవిలో వచ్చిన తారక్ మెహతా కా ఊల్తా చష్మా సీరియల్‌లో దయా జెతలాల్ గదా అనే ప్రధాన పాత్రను పోషించింది.[4][5][6] 2017 సెప్టెంబరులో ప్రసూతి సెలవుపై వెళ్ళి, మళ్ళీ ఆ సీరియల్‌లో నటించలేదు. షో నుండి నిష్క్రమించిన తర్వాత మళ్ళీ ఎప్పుడూ టెలివిజన్ లేదా సోషల్ మీడియాలో కనిపించలేదు.[7][8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

2015 నవంబరు 24న ముంబైకి చెందిన మయూర్ పాడియా అనే చార్టర్డ్ అకౌంటెంట్‌తో దిశా వకాని వివాహం జరిగింది.[9][10] 2017 నవంబరు 27న వారికి పాప,[7] 2022 మే 24న బాబు జన్మించారు.

నటించినవి

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష
1997 కమ్సిన్: ది అన్‌టచ్డ్ పింకీ హిందీ
1999 పండడు లిలు నే రంగ్ రాతో పరుల్ గుజరాతీ
ఫూల్ ఔర్ ఆగ్ హిందీ
2002 పైసో మరో పరమేశ్వర్ గుజరాతీ
దేవదాస్ సఖి హిందీ
2005 మంగళ్ పాండే: ది రైజింగ్ యాస్మిన్
2006 జానా. . . లెట్స్ ఫాల్ ఇన్ లవ్ సల్మా దిసా
2008 జోధా అక్బర్ మాధవి
సీ కంపనీ రైల్వే ఉద్యోగి వితంతువు
లవ్ స్టోరా 2050 పనిమనిషి

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2003 శుభ్ మంగళ్ సావధాన్ సంస్కృతి
2004 ఖిచ్డీ నర్స్
2005 తక్షణ ఖిచ్డీ నిషా ఎపిసోడ్ 2
హీరో - భక్తి హై శక్తి హై స్కూల్ టీచర్
2004–2005 ఆహత్ బీనా
2008–2017, 2018, 2019 తారక్ మెహతా కా ఊల్తా చష్మా దయా జేతలాల్ గదా
2014 సిఐడి అతిథి పాత్ర

అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డు విభాగం కార్యక్రమం ఫలితం
2008 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ హాస్య నటిగా ఇటా అవార్డు తారక్ మెహతా కా ఊల్తా చష్మా విజేత[2]
2009 9వ ఇండియన్ టెలీ అవార్డులు హాస్య పాత్రలో ఉత్తమ నటి
ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ హాస్య నటి
2010 3వ జీ గోల్డ్ అవార్డులు ఉత్తమ హాస్య నటి
10వ ఇండియన్ టెలీ అవార్డులు ఉత్తమ హాస్య నటి
2014 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఉత్తమ హాస్య నటి
2015

మూలాలు

[మార్చు]
  1. "Daya Ben aka Disha Vakani turns a year older". The Times of India. 17 August 2015. Archived from the original on 14 October 2018. Retrieved 2023-02-16.
  2. 2.0 2.1 2.2 "I enjoy acting: Disha Vakani". Mumbai Mirror. 30 December 2011. Archived from the original on 11 November 2013. Retrieved 2023-02-16.
  3. Jhumari Nigam-Misra (12 November 2009). "Pretty women". Archived from the original on 22 September 2013. Retrieved 2023-02-16.
  4. "Comedy Inc". 1 July 2010. Archived from the original on 12 October 2020. Retrieved 2023-02-16.
  5. "Character's the KING". The Indian Express. 25 November 2010. Archived from the original on 12 October 2020. Retrieved 2023-02-16.
  6. "Funny female bone". The Times of India. 21 June 2009. Archived from the original on 24 July 2013. Retrieved 2023-02-16. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  7. 7.0 7.1 "Confirmed! Disha Vakani not returning as Dayaben on 'Taarak Mehta Ka Ooltah Chashmah'". dna (in ఇంగ్లీష్). 23 January 2019. Archived from the original on 20 February 2019. Retrieved 2023-02-16.
  8. "Asit Modi on replacing Disha Vakani on Taarak Mehta Ko Ooltah Chashmah: No one is bigger than the show". India Today (in ఇంగ్లీష్). 4 April 2019. Archived from the original on 5 April 2019. Retrieved 2023-02-16.
  9. "Dayaben of 'Taarak Mehta Ka Ooltah Chashmah' aka Disha Vakani ties the knot". Daily News and Analysis. 25 November 2015. Archived from the original on 27 November 2015. Retrieved 2023-02-16.
  10. "TV actress Disha Vakani ties the knot!". India Today. 24 November 2015. Archived from the original on 16 February 2017. Retrieved 2023-02-16.

బయటి లింకులు

[మార్చు]