దివాన్ దేవిడి ప్యాలెస్
దివాన్ దేవిడి ప్యాలెస్ | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | రాజభవనం |
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
దివాన్ దేవిడి ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ప్యాలెస్. సాలార్ జంగ్ వంశస్థులకోసం నిర్మించిన ఈ భవనం చార్మినారు, చౌమహల్లా పాలస్కి సమీపంలో ఉంది. దివాన్ అనగా ప్రధానమంత్రి, దేవిడి అనగా రాజభవనం. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా) చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
నిర్మాణం
[మార్చు]1889 నుంచి 1949 వరకు నిజాం నవాబు వద్ద ప్రధానిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన మీర్ యూసుఫ్ అలీఖాన్ (మూడో సాలార్ జంగ్) దేశ విదేశాల్లో పర్యటించి అద్భుతమైన కళాఖండాలను సేకరించి, ఈ దివాన్ దేవిడి (తన ఎస్టేట్) లో ఉంచేవాడు.[1] దీవాన్ దేవిడిలో 78 గదులు ఉన్నాయి. ఇది ఐనా ఖానా, లక్కాడ్ కొఠా, చిని ఖానా, నిజాం బాగ్, నూర్ మహల్ వంటి భవన నిర్మాణాలకు విభిన్నంగా నిర్మించబడింది. ఈ రాజభవనానికి గేట్వే ఇప్పటికీ ఉంది.[2][3]
మ్యాజియంగా
[మార్చు]1949లో నవాబ్ మరణించాడు. ప్యాలెస్ లో ఉన్న కళాఖండాలతో 1951, డిసెంబరు 16న జవహర్ లాల్ నెహ్రూ చేతులమీదుగా సాలార్ జంగ్ మ్యూజియం అనే పేరుతో ఒక ప్రైవేట్ మ్యూజియం ప్రారంభించబడింది.
ఇతర వివరాలు
[మార్చు]మూడో సాలార్‌జంగ్ మీర్ యూసుఫ్ అలీఖాన్ దివాన్ ఆధ్వర్యంలో దేవిడి ప్యాలెస్ ప్రాంగణంలో 1920లో సెలెక్ట్ టాకీస్ పేర హైదరాబాదులో తొలి పర్మినెంట్ థియేటర్ నిర్మాణం జరిగింది. నిజాం కుటుంబ సభ్యుల కొరకు మాత్రమే నిర్మించిన ఈ థియేటర్ కోసం లండన్ నుండి 16 ఎం.ఎం. ప్రొజెక్టర్‌ను దిగుమతి చేసుకున్నారు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణా- కధనాలు (15 January 2015). "సాలార్ జంగ్.. కళాఖండాల సేకరణే జీవితం". Archived from the original on 16 January 2019. Retrieved 16 January 2019.
- ↑ "Diwans gone, Deodhis die, squatters rule `Kamaan' - Times of India". The Times of India. Retrieved 16 January 2019.
- ↑ "The Hindu : From majestic to mundane". www.thehindu.com. Retrieved 16 January 2019.
- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ, ఆదివారం సంచిక (20 March 2018). "తెరమరుగైన మన టాకీసులు". Archived from the original on 21 September 2018. Retrieved 16 January 2019.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ నవ తెలంగాణ (2 July 2016). "తెలంగాణ సినిమా @ 120". Archived from the original on 21 September 2018. Retrieved 16 January 2019.