దినేష్ మక్వానా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దినేష్ మక్వానా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 -
నియోజకవర్గం అహ్మదాబాదు పశ్చిమ

డిప్యూటీ మేయర్
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్[1]
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018 - 2023

వ్యక్తిగత వివరాలు

జననం (1969-12-16) 1969 డిసెంబరు 16 (వయసు 54)
అహ్మదాబాద్, గుజరాత్
తల్లిదండ్రులు కోదర్‌భాయ్ ధులాభాయ్ మక్వానా, మణిబెన్
జీవిత భాగస్వామి అంజనా దినేష్‌భాయ్ మక్వానా
సంతానం 1 కుమార్తె
నివాసం ప్లాట్ నెం. 69, హరిద్వార్ సొసైటీ, సట్లూజ్ హోటల్ వెనుక, అమీన్ పెట్రోల్ పంప్ దగ్గర, నరోడా అహ్మదాబాద్, గుజరాత్[1]

దినేష్‌భాయ్ కోదర్‌భాయ్ మక్వానా (జననం 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అహ్మదాబాద్ డిప్యూటీ మేయర్‌గా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అహ్మదాబాదు పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

దినేష్ మక్వానా 1969 డిసెంబరు 16న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో కోదర్‌భాయ్ ధులాభాయ్ మక్వానా, మణిబెన్ దంపతులకు జన్మించాడు. ఆయన 1994లో అహ్మదాబాద్‌లోని మోతీలాల్ నెహ్రూ లా కాలేజీ నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

దినేష్ మక్వానా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు 5 సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికై 2018 నుండి 2023 వరకు డిప్యూటీ మేయర్‌గా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అహ్మదాబాదు పశ్చిమ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి భరత్ మక్వానాపై 2,86,437 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికలలో దినేష్ మక్వానాకు 6,11,704 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి భరత్ మక్వానా 3,25,267 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి అనిల్ కుమార్ వాఘేలా 9,600 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (15 June 2018). "Bijal Patel is mayor, Makwana her deputy". Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.
  2. TimelineDaily (5 June 2024). "BJP's Dineshbhai Kodarbhai Makwana Wins Ahmedabad West With 6.1 Lakh Votes" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.
  3. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Ahmedabad West". Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.
  4. The Indian Express (6 June 2024). "Gujarat elect 10 new faces for Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.
  5. "It's Makwana Vs Makwana in Ahmedabad West LS seat" (in ఇంగ్లీష్). 17 April 2024. Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.