దినేష్ చంద్ర యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దినేష్ చంద్ర యాదవ్
జననం (1951-07-01) 1951 జూలై 1 (వయసు 73)[1]
బాన్మా జిల్లా. సహార్సా, (బీహార్).[1]
జాతీయతభారతదేశం
విద్యడిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్.[1]
విద్యాసంస్థగవర్నమెంట్ పాలిటెక్నిక్, సహార్సా
వృత్తిఇంజనీర్ & రాజకీయ నాయకుడు
క్రియాశీల సంవత్సరాలు1990 – date
రాజకీయ పార్టీజనతా దళ్
(జనతా దళ్ (యునైటెడ్)).[1]
జీవిత భాగస్వామిరేణు సిన్హా.[1]
తల్లిదండ్రులురాంధారి యాదవ్ (తండ్రి) & సీతాదేవి (తల్లి).[1]

దినేష్ చంద్ర యాదవ్ బీహార్‌ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నుండి మాధేపురా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

దినేష్ చంద్ర యాదవ్ బీహార్ రాష్ట్రంలోని సహర్సా జిల్లా, బన్మా గ్రామంలో 1951 జూలై 1న జన్మించి, సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

దినేష్ చంద్ర యాదవ్ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాలకి వచ్చి 1990లో బీహార్‌లోని సిమ్రి భక్తియార్‌పూర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సహర్సా లోక్‌సభ నుండి 11వ లోక్‌సభకు తొలిసారి ఎంపీగా, ఆ తరువాత 1999లో రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.

దినేష్ చంద్ర యాదవ్ 2004 ఎన్నికల పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2005లో బీహార్ శాసనసభ ఎన్నికలలో సిమ్రి భక్తియార్‌పూర్ నుండి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖగారియా నుండి పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2009లో శాసనసభ ఎన్నికలలో సిమ్రి భక్తియార్‌పూర్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.

దినేష్ చంద్ర యాదవ్ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఖగారియా నుండి పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత 2015లో శాసనసభ ఎన్నికలలో సిమ్రి భక్తియార్‌పూర్ నుండి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఆయన 2019, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మాధేపురా నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[5]

నిర్వహించిన పదవులు

[మార్చు]
# నుండి కు స్థానం
1 1990 1995 సిమ్రీ భక్తియార్‌పూర్ నియోజకవర్గం నుండి బీహార్ శాసనసభ్యుడిగా ఎన్నిక
2 1991 1995 డిప్యూటీ చీఫ్ విప్, బీహార్ శాసనసభ
3 1990 1992 సభ్యుడు, యాచికా కమిటీ, బీహార్ శాసనసభ
4 1992 1995 సభ్యుడు, ప్రార్థన & ధ్యానకర్షన్ కమిటీ, బీహార్ శాసనసభ
5 1996 1998 సహర్సా నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
6 1996 1998 సభ్యుడు, అంచనాల కమిటీ
7 1996 1998 సభ్యుడు, కమ్యూనికేషన్స్ కమిటీ
8 1996 1998 రైల్వే మంత్రిత్వ శాఖలోని కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
9 1996 1998 పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, జనతాదళ్
10 1996 1998 సభ్యుడు, కోషి డివిజన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, సహర్సా, బీహార్ ప్రభుత్వం
11 1999 2004 సహర్సా నుండి 13వ లోక్‌సభకు (2వసారి) ఎన్నికయ్యాడు
12 1999 2001 విదేశాంగ వ్యవహారాల కమిటీ సభ్యుడు
13 2000 2002 సభ్యుడు, పార్లమెంటు సభ్యులపై కమిటీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం
14 2000 2002 రైల్వే మంత్రిత్వ శాఖలోని కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
15 2001 2002 గ్రామీణాభివృద్ధి కమిటీ సభ్యుడు
16 2001 2004 పబ్లిక్ అండర్‌టేకింగ్ కమిటీ సభ్యుడు
17 2002 2004 సభ్యుడు, టేబుల్‌పై వేసిన పేపర్లపై కమిటీ
18 2003 2004 పెట్రోలియం, సహజ వాయువుపై కమిటీ సభ్యుడు
19 2003 2004 సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, ఉపరితల రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ
20 2005 సభ్యుడు, బీహార్ శాసనసభ (రెండోసారి)
21 2005 2009 సభ్యుడు, బీహార్ శాసనసభ (మూడవసారి)
22 2005 2008 సభ్యుడు, అంచనాల కమిటీ, బీహార్ శాసనసభ
23 2008 2009 మంత్రి, పరిశ్రమలు, బీహార్ ప్రభుత్వం
24 2009 2014 ఖగారియా నుంచి 15వ లోక్‌సభకు (3వసారి) ఎన్నికయ్యాడు
25 2009 తేదీ హోం వ్యవహారాల కమిటీ సభ్యుడు
26 2009 తేదీ సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, బొగ్గు, గణాంకాలు & ప్రోగ్రామ్ అమలు మంత్రిత్వ శాఖ
27 2009 తేదీ రాజభాషా కమిటీ సభ్యుడు
28 2009 తేదీ రైల్వే మంత్రిత్వ శాఖలోని కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
29 2015 2019 సిమ్రి భక్తియార్‌పూర్ నియోజకవర్గం నుండి బీహార్ శాసనసభ సభ్యుడు (4వ పర్యాయం).
30 2019 ప్రస్తుతం మాధేపురా నియోజకవర్గం నుండి 17వ లోక్‌సభకు (4వసారి) ఎన్నికయ్యాడు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Lok Sabha". Archived from the original on 1 January 2012. Retrieved 11 December 2011.
  2. Business Standard (2019). "Madhepura Lok Sabha Election Results 2019: Madhepura Election Result 2019 | Madhepura Winning MP & Party". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. The Times of India (29 May 2019). "Two more JD(U) MLAs resign from Bihar assembly after being elected as MPs". Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.
  5. The Indian Express (4 June 2024). "Lok Sabha Elections 2024 Results: Full List of winners on all 543 seats" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.