Jump to content

దాసు త్రివిక్రమరావు

వికీపీడియా నుండి
దాసు త్రివిక్రమరావు
దాసు త్రివిక్రమరావు
జననం(1894-09-06)1894 సెప్టెంబరు 6
India కొండముది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం1960 జూలై 31(1960-07-31) (వయసు 65)
జాతీయతభారతీయుడు
ప్రసిద్ధిన్యాయవాది, కార్మికనేత, గ్రంథాలయోద్యమనేత
మతంహిందూ
భార్య / భర్తవరలక్ష్మి (1896-1921)
వరలక్ష్మి అలిమేలుమంగమ్మ (1909-1990)
పిల్లలుకుమార్తె: వెంకట సీత బాయి
కుమారులు: అచ్యుతం
కృష్ణమూర్తి
నారాయణరావు
కేశవరావు
తండ్రిదాసు కేశవరావు
తల్లిసరస్వతమ్మ

దాసు త్రివిక్రమరావు (1894 - 1950) న్యాయవాది, కార్మిక నేత, గ్రంథాలయోద్యమ వ్యాప్తికి కృషి చేసిన వ్యక్తి.

జీవిత విశేషాలు

[మార్చు]

త్రివిక్రమరావు గుంటూరు జిల్లా, కొండముదిలో 1894 సెప్టెంబరు 6 న జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన పిదప చెన్నై చేరాడు. 1920 లో ఇంగ్లాండు వెళ్ళి బారిష్టరు పూర్తిచేశాడూ. అతను డి.టి. రావు గా పేరుపొందాడు. ఈయన తండ్రి దాసు కేశవరావు బెజవాడలో ఆధునిక ముద్రణ సాంకేతిక పరిజ్ఞానాన్నీ, యంత్రాలనూ ఏర్పాటు చేశాడు. తాత మహాకవి దాసు శ్రీరాములు. కవయిత్రి వేమూరి (దాసు) శారదాంబ ఇతని మేనత్త.

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఇంగ్లాండ్‌లో గ్రేస్ ఇన్ అను న్యాయ సంస్థలో చేరి అక్కడ భారతదేశం తరపున పనిచేసాడు. ఆ సమయంలో వి.వి.గిరి తో పరిచయం, స్నేహం పెంపొందాయి. వి.వి.గిరి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు భారతీయ రైల్వే మెన్ సమాఖ్య కి (Indian Railwaymen Federation) ఉపాధ్యక్ష్యుడుగా పనిచేసాడు. భారత్‌లో బ్రిటిష్ పరిపాలన ఉన్నంతవరకు న్యాయవాదిగా పనిచెయ్యనని తప్పుకున్నాడు. 1935 లో మద్రాస్ ప్రెసిడెన్సీ లోని ఆంధ్ర ప్రాంతంలో 'ఆంధ్ర వార్త' అను తెలుగు దినపత్రికను ఆరంభించాడు. 1939 - 1942 మధ్యలో 'డైలీ న్యూస్' అనే ఇంగ్లీషు దినపత్రికను నడిపించాడు. హైదరాబాద్ ప్రభుత్వానికి గనుల సలహాదారుగా, చమురు పరిశ్రమలకు వేతన సంఘానికి అధ్యక్షుడుగా, సింగరేణి కాలరీస్ ముఖ్య కార్మిక అధికారిగా ఉన్నత పదవులు నిర్వహించాడు.[1]

1960 జులై 31 న తన 65వ ఏట హైదరాబాదులో మరణించాడు.

గ్రంథాలయోద్యమం

[మార్చు]

త్ర్విక్రమరావు, విజయవాడలోని రామమోహన గ్రంథాలయం అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని 1934 లో చెన్నైలో జరిగిన 19 వ రాష్ట్ర గ్రంథాలయ మహాసభలకు అధ్యక్షత వహించాడు. విజయవాడ కేంద్రంగా పనిచేసిన అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘానికి 1919 నుండి సంయుక్త కార్యదర్శిగా ఉన్నాడు. 1934 డిసెంబరు నుండి 1936 మార్చి వరకు ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘానికి అధ్యక్షుడుగా పని చేసారు.[2]

ఆ సంఘం ముద్రించిన ఇండియన్ లైబ్రరీ జర్నల్ అను ఆంగ్ల పత్రికకు సంపాదకులుగా పనిచేశాడు. 1928 లో గ్రేట్ బ్రిటన్ లో జరిగిన ఆ దేశపు గ్రంథాలయ మహాసభకు భారత ప్రతినిధిగా హాజరయ్యాడు.[3][4] గాడిచర్ల హరిసర్వోత్తమ రావు సంపాదకత్వంలో విజయవాడ నుండి వెలువడిన "ఆంధ్రవాణి" అను దిన పత్రికను, "సండే న్యూస్" అనే ఆంగ్ల వార్తాపత్రికనూ త్రివిక్రమరావు నిర్వహించాడు.[5]

1933 లో తిరుచిరాపల్లిలో జరిగిన ప్రథమ తమిళనాడు రూరల్ లైబ్రరీ సర్వీస్ సమావేశానికి అధ్యక్షత వహించాడు. అదే సంవత్సరం కోల్కతా లో జరిగిన ఇండియన్ లైబ్రరీ కాన్ఫరెన్స్ కు హాజరై ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Harinarayana Rao, Dasu (2018). Complete Story of Genealogy of Dasu Family. pp. 45–46.
  2. "Andhra Pradesh Library Association/Leaders". Andhra Pradesh Library Association. Archived from the original on 2023-03-12. Retrieved March 12, 2023.
  3. 3.0 3.1 "దాసు త్రివిక్రమరావు". గ్రంథాలయ సర్వస్వము. 7. January 1928. Retrieved 8 March 2015.
  4. "Indian Library Association/Founding Members". ndian Library Association. Retrieved March 12, 2023.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "అననగా ...గ్రంథాలయోద్యమము". ఆంధ్రజ్యోతి. 2004-11-19.