Jump to content

దాసి సుదర్శన్

వికీపీడియా నుండి
దాసి సుదర్శన్
జననంఫిబ్రవరి 02 1951
మిర్యాలగూడ గ్రామం, భువనగిరి మండలం నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణంఏప్రిల్ 1 2024
నివాస ప్రాంతంనాగార్జున సాగర్
ఇతర పేర్లుదాసి సుదర్శన్
వృత్తిఆర్ట్ టీచర్, గవర్నమెంట్ మోడల్ స్కూల్, నాగార్జున సాగర్
ప్రసిద్ధిచిత్రకారుడు
మతంహిందూ
తండ్రిపిట్టంపల్లి మట్టయ్య
తల్లిపిట్టంపల్లి లక్ష్మమ్మ

దాసి సుదర్శన్ గా ప్రఖ్యాతి గాంచిన వీరి పూర్తి పేరు పిట్టంపల్లి సుదర్శన్. తెలంగాణ రాష్ట్రం లోని యాదాద్రి - భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు. ఆర్ట్ టీచర్, గవర్నమెంట్ మోడల్ స్కూల్, నాగార్జున సాగర్ కే పరిమితం గాకుండా కళాత్మక చిత్రాలైన దాసి, మా ఊరు, మట్టిమనుషులు లాంటి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా, అసోసియేట్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసారు. రాష్ట్రంలోని ఎందరో కవులు సాహితీ వేత్తల పుస్తకాలకు ముఖ చిత్రాలనందించారు.


బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

సుదర్శన్ ఫిబ్రవరి 02 1951 లో యాదాద్రి - భువనగిరి జిల్లా జిల్లాలోని మిర్యాలగూడలో జన్మించాడు. బి.ఏ. గ్రాడ్యుయేషన్, బి.యిడి. తో పాటు, చిత్రకళపై ఆసక్తితో పెయింటింగ్ లో డిప్లోమా చేశాడు.

వృత్తి జీవితం

[మార్చు]

1989లో ప్రముఖ కళాకారుడు బి. నరసింగరావు తీసిన “దాసి” చలన చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసి ఆ ఏడాది ఆ సినిమాకు జాతీయ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా రాష్ట్రపతి నుండి అవార్డ్ అందుకోవడంతో నాటి నుండి పిట్టంపల్లి సుదర్శన్ పేరు ‘దాసి’ సుదర్శన్ గా స్థిరపడి పోయింది. 1992 లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ముఖ్యమంతి నుండి పురష్కారం అందుకున్నారు.

మరణం

[మార్చు]

2024 లో ఏప్రిల్ 1 న దాసి సుదర్శన్ మరణించాడు.