Jump to content

దాసరి హర్షిత

వికీపీడియా నుండి

చిన్న వయసులోనే శాస్త్ర సాంకేతిక రంగంలో వినూత్నమైన ప్రతిభను కనబరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది పెద్దపల్లి జిల్లాకు చెందిన దాసరి హర్షిత[1]. ఆమె తయారు చేసిన కామన్‌మాన్‌ ఫ్రెండ్లీ మల్టీపుల్‌ హెల్మెట్‌ అంతర్జాతీయ స్థాయిలో ప్రసంసలను అందుకుంది.

వ్యక్తిగత విషయాలు

[మార్చు]

దాసరి హర్షిత[2] పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బపల్లి. తల్లిదండ్రులు స్వప్న, శ్రీనివాస్‌లు వ్యవసాయ కూలీలుగా పని చేస్తారు. ఆమె చందనాపూర్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతోంది.

వినూత్న ఆలోచన

[మార్చు]

హర్షిత మామయ్య గోదావరిఖనిలో వెల్డింగ్‌ పనులు చేస్తుండేవాడు. కొద్దిరోజులకు వెల్డింగ్‌ చేసేటప్పుడు వచ్చే కెమికల్‌ పొగ ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిని అనారోగ్యానికి గురయ్యాడు. ఇలా మరెవరూ కావొద్దని హర్షిత సంకల్పించుకుంది. పాఠశాలలో సైన్స్‌ పాఠాలను బోధించే సంపత్‌కుమార్‌ సార్‌కు సమస్య వివరించింది. ఆయన సహకారంతో పది రోజుల పాటు నిరంతర శ్రమించి కామన్‌మాన్‌ ఫ్రెండ్లీ మల్టిపుల్‌ హెల్మెట్‌ను తయారు చేసి, ఆమె మామయ్యకు బహుమతిగా ఇచ్చింది. ఇది వెల్డింగ్‌ పనులకే కాకుండా, కార్పెంటర్స్‌, ట్రాఫిక్‌ పోలీసులకు ఉపయోగపడుతుంది. ఇది ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ప్రసంసలను అందుకుంటోంది.

జాతీయ ఖ్యాతీ

[మార్చు]

హర్షిత[3] తయారు చేసిన కామన్‌మాన్‌ ఫ్రెండ్లీ మల్టీపుల్‌ హెల్మెట్‌ తొమ్మిదో జాతీయ స్థాయి ఇన్‌స్పైర్‌ అవార్డుల పోటీల్లో సత్తాచాటింది. దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగే ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌’ (ఫైన్‌-2023)లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకుంది. ఈ పోటీలకు దేశంలో 60 ప్రాజెక్ట్‌లు ఎంపిక కాగా, అందులో తెలంగాణ నుంచి ఎనిమిది ఎంపికయ్యాయి. ఇందులో హర్షిత ప్రాజెక్టు ఒకటి. ఈ ఆవిష్కరణకు ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన జాతీయ ఇన్‌స్పైర్‌లో కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్రసింగ్‌ చేతుల మీదుగా హర్షిత అవార్డును అందుకుంది. ఫైన్‌ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తను తయారు చేసిన హెల్మెట్‌ గురించి వివరించి, దేశ ప్రథమ పౌరురాలి మన్ననలు పొందింది.

అంతర్జాతీయ ఖ్యాతీ

[మార్చు]

హర్షిత ఆవిష్కరణ రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడంతో ఆమెకు జపాన్‌ దేశంలో జరిగే ఇంర్నేషనల్‌ సైన్స్‌ ఫెయిర్‌ నుంచి ఆహ్వానం అందుకుంది. నవంబర్‌ 5, 2023న టోక్యో నగరంలో గైడ్‌ టీచర్‌ సంపత్‌ కుమార్‌ సాయంతో తయారు చేసిన బహుళ ప్రయోజనకర హెల్మెట్‌ను ప్రదర్శించి అంతర్జాతీయ ప్రతినిధుల ప్రశంసలను అందుకుంది హర్షిత.

మూలాలు

[మార్చు]
  1. Namaste Telangana https://www.ntnews.com/karimnagar/inspire-award-winners-from-villages-to-meet-president-of-india-1035008. {{cite news}}: Missing or empty |title= (help)
  2. Sakshi https://www.sakshi.com/telugu-news/peddapalli/1835530. {{cite news}}: Missing or empty |title= (help)
  3. Sakshi https://www.sakshi.com/telugu-news/karimnagar/1844822. {{cite news}}: Missing or empty |title= (help)