Jump to content

దాసరి సుధ

వికీపీడియా నుండి
దాసరి సుధ
దాసరి సుధ


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2 నవంబర్ 2021
నియోజకవర్గం బద్వేలు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 9 ఫిబ్రవరి 1972
పెద్దుళ్లపల్లె గ్రామం , బి.కోడూరు మండలం , కడప జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు డాక్టర్‌ డి.ఓబులయ్య, డి.విక్టోరియా
జీవిత భాగస్వామి గుంతోటి వెంకట సుబ్బయ్య
సంతానం హేమలత, తనయ్‌

దాసరి సుధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2021 అక్టోబరు 30లో జరిగిన ఉప ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

దాసరి సుధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, బి.కోడూరు మండలం, పెద్దుళ్లపల్లె గ్రామంలో 1972 ఫిబ్రవరి 9లో డా. డి.ఓబులయ్య, డి.విక్టోరియా దంపతులకు జన్మించింది. ఆమె కర్నూలులో ఎంబీబీఎస్‌ డి.జి.ఓ. పూర్తి చేసింది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

దాసరి సుధ 2014 ఎన్నికల్లో తన భర్త దివంగత ఎమ్మెల్యే డా. జి.వెంకటసుబ్బయ్యతో పాటు ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసింది. గుంతోటి వెంకట సుబ్బయ్య 2021 మార్చి 28న మరణించడంతో బద్వేలు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో సుధను సెప్టెంబరు 28న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది.[2] ఆమె 2021 అక్టోబరు 30లో జరిగిన ఉప ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప పత్యర్థి బీజేపీ అభ్యర్థి పి సురేశ్‌పై పై 90,533 ఓట్ల తేడాతో 2021 నవంబరు 2న ఎమ్మెల్యేగా గెలిచింది.[3]

దాసరి సుధ 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో బద్వేలు నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (29 September 2021). "బద్వేలు ఉపఎన్నిక: ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..." Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.
  2. Sakshi (28 September 2021). "బద్వేలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దాసరి సుధ: సజ్జల". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.
  3. Andrajyothy (2 November 2021). "బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.
  4. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=దాసరి_సుధ&oldid=4229117" నుండి వెలికితీశారు